కొంచెం ఓపిక ఆలోచన ఉంటే ప్రతిదాని పనికొచ్చే దానిలాగా వాడుకోవచ్చు.మనం పారేసిన వాటితో కూడా అద్భుతాలు సృష్టించవచ్చు ఇక ఇదంతా ఎందుకు చెబుతున్నాము అని అనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ స్టోరీ చదవాల్సిందే.

ప్లాస్టిక్ బాటిల్స్
ఇక పనికిరాని ప్లాస్టిక్ బాటిల్స్ తో పెట్రోల్ , డీజిల్ మరియు కిరోసిన్ తయారు చేస్తూ అందరిచేత శబాష్ అని అనిపించుకుంటున్నారు హైదరాబాద్ నీడా గ్రీన్ ఎనర్జీ సంస్థ నిర్వాహకులు. ఈరోజుల్లో ప్రతి ఇంట్లో ఏ మూలా చూసిన ప్లాస్టిక్ ఉంటుంది. అలాంటి ప్లాస్టిక్ నుంచే పెట్రోల్, డీజిల్ మరియు కిరోసిన్ తయారు చేస్తున్నారు.

ప్రొఫిసర్ సతీష్
హైదరాబాద్ BHEL కి చెందిన ప్రొఫిసర్ సతీష్ ఇక అతని గ్రీన్ ఎనర్జీ నిర్వాహకులు మహేష్, ప్రేమ్ చెంద్, 2015 లో హైడ్రాలిక్ సిస్టమ్ అనే చిన్నపాటి సంస్థను ప్రయోగాలు ప్రారంభించారు.ఇక రూ.80 లక్షల ఖర్చుతో కావలసిన వస్తువులు మరియు సామాగ్రిని సమకూర్చుకున్నారు .

200 లీటర్ల
మొదట్లో 200 లీటర్ల పెట్రోల్ , డీజిల్ మరియు కిరోసిన్ హై స్పీడ్ డీజిల్ ఉత్పత్తి చేశారు ప్రస్తుతం ఈ పెట్రోల్ మార్కెట్ లో లీటర్ రూ.60 మరియు డీజిల్ రూ.50 కి అమ్ముడు అవుతున్నట్లు సతీష్ చెబుతున్నారు. ఇక ఈ పెట్రోల్ వల్ల మీ బండి ఏమి దెబ్బతినదు అని మాములు పెట్రోల్ కన్నా ఈ పెట్రోల్ 10 కిలోమీటర్ల మైలేజీ ఎక్కువ ఇస్తుంది అని సతీష్ తెలిపాడు.

ఇంతకీ ఈ ప్లాస్టిక్ చమురు ఎలా తయారు చేస్తారు అని అంకుంటున్నారా?
నగరంలో వివిధ ప్రాంతాలలో వృధాగా పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్ , కవర్లు , పేపర్లు ఇక ప్లాస్టిక్ కంపెనీలలో వృధాగా ఉన్న ప్లాస్టిక్ అంతా తెచ్చి వాటిని కట్ చేసి కంటైనర్ లలో వేసి కరిగిస్తారు.సుమారు 8 గంటల నుంచి 10 గంటలు మరిగిస్తారు. ఆ తర్వాత బంకర్ ద్వారా వడపోత వేస్తారు.

బుడిదను
దాదాపు కొన్ని గంటల పాటు జరిగే ఈ ప్రక్రియ తర్వాత పెట్రోల్, డీజిల్ మరియు కిరోసిన్ వస్తాయి అని నిర్వాహకుడు సతీష్ చెప్పారు. ఇక ఈ ప్లాస్టిక్ కాల్చిన తర్వాత వచ్చే బుడిద కూడా పనికొస్తుంది అని సతీష్ చెబుతున్నారు ఇలా వచ్చిన బుడిదను మొక్కలకు ఎరువుగా వాడుకోవాచ్చు అని తెలిపారు.

ఆర్టీసీ బస్సులకు
ఇలా ప్లాస్టిక్ వ్యర్ధాలతో పెట్రోల్, డీజిల్ మరియు కిరోసిన్ తయారు చేస్తున్న సతీష్ ప్రతిభను నీడా గ్రీన్ ఎనర్జీ నిర్వాహకులు గుర్తించారు. నగరంలోని కొన్ని ఆర్టీసీ బస్సులకు మరియు కొన్ని మునిసిపల్ వాహనాలకు ఈ పెట్రోల్ మరియు డీజిల్ వాడుతున్నారు అని సంస్థ వారు చెబుతున్నారు.

హైద్రబాదీల సత్తా
తమకు ప్రభుత్వం ప్రోత్సహం ఇస్తే హైద్రబాదీల సత్తా దేశం మొత్తం చుపిస్తాము అని నీడా సంస్థ నిర్వాహకులు మహేష్ , ప్రేమ్ చెంద్ , శీనా చెబుతున్నారు. ఏదిఏమైనా సరే ఈ ప్రయోగానికి ప్రభుత్వం ప్రోత్సహం ఇస్తే ఈ పెట్రోల్ మరియు డీజిల్ కష్టాల నుంచి ప్రజలు బయట పడచ్చు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..



Click it and Unblock the Notifications