వాహనదారులకు కాస్త ఊరటనిచ్చే విషయం ఇది. గత కొంతకాలంగా భారీగా పెరిగిన ఇందన ధరలు.. ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో దేశంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు దిగొస్తున్న విషయం తెలిసిందే. వరుసగా 12వ రోజు వీటి ధరలు మరికాస్త తగ్గాయి. దీంతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 80 దిగువకు వచ్చింది. దిల్లీలో సోమవారం లీటర్ పెట్రోల్ ధర 30 పైసలు తగ్గి రూ. 79.75గా ఉంది. ఇక డీజిల్ కూడా 20 పైసలు తగ్గి రూ. 73.85గా ఉంది.

ధరలు అత్యధికంగా ఉండే ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 85.24గా ఉంది. కోల్‌కతాలో రూ. 81.63, చెన్నైలో రూ. 82.86, హైదరాబాద్‌లో రూ. 84.54కు చేరింది. ఇక డీజిల్ ధర ముంబయిలో రూ. 77.40, కోల్‌కతాలో రూ. 75.70, చెన్నైలో రూ. 78.08, హైదరాబాద్‌లో రూ. 80.35గా ఉంది.
అక్టోబరు 18 నుంచి ఈ తగ్గింపు కొనసాగుతోంది. ఈ 12 రోజుల్లో లీటర్ పెట్రోల్‌పై రూ. 3.08 తగ్గగా.. 11 రోజుల్లో(అక్టోబరు 24న డీజిల్ ధర స్థిరంగా ఉంది) డీజిల్‌పై రూ. 1.84 తగ్గింది. అంతకుముందు దాదాపు 2 నెలల పాటు ఇంధన ధరలు ఆకాశన్నంటిన విషయం తెలిసిందే. ఓ దశలో దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.84, డీజిల్ రూ.74.73కు చేరుకున్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications