For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పు చేసి ఇల్లు కొంటున్నారా? అయితే ఇది మీకోసమే!

By girish
|

సరైన ప్రాంతంలో కొంటేనే కాలంతోపాటు ఆస్తుల విలు వ పెరుగుతాయి. రెండో ఇంటిని కొనేటప్పుడు ఈ విషయా న్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.

 ఆస్తి విలువ

ఆస్తి విలువ

ముఖ్యంగా మౌలిక సదుపాయాలు ఉన్న లేదా ఏర్పడుతున్న ప్రాంతాల్లో కొంటే ఆస్తి విలువ బాగా పెరిగే అవకాశం ఉంది.

పిండి కొద్ది రొట్టె

పిండి కొద్ది రొట్టె

పిండి కొద్ది రొట్టె. ఆస్తుల కొనుగోలుకూ ఈ సూత్రం వర్తిస్తుంది. రెండో ఇల్లు కొనేటప్పుడు బడ్జెట్‌ ఎంతో ముందే నిర్ణయించుకోవాలి. ప్రస్తుతం బిల్డర్లు ఆయా వర్గాల బడ్జెట్‌కు అనుగుణంగా ఇళ్లు, ఫ్లాట్లు అందిస్తున్నారు. కొనుగోలుదారులు చేయాల్సిందల్లా తమ బడ్జెట్‌కు అనువైన ఆస్తులను ఎంపిక చేసుకోవడమే. మార్కెట్‌ పరిస్థితులు, ఆయా వ్యక్తుల ఆర్థిక స్థోమతను బట్టి రెండో ఇంటి కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలి. పెద్ద నోట్ల రద్దు, జిఎ్‌సటి, రెరా చట్ట ప్రభావం నుంచి రియల్టీ మార్కెట్‌ ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. ఆదాయ ఆర్జన లేదా పెట్టుబడి లాభాల కోసం రెండో ఇంటిని కొనే వ్యక్తులు దీన్ని అవకాశంగా ఉపయోగించుకుని మంచి ప్రాంతాల్లో ఇల్లు కొనుగోలు చేయడం మంచిది.

రియల్‌ ఎస్టేట్‌

రియల్‌ ఎస్టేట్‌

గత రెండేళ్ల నుంచి దేశంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం కష్టాల్లోనే ఉంది. గత ఏడాది తీవ్ర సంక్షోభం ఎదుర్కొంది. హైదరాబాద్‌, విజయవాడ, వైజాగ్‌తోపాటు ప్రధాన నగరాల్లో మార్కెట్‌ కోలుకుంటోంది. రెండో ఇల్లు కొనాలనుకునే వ్యక్తులు, బిల్డర్ల ట్రాక్‌ రికార్డు ఆధారంగా ఆయా ప్రాజెక్టుల్లో ఆస్తులను ఎంపిక చేసుకోవాలి. అధిక సరఫరా లేని ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు/ఫ్లాట్లనే కొనడం మంచిది.

కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దిగువ మధ్య తరగతి వర్గాలకు అందుబాటు ధరల్లో (అఫర్డబుల్‌) ఇళ్లకు ప్రాధాన్యత ఇస్తోంది. సరైన ప్రాంతంలో ఈ తరహా ఇల్లు/ఫ్లాట్‌ కొనుగోలు చేస్తే ఆస్తుల విలువ పెరగడంతోపాటు, అద్దె ఆదాయానికీ ఢోకా ఉండదు.

బ్యాంకులు

బ్యాంకులు

బ్యాంకులు/ఆర్థిక సంస్థలు 30 ఏళ్ల కాలానికి లేదా రిటైర్‌మెంట్‌నాటికి రుణాలు పూర్తిగా తీర్చేలా గృహ రుణాలను ఇస్తుంటాయి. ఒక వ్యక్తి రుణంతో రెండో ఇల్లు కొంటున్నాడంటే ఆ వ్యక్తి సంపాదన పరంగా మంచి స్థితిలో ఉన్నాడని అర్థం. అయినా రెండో ఇంటి కొనుగోలుకు లోన్‌ ఇచ్చేటప్పుడు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు 25 శాతం వరకు డౌన్‌ పేమెంట్‌ అడుగుతుంటాయి. అంటే రూ.50 లక్షల విలువైన ఇల్లు కొంటే కనీసం రూ.12.5 లక్షలైనా కొనుగోలుదారుల జేబు నుంచి చెల్లించాలి. దీనికి తోడు అన్ని రకాల లోన్లపై చెల్లించే ఈంఐల భారం మొత్తం నెలవారీ ఆదాయంలో 50 శాతం మించకుండా చూసుకోవాలి.

ఇంటి రుణాన్ని

ఇంటి రుణాన్ని

రెండో ఇల్లుకు ఇచ్చే గృహ రుణంపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎక్కువ వడ్డీ రేటు వసూలు చేస్తాయి. నష్ట భయమే ఇందుకు కారణం. అయితే ముందుకొన్న ఇంటి రుణాన్ని తీర్చేసి, రెండో ఇంటి కొనుగోలుకు అవసరమైన హోమ్‌ లోన్‌ కోసం అదే బ్యాంక్‌ లేదా ఆర్థిక సంస్థను ఆశ్రయిస్తే తక్కువ వడ్డీకే రుణం లభించే అవకాశం ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆస్తుల విలువలో 80-90 శాతం వరకే రుణంగా ఇస్తాయి.

రెండో ఇల్లు

రెండో ఇల్లు

రెండో ఇల్లు కొనేలోపే మొదటి రుణం తీర్చేసి ఆర్థికంగా మంచి క్రెడిట్‌ స్కోరు సంపాదిస్తే ఇవే సంస్థలు రెండో ఇంటి కొనుగోలుకు ఖర్చు చేసే పూర్తి మొత్తాన్ని రుణంగా ఇచ్చే అవకాశం ఉంది. అయితే దీని వలన అసలు, వడ్డీ చెల్లింపులు భారంగా మారే అవకాశం ఉంది. రిపోర్ట్స్ ఫ్రొమ్ ఏ బి న్

Read more about: loan
English summary

అప్పు చేసి ఇల్లు కొంటున్నారా? అయితే ఇది మీకోసమే! | Are You Buying House

In the right area, the property will grow at the same time as the property. This thing must be remembered when buying a second home
Story first published: Saturday, October 27, 2018, 17:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X