కొత్త కస్టమర్లకు భారీ ఆఫర్లు ఇస్తున్న ఆన్ లైన్ రిటైల్ సంస్థలు

పండుగ సీజన్‌లో ఆఫర్లు వినియోగదారులను అత్యంత ఆకట్టుకునేలా ఉంటాయి. డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అంటూ కస్టమర్లను ఆకర్షించేందుకు ఆన్‌లైన్ రిటైల్ సంస్థలు ప్రయత్నిస్తాయి. ఇప్పటికే పలు సంస్థలు పండుగ సీజన్ ఆఫర్లను ప్రకటించాయి. ఈ రిటైలర్ల అమ్మకాలు పెరిగి, వారి ఆదాయం పెంచుకునేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు, మార్కెటింగ్ వ్యూహాలు అనుసరిస్తున్నాయి. ఈ పండుగ సీజన్లో ఈ రిటైలర్లు అందించే ప్రత్యేక డీల్స్, ఆఫర్లు, డిస్కౌంట్లను అందిపుచ్చుకోవాలని వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కొత్త కస్టమర్లకు ఆన్‌లైన్ రిటైలర్లు మెరుగైన డీల్స్‌ను అందిస్తున్నాయి. మీరు పాత కస్టమర్ అయితే ఈ పండుగ సీజన్‌లో రిటైలర్లు అందించే అత్యుత్తమ డీల్స్‌ను ఆస్వాదించలేరు. బెస్ట్ డీల్స్ పొందేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

చాలా ఆన్లైన్ రిటైలర్లు మొదటిసారిగా సందర్శకులకు ప్రత్యేక అందిస్తున్నాయి. వెబ్‌సైట్ కుకీస్‌ను సేవ్ చేసినా, మీరు ఇప్పటికే వెబ్ సైట్లో ఉన్నట్లయితే, మీకు ఆకర్షణీయమైన డీల్స్‌ను పొందలేకపోవచ్చు. మీరు ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్‌లో ఉన్నట్లయితే, క్రొత్త అకౌంట్‌తో లాగ్ ఇన్ అవ్వాలి. దీని ద్వారా మీరు ప్రత్యేకంగా కొత్త / కొత్త కస్టమర్లు పొందే డిస్కౌంట్లను పొందవచ్చు. మీరు ఈ ఆఫర్లను పొందడానికి అనేక ఐడిలు లేదా కుటుంబ సభ్యుల పేరిట అకౌంట్లను తెరవాల్సి ఉంటుంది.

కొత్త కస్టమర్లకు భారీ ఆఫర్లు ఇస్తున్న ఆన్ లైన్ రిటైల్ సంస్థలు

కూపన్ దునియా, గ్రాబ్‌ఆన్, కూపన్జ్‌గురు, మైటోక్రి, ఫ్రీ కూపన్‌ఇండియా వంటి అనేక కూపన్ సైట్లు ఉన్నాయి. వీటిలో ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ సైట్ల నుంచి క్యాబ్ అగ్రిగేటర్స్ వరకు వివిధ కూపన్ సైట్లు ఉన్నాయి. ఈ కూపన్ వెబ్‌సైట్ల ద్వారా బ్రౌజింగ్ చేసి అదనపు డిస్కౌంట్లు, ఫ్రీ డెలివరీ వంటివి పొందవచ్చు. ఈ కూపన్లు ఆన్‌లైన్‌లో రిడీమ్ చేయవచ్చు. కూపన్ గడువు తేదీని, షరతులను చూసుకుని వినియోగించుకోవాలి.

అన్ని రిటైల్ సంస్థలు బెస్ట్ డీల్స్, ఆఫర్లను అందిస్తాయి. అయితే అత్యధికంగా డిస్కౌంట్లను ఇచ్చేది ఏ రిటైలరో తెలుసుకోవాలంటే వాటి పోల్చి చూసుకోవాలి. ఉత్పత్తుల డీల్స్, ధరలను పరిశీలించాలి. వీటి కోసం కూడా వివిధ సైట్లు ఉన్నాయి. pricedekho, BuyHatke, MySmart Price, Smartprix వంటి వెబ్‌సైట్లలో ధరలను సరిపోల్చడానికి అవకాశం ఉంటుంది. వీటి ద్వారా మీరు తక్కువ ధర అందించే రిటైలర్ ఏదో ఎంచుకోవచ్చు. వీటిలో స్మార్ట్‌ఫోన్లు, గృహోపకరణాలు, హోటల్ గదులు, మొబైల్ ఉపకరణాలు, ఇంకా ఇతర వస్తువులను పోల్టి చూడవచ్చు.

గొప్ప డిస్కౌంట్లను అందించే పలు వెబ్‌సైట్లు ఉన్నాయి. అయితే మీరు వీటిని గుర్తించలేరు కారణం వాటి గురించి తెలియకపోవడమే. మీరు ఇరిటైల్ వేదికలను చూడడానికి ముందు డిస్కౌంట్, కూపన్లు ద్వారా స్కాన్ చేయగల కొన్ని బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌లు, కూపన్లు పరిశీలించాలి. మీరు కూపన్ వెబ్‌సైట్ల ద్వారా స్క్రోల్ చేయకూడదనుకుంటే అప్పుడు మీరు మీ ఇంటర్నెట్ బ్రౌజర్లలో ShopSmart, BuyHatke వంటి ఎక్స్‌టెన్షన్లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీంతో పండుగ సీజన్ డీల్స్, మరింత తగ్గింపు ఆఫర్లను పొందవచ్చు.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజాలు క్యాష్ బ్యాక్ ఆఫర్లు అంది స్తాయి. అయితే మీరు ఈ క్యాష్‌బ్యాక్ లాభాలను మరిం తగా పొందా లంటే.. Tapzo, GoPaisa, MagicPin వంటి యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవా ల్సి ఉంటుంది. మీరు క్యాష్‌బ్యాక్ ఆఫర్లను పొందడమే కాదు, వీటితో ఇతర డిస్కౌంట్, డీల్స్, కూపన్లు పొందవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+