మీకు ఎస్బీఐ లో ఖాతా ఉందా?ఐతే ఈ నిబంధనలు తప్పక పాటించాలి?

వచ్చే రెండు నెలల్లో, భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నాలుగు సేవలను నిలిపివేయనుంది.

వచ్చే రెండు నెలల్లో, భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నాలుగు సేవలను నిలిపివేయనుంది. మొదట, బ్యాంక్ యొక్క క్లాసిక్ మరియు మాస్ట్రో డెబిట్ కార్డులను వాడుతున్న వినియోగదారులు అక్టోబరు 31 నుండి ఎటిఎం ద్వారా రూ.20,000 లకు మించి ఉపసంహరణ చేయలేరు. రెండవది, నవంబరు 1 నుండి బ్యాంకు తన మొబైల్ వాలెట్ ఎస్బిఐ బడ్డీని మూసివేస్తోంది. మూడవది వ్యక్తి కి సంబందించిన మొబైల్ నెంబర్ కాథా కు జత చేయని వారికి డిసెంబర్ 1 నుండి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం రద్దు చేయబడుతుంది చివరిది మాగ్నెటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులు డిసెంబర్ 31 నుండి పనిచేయవు.

నగదు పరిమితి

నగదు పరిమితి

ఎటిఎంల నుండి మోసపూరితమైన నగదు ఉపసంహరణల నుండి కస్టమర్లను కాపాడటానికి మరియు డిజిటల్ లావాదేవీలను మరింత పెంచటానికి ఎస్బిఐ నగదు ఉపసంహరణ పరిమితి చేయబడింది.మొత్తం ఎటిఎం లావాదేవీలను తాము విశ్లేషించామని మరియు వారిలో చాలామంది రు .20,000 కంటే తక్కువగా ఉపసంహరణ చేసే వారి సంఖ్య చాల ఎక్కువ ఉన్నారని కనుగొన్నాం అన్నారు అలాగే మాకు అందిన ఫిరియాదుల్లో చాల వరకు రూ.40 000 పైన ఉపసంహరణ ఉందని అన్నారు అందుకే వినియోగదారులకు రక్షణ కల్పించడమే ప్రధానంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, తద్వారా డిజిటల్ లావాదేవీలు మరింతగా పెరగాలని మేము కోరుకుంటున్నాం '' అని ఎస్బిఐ మేనేజింగ్ డైరెక్టర్ పికె గుప్తా చెప్పినట్లు పిటిఐ పేర్కొంది.

ప్రభావం:

ప్రభావం:

నగదు పరిమితి పెద్ద సంఖ్యలో వినియోగదారులను ప్రభావితం చేస్తుంది. అయితే ఎటిఎం నుంచి రూ .20,000 లకు పైగా ఉపసంహరణ చేయాలనుకున్న వారు ఎస్బిఐ కస్టమర్లు బ్యాంకు అందించే ఇతర కార్డులకు మారవచ్చు.

BUDDY వాలెట్ రద్దు:

BUDDY వాలెట్ రద్దు:

ఎస్బిఐ బడ్డిని మూసివేసే నిర్ణయం వినియోగదారులకు తెలియజేయబడింది. ఎస్బిఐ బడ్డీని మూసివేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు నోటీసు ద్వారా అధికారిక సమాచారం వెల్లడైంది. గత ఏడాది చివరి నాటికి ఈ అనువర్తనం 12 మిలియన్ల మందికి పైగా వినియోగదారులను కలిగి ఉంది.ఐతే బడ్డీ ఖాతాలో బ్యాలెన్స్ ఉన్న వారికి ఏమి జరుగుతుందో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ప్రభావం:

ప్రభావం:

బడ్డీ మూసివేసిన నిర్ణయం ఎటువంటి ప్రభావాన్ని చూపదు అంటున్నారు.ఎస్బిఐ ఇప్పటికే మరొక మొబైల్ వాలెట్ - YONO - కస్టమర్ల కోసం ఒక ఎంపికను ఇచ్చింది. ఈ YONO ద్వారా సాంగిక జీవితం లో కొనసాగుతున్న తరుణంలో ప్రజలకు మరింతగా చేరువ అవుతుందని బ్యాంక్ అధికారులు అంటున్నారు.

మొబైల్ లింకింగ్

మొబైల్ లింకింగ్

ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని కొనసాగించటానికి బ్యాంక్ తో డిసెంబర్ 1, 2018 లోపు తమ మొబైల్ నంబర్లను రిజిస్టర్ చేయాలనీ ఎస్బిఐ నోటిఫై చేసింది. బ్యాంక్ యొక్క అధికారిక వెబ్ సైట్ ప్రకారం,బ్యాంక్ INB దరఖాస్తుదారులు, దయచేసి మీ మొబైల్ నంబరు వెంటనే మా బ్యాంక్ వద్ద రిజిస్టర్ చేసుకోండి అంటున్నారు.ఒకవేళ రిజిస్టర్ చేయలేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం 01.12.2018 నుండి సఉపాయం రద్దు అవుతుంది.

ప్రభావం:

ప్రభావం:

చాలామంది వినియోగదారులు తమ మొబైల్ నంబర్లను ఇప్పటికే నమోదు చేసుకున్నారు. ఐతే, అలా చేయని వారు ఇంటర్నెట్ బ్యాంకింగ్ను రద్దు చేయబడుతుంది, ఇది సాధారణ బ్యాంకింగ్ కంటే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

డెబిట్ కార్డు భర్తీ

డెబిట్ కార్డు భర్తీ

ఆర్బిఐ ఆర్డర్ ప్రకారం, డిసెంబర్ 31 కి EMV చిప్ తో కూడిన కార్డులు ముందు ఉన్న అయస్కాంత గీత ఉన్న డెబిట్ కార్డులకు బదులుగా భర్తీ చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) వినియోగదారులను కోరింది. రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా మాట్లాడుతూ చిప్ కార్డుల ద్వారా మోసాల నుండి కస్టమర్లను కాపాడటానికి ఒక లక్ష్యంతో

చిప్ ఆధారిత మరియు పిన్-ఎనేబుల్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు ప్రవేశపెడుతున్నాం అన్నారు. EMV చిప్ కార్డు నకిలీ (స్కిమ్మింగ్) కార్డు మోసం వ్యతిరేకంగా రక్షిస్తుంది. ఇంకా చదవండి

ప్రభావం:

ప్రభావం:

ఎస్బిఐ కస్టమర్లు ఈ నిర్ణయం వల్ల కస్టమర్ల పై ఎటువంటి ప్రభావం చూపదన్నారు. చాలామంది బ్యాంకు ఖాతాదారులు ఇప్పటికే EMV చిప్ ఆధారిత కార్డును ఉపయోగిస్తున్నారు.వీటిని బ్యాంకు ఉచితంగా భర్తీ చేస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+