గ్రామీణ ప్రాంతాల్లో జియో విప్లవం సృష్టించిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ - 2018 సదస్సులో ఆయన ప్రసంగించారు. 2019 నాటికి భారత్‌లో 4జీ నెట్‌వర్క్ నిండిపోతుందని ఇక జియో 5జీకి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆ రంగంలో ప్రపంచ దేశాల కంటే భారత్ ముందే రెడీగా ఉండాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలుస్తుందన్న ముఖేష్ అంబానీ.. ఇప్పటికే డేటా వినియోగంలో ప్రపంచంలోనే అతి పెద్ద దేశాల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు. నాలుగో పారిశ్రామిక విప్లవానికి సారధ్యం వహించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ముఖేష్ అభిప్రాయపడ్డారు.

బ్రాడ్‌బ్యాండ్ డేటా వినియోగంలో భారత్ 135వ స్థానంలో ఉందని.. జియో గిగాఫైబర్‌తో కొన్నేళ్లలోనే మూడో ప్లేస్‌కు వస్తుందని అంబానీ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి ఒక్కరినీ 4జీతో కనెక్ట్ చేయడానికి రిలయన్స్ కృషి చేస్తోందని తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి కనెక్ట్ కావడానికి జియో ప్రయత్నిస్తోందన్నారు. నెలకు కేవలం రూ.100తో ఫోన్ కాల్స్, డేటా సౌకర్యాలు అందుతున్నాయన్నారు.
ప్రధాని మోదీ హయాంలో దేశం పురోగమిస్తోందని ముఖేష్ అంబానీ ప్రశంసించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. గత పదేళ్లలో 27 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications