సామాన్య ప్రజలకు ఊరట:వరుసగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధరలు.
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధరలు శనివారం కూడా తగ్గుముఖం పట్టాయి. పెట్రోలు పెట్రోలు పై లీటరుకు 40 పైసలు తగ్గించగా, అలాగే డీజిల్ పై ధరలు 35 పైసలు పడిపోయాయి.
న్యూఢిల్లీ:గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధరలు శనివారం కూడా తగ్గుముఖం పట్టాయి. పెట్రోలు పెట్రోలు పై లీటరుకు 40 పైసలు తగ్గించగా, అలాగే డీజిల్ పై ధరలు 35 పైసలు పడిపోయాయి.

పెట్రోలు లీటర్ ఢిల్లీలో రూ.80.45 రూపాయలు ఉండగా డీజిల్ రూ.74.38 రూపాయల వద్ద ఉంది. ముంబయిలో పెట్రోలు లీటరుకు రూ.85.93 రూపాయలుగా ఉండగా, డీజిల్ రూ.77.96 రూపాయలుగా ఉంది.
గత కొన్ని నెలల నుండి రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలు ఈ వారంలో చాలా వరకు పడిపోయి సామాన్యుడికి కాస్త ఊరట లభిస్తోంది.
ఇంధన ధరల తగ్గుముఖం పట్టడంతో ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల ప్రపంచ, భారతీయ చమురు, గ్యాస్ కంపెనీల అత్యున్నత అధికారులతో సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యొక్క ఆంక్షలు అలాగే ఎవరైనా ఇరాన్ నుండి చమురు కొనుగోలు చేసేవారిపై ఆంక్షలు విధించాడు.
అక్టోబర్ 4 న, పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ. 1.50 చొప్పున ఎకై్సజ్ డ్యూటీని తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించగా అలాగే మరో రూ.1 ఇంధన సబ్సిడీ కింద తగ్గించాలని కేంద్రం కోరింది ఈ మొత్తం తగ్గింపు లీటరుకు రూ. 2.50 రూపాయల చొప్పున ధరలు తగ్గాయి.
ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఇంధన ధరలను సవరిస్తారు. గత ఏడాది జూన్ మధ్యకాలంలో ఇంధన రేట్లను రోజువారీగా పునర్విమర్శ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.
బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 51 సెంట్లు లేదా 0.7 శాతం క్షీణించి 76.38 డాలర్ల మేరకు బ్యారెల్కు పడిపోయాయి. ప్రపంచ బెంచ్ మార్కు 4 శాతం పైగా వారాంతపు నష్టాన్ని చవిచూస్తోంది.


Click it and Unblock the Notifications