ఇండిగో 'దీపావళి సేల్' ఆఫర్:10 లక్షల సీట్లు డిస్కౌంట్ ధరలకు.
ఇండిగో 10 లక్షల సీట్లను తాజా ఆఫర్ లో భాగంగా విక్రయించేందుకు సిద్ధంగా ఉంది. దేశీయ ప్రయాణానికి రూ .899 రూపాయల నుంచి అలాగే రూ .3,399 రూపాయలు.
ఇండిగో 10 లక్షల సీట్లను తాజా ఆఫర్ లో భాగంగా విక్రయించేందుకు సిద్ధంగా ఉంది. దేశీయ ప్రయాణానికి రూ .899 రూపాయల నుంచి అలాగే రూ .3,399 రూపాయల నుండి అంతర్జాతీయ మార్గాల్లో డిస్కౌంట్ ధరలు ఇండిగో 'దీపావళి సేల్' కింద ప్రకటించింది. అక్టోబరు 28, 2018 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది అని సంస్థ సైట్ లో పేర్కొంది. 2018 నవంబర్ 8 మరియు 2019 ఏప్రిల్ 15 మధ్యకాలంలో, 64 గమ్యస్థానాలకు అనుగుణంగా 10 లక్షల సీట్లను అతి తక్కువ ధరకే క్యారియర్ అందిస్తున్నట్లు ఇండిగో ఒక ప్రకటనలో పేర్కొంది. రూ .899 ఆఫర్ "ఆఫర్ వ్యవధిలో చేసుకున్న బుకింగ్లకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

ఈ దీపావళి సేల్ ఆఫర్ కింద ఇచ్చిన కొన్ని మార్గాలు మరియు ధరలు కొన్ని తెలుసుకుందాం. లక్నో-ఢిల్లీ (రూ .1,299), ఢిల్లీ-చండీగఢ్ (రూ .1,299, పాట్నా-రాంచి (రూ .1,399), లక్నో -గోవా (రూ 2,999), అమృత్సర్- ఢిల్లీ-బాగ్డోగ్ర (రూ .2,699), బెంగళూరు-డెహ్రాడూన్ (రూ .4,199) టికెట్ ధరలు ఉన్నాయని ఇండిగో పేర్కొంది.
అక్టోబరు 24 నుంచి అక్టోబరు 26 వరకు ఈ మూడు రోజుల పండుగ విక్రయాలను సంస్థ ప్రకటించింది. దీపావళి పండుగ కుటుంబాన్ని, స్నేహితులను కలుసుకునే అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటి. ఈ పండుగ అమ్మకాల ద్వారా మా వినియోగదారుల కోసం ఎంపిక చేసుకునే మరింత సౌకర్యాలను కల్పించాలని మేము కోరుకుంటున్నాము. రూ.899 రూపాయల చొప్పున తక్కువ ఛార్జీలతో ప్రారంభించామన్నారు, అందుబాటులో ఉన్న సీట్లని త్వరగా వినియోగదారులు త్వరగా బుకింగ్ చేసుకోగలరని విలియమ్ బౌల్టర్, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్, ఇండిగో పత్రికా ప్రకటనలో పేర్కొంది.
బెంగళూరు-సింగపూర్ (రూ .5,299), కోలకతా-సింగపూర్ (రూ .7,599), బెంగళూర్-బ్యాంకాక్ (రూ .6,599), ఢిల్లీ-ఫుకెట్ (రూ. 7,999), ఢిల్లీ-కౌలాలంపూర్ (రూ.7,299)
ఇండిగో సుమారు మూడు నెలల వ్యవధిలో 10 లక్షల సీట్లను పైగా అమ్మింది. ఈ ఏడాది జులైలో 1.2 మిలియన్ల సీట్లు విక్రయించింది రూ .1,212 రూపాయలు అదేవిదంగా రూ. సెప్టెంబరులో, క్యారియర్ 10 లక్షల సీట్లు విక్రయించగా,ఇవి రూ. 999 రూపాయల నుంచి ప్రారంభమయ్యాయి.
భారతదేశంలో అతిపెద్ద బడ్జెట్ ఎయిర్లైన్స్ ఇండీగో నడుపుతున్న ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ గత సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో రూ .652.13 కోట్లు నష్టపోయింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ .551.56 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.


Click it and Unblock the Notifications