For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎయిర్‌టెల్ వినియోగదారులకి బంపర్ ఆఫర్‌ ఏంటో మీరే చూడండి

|

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ దేశ వ్యాప్తంగా ఉన్న తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది. నూతన 4జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి రూ.2వేల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఫోన్‌ను కొన్న వారు ఎయిర్‌టెల్ 4జీ సిమ్ అందులో వేసి మై ఎయిర్‌టెల్ యాప్‌లోకి వెళ్లి అందులో ఉండే ఫ్రీ ఆఫర్లను క్లెయిమ్ చేయాలి. దీంతో వారి మై ఎయిర్‌టెల్ అకౌంట్లోకి ఒక్కోటి రూ.50విలువైన 40 కూపన్లు క్రెడిట్ అవుతాయి. వాటిని తరువాత చేసుకునే రీచార్జిలకు ఉపయోగించుకుని ఆ మేర డిస్కౌంట్‌ను పొందవచ్చు.

 కూపన్లను

కూపన్లను

అయితే ఈ కూపన్లను వాడుకోవాలంటే ఎయిర్‌టెల్ ప్రీ పెయిడ్ కస్టమర్లు రూ.199, రూ.249, రూ.448 ప్రీపెయిడ్ ప్లాన్లను వాడాల్సి ఉంటుంది. అలాగే పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు అయితే రూ.399 ఆపైన విలువ గల పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను వాడాలి. దీంతో ఆయా ప్లాన్లకు చెల్లించే మొత్తంలో రూ.50 విలువ గల ఒక కూపన్‌ను ఒకసారి వాడుకోవచ్చు. మొత్తం 40 సార్లు వాడుకుంటే రూ.2వేల క్యాష్‌బ్యాక్ పొందినట్లు అవుతుంది.

 రూ.597 రీఛార్జి

రూ.597 రీఛార్జి

ఎయిర్‌టెల్‌ తన వినియోగదారులను ఆకట్టుకునేందుకు రూ.597 రీఛార్జిను ప్రవేశపెట్టింది. దీని కింద యూజర్లు అపరిమిత లోకల్‌, ఎస్‌టీడీ కాల్స్‌, రోమింగ్‌ అవుట్‌గోయింగ్‌ కాల్స్‌ను పొందవచ్చు. దీంతో పాటు రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి. అంతేకాదు.. 10జీబీ డేటాను ఇచ్చింది. ఈ ఆఫర్‌ వ్యాలిడిటీ 168రోజులు. కాల్స్‌, డేటా వినియోగంపై ఎటువంటి పరిమితులు లేవు. ఎక్కువ సమయం కాల్స్‌ మాట్లాడుకునే వారిని దృష్టిలో ఉంచుకొని ఎయిర్‌టెల్‌ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది

బీఎస్‌ఎన్‌ఎల్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకొచ్చిన ఎస్‌టీవీ 786 రీఛార్జికు పోటీగా ఎయిర్‌టెల్‌ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. 150 రోజుల వ్యాలిడిటీతో ఎస్‌టీవీ 786 ఆఫర్‌ కింద బీఎస్‌ఎన్‌ఎల్‌ రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్‌, 100 ఎస్‌ఎంఎస్‌లు ఇస్తోంది.

జియో

జియో

లాంగ్‌టర్మ్‌ ప్లాన్‌ కింద జియో కూడా రూ.999 రీఛార్జిని తీసుకొచ్చింది. 90 రోజుల కాల పరిమితితో, 60జీబీ డేటా, అపరిమిత లోకల్‌ కాల్స్‌, ఉచిత ఎస్‌ఎంఎస్‌లను జియో అందిస్తోంది.

Read more about: airtel
English summary

ఎయిర్‌టెల్ వినియోగదారులకి బంపర్ ఆఫర్‌ ఏంటో మీరే చూడండి | Airtel 2000 Cash Back Offer

Bharti Airtel on Tuesday announced a cashback of Rs. 2,000 to its subscribers upgrading to a new 4G smartphone
Story first published: Wednesday, October 24, 2018, 9:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X