ఒక్క రూపాయికే కిలో బియ్యం మరియు ఒక్క రూపాయికే ప్లేట్ మీల్స్ ఇక ఒక్క రూపాయికే చీర ఇలాంటి ఆఫర్లు మన భారత దేశంలో చాలా చోట్ల చూస్తుంటాము. ఇక పండుగ సంధర్భాలలో అయితే చెప్పనక్కరలేదు ఎటు చూసిన భారీ ఆఫర్లు ఉంటాయి

ఒక్క రోజు ముఖ్యమంత్రి
ఇంకా బాగా చెప్పాలి అంటే మన సినిమాలలో కూడా చూసాం ఒక్క రోజు ముఖ్యమంత్రిని కానీ ఇప్పుడు మేము చెప్పే ఈ ఆఫర్ మాత్రం వీటన్నిటికన్నా కాస్త భిన్నమైనది.అది ఏంటో తెలుసా పెళ్లి! అవునండి మీరు విన్నది నిజమే.

ఎంతో ఖర్చు
పెళ్లి అంటే ఎంతో ఖర్చు వస్తుంది ధనవంతులు అంటే పెళ్ళికి ఎంత ఖర్చు చేసైనా చేస్తారు అదే ఒక మధ్యతరగతి మరియు పేద కుటుంబాలకి పెళ్లి చేయాలి అంటే తడిసిపోతాంది.

పేద కుటుంబానికి
చాలా సింపుల్ గా పెళ్లి చేద్దాం అనుకున్న తక్కువలోతక్కువ రూ.10 వేలు ఖర్చు అవుతుంది. ఒక పేద కుటుంబానికి అది చాలా ఎక్కువే.కానీ రాబోతున్న ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని రాజకీయ నాయకులు చేస్తున్న వాగ్దానాలు కాదండీ ఇది.

మై గ్రాండ్ వెడ్డింగ్
ఇక ఒక రూపాయికే పెళ్లి ఎక్కడ చేస్తారో తెలుసా చెన్నై లోని "మై గ్రాండ్ వెడ్డింగ్" ప్రైవేట్ సంస్థ ఈ మంచి పనికి శ్రీకారం చుట్టింది. మీరు పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతురుని తెచ్చుకోండి చాలు ఇక మిగతా కారిక్రమాలు మేము చేసుకుంటాము అని సంస్థ చెబుతోంది.

సీఈఓ శరత్
ఈరోజుల్లో పేదలకు పెళ్లి చేసుకోవాలి అంటే చాలా భారంగా మారింది అందుకే తమ సంస్థ వారు కేవలం ఒక్క రూపాయికే పెళ్లి చేస్తున్నాము అని సంస్థ సీఈఓ శరత్ వెల్లడించారు.

రూ.5000 లోపు
ప్రతి నెల ఒక వివాహం ఇలా జరిపించాలి అని సంస్థ అనుకుంటోంది అంటా అలాగే ఈ వివాహం జరిపించుకోవాలి అంటే పేద కుటుంబానికి చెందిన వారై ఉండాలి అలాగే వారి సంపాదన నెలకి రూ.5000 లోపు ఉండాలి వారికీ ఈ అవకాశం ఉంటుంది.

డిసెంబర్
అలాగే రాబోయే డిసెంబర్ లో ఈ ఒక్క రూపాయి వివాహాలు మొదలు పెడతాము అని కంపెనీ సీఈఓ శరత్ వెల్లడించారు. ఇలా ఇంకా కొన్ని కంపెనీలు పేద వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలి అని కోరుకుందాం.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications