For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎల్.ఐ.సీ అందిస్తున్న ఒక అద్భుతమైన పాలసీ మీకోసం!

By girish
|

ఈ రోజుల్లో కచ్చితంగా పది మందిలో ఇద్దరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది చికిత్స ఖరీదైన వ్యవహారమే. క్యాన్సర్‌ను తగ్గించుకోవడం ఎంత కష్టమో దాని కయ్యే ఖర్చు అంతకు మించి భారం. ఆస్తులు అమ్ముకునే కష్టం నుండి ఆపద్బంధువులా ఓ మంచి అవకాశాన్ని ఇస్తుంది ఆరోగ్యబీమా సంస్థ. అదే ఆరోగ్యమస్తు పాలసీ. రెండొంతుల క్యాన్సర్ మరణాలు పేద, మధ్యతరగతి దేశాల్లోనే వస్తున్నాయని ఓ అధ్యయనంలో తెలిసింది. అందులో ఎక్కువ భాగం ముందుగా గుర్తించి చికిత్స అందించడం ద్వారా నయం చేయొచ్చని డబ్ల్యూహెచ్‌వో వెల్లడిస్తోంది.

వివరాలు

వివరాలు

పాలసీ వివరాలు బెనిఫిట్స్ అఫ్ ఎల్.ఐ.సీ. కాన్సర్ కవర్ (ప్లాన్ 905) ప్రకారం కేస్ ఎ1 వ స్టేజీ, కేస్ మేజర్ స్టేజీలుగా పాలసీలను ప్రకటించారు. ఇప్పటి వరకు 4500 ఆసుపత్రుల్లో నగదు లేని క్యాన్సర్ చికిత్సను పొందే అవకాశం కల్పిస్తున్నారు. పాలసీ ఎ, బి స్టేజీల్లో నగదు చెల్లింపుల భారంలో లంప్ స్టేజీ బెనిఫిట్ , ప్రీమియర్ స్టేజీ బెనిఫిట్ తో వెసులుబాటు కల్పించారు. పేషెంట్ చెల్లించిన రెగ్యులర్ ప్రీమియర్ ప్లాన్‌కి ఇన్పురెన్స్ వారు డబ్బుని జతచేసి భరోసా ఇస్తారు. పొందాలనుకున్న వారు అప్లై చేసి 180 రోజులు వేచి ఉండాలి.

ఎల్‌ఐసీ

ఎల్‌ఐసీ

ఎవరెవరు చేరవచ్చు ఎల్‌ఐసీ అందిస్తోన్న క్యాన్సర్ కేర్ కవర్‌లో 20-65 ఏళ్ల వయసు వారు చేరవచ్చు. 10-30 ఏళ్ల వ్యవధిని ఎంచుకోవచ్చు. రూ.10లక్షల నుంచి రూ.50లక్షల వరకూ పాలసీ మొత్తం ఉంది. కనీస ప్రీమియం రూ.2,400. వయసు, పాలసీ మొత్తం, వ్యవధిని బట్టి ప్రీమియం మారుతుంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, రెలిగేర్, మ్యాక్స్ బూపా వంటి బీమా సంస్థలూ దీన్ని అందిస్తున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ హార్ట్/క్యాన్సర్ కేర్‌లో 30 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల వ్యవధికి రూ.40లక్షల క్యాన్సర్ పాలసీని తీసుకుంటే రూ.2,357 ప్రీమియం వసూలు చేస్తోంది. గుండెకు సంబంధించిన పాలసీ ప్రీమియాలతో పోలిస్తే క్యాన్సర్ పాలసీలకు ప్రీమియం తక్కువగానే ఉంటుంది. అపోలో మునిచ్ హెల్త్ ఇన్సూరెన్స్ ‘ఐక్యాన్' పాలసీ కొంత విభిన్నంగా ఉంది. సాధారణంగా క్యాన్సర్ కేర్ పాలసీల్లో ఒకసారి పరిహారం ఇచ్చాక ఇక పాలసీ రద్దవుతుంది. తదుపరి చికిత్సల సమయంలో ఎలాంటి చెల్లింపులూ ఉండవు. ఈ పాలసీలో ఒకసారి పాలసీ మొత్తాన్ని పరిహారంగా ఇచ్చిన తర్వాత కూడా ఆసుపత్రిలో చేరిన ప్రతిసారీ చికిత్స ఖర్చులను చెల్లిస్తుంది (క్యాన్సర్ చికిత్సకు మాత్రమే). రూ.5లక్షల నుంచి రూ.50లక్షల వరకూ పాలసీని ఎంచుకునే వీలుంది. ఎసెన్షియల్, ఎన్‌హాన్స్ అని రెండు రకాలుగా ఉన్నాయి. 5-65 ఏళ్ల వయసు వారెవరైనా ఈ పాలసీని ఎంచుకోవచ్చు. జీవితాంతం వరకూ పునరుద్ధరణకు అవకాశం ఉంది.

టర్మ్ పాలసీ

టర్మ్ పాలసీ

క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీలు కూడా ఇప్పుడు తప్పనిసరి అవసరం. జీవిత బీమా సంస్థలు ఈ రెండు పాలసీలనూ కలిపి ఒకే పాలసీగా అందిస్తున్నాయి. ఈ తరహా పాలసీల్లో వయసు పెరుగుతూంటే జీవిత బీమా మొత్తం తగ్గుతూ.. క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ మొత్తం పెరుగుతుంది.

రెండు పాలసీలు

రెండు పాలసీలు

రెండు పాలసీలు 80:20 నిష్పత్తిలో ఉంటాయి. కాలం గడుస్తున్న కొద్దీ టర్మ్ పాలసీ తగ్గిపోతూ.. క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ విలువ పెరుగుతుంది. తీవ్ర వ్యాధిని గుర్తించిన వెంటనే తదుపరి ప్రీమియాలు రద్దయ్యేలా పాలసీని ఎంపిక చేసుకోవాలి.

తీవ్ర వ్యాధి బారిన పడినప్పుడు పాలసీ పరిహారం చెల్లిస్తుంది. ఆ తర్వాత టర్మ్ పాలసీకి ప్రీమియం చెల్లించకుండానే, వ్యవధి వరకూ కొనసాగుతుంది.

Read more about: lic
English summary

ఎల్.ఐ.సీ అందిస్తున్న ఒక అద్భుతమైన పాలసీ మీకోసం! | LIC Cancer Cover

There are certainly ten people who are likely to have cancer these days. Treatment is an expensive affair. The cost of the cancer is much more difficult to cope with.
Story first published: Friday, October 26, 2018, 15:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X