సెప్టెంబరు త్రైమాసికానికి రూ.681 కోట్ల లాభాలు ఆర్జించిన తర్వాత, 25 కోట్ల మందికి పైగా వినియోగదారులను కలిగి ఉన్న రిలయన్స్ జియో ఓ బంపరాఫర్‌ను ప్రవేశపెట్టింది. రిలయన్స్ జియో దీపావళి సందర్భంగా ఓ కొత్త రీఛార్జ్ ఆఫర్ ను వినియోగదారులకు ప్రకటించింది.
రూ.1,699తో రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పాటు వ్యాలిడిటీ ఉండేలా ఓ కొత్త ప్లాన్‌ను జియో ప్రకటించింది. ఆ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.రూ.1,699తో రీఛార్జ్ చేసుకుంటే సంవత్సరంలో వరకు ఉచితంగా రోజుకు 1.5 జీబీ 4జీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లతోపాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ , అపరిమిత రోమింగ్ పొందవచ్చు. కొన్ని రకాల జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్‌నూ కల్పించింది.

'మై జియో' అనే యాప్ ద్వారా రూ.149 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకున్నవారికి 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను డిజిటల్ కూపన్ల రూపంలో అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ కూపన్లను రిలయన్స్ డిజిటల్, డిజిటల్ ఎక్స్‌ప్రెస్, డిజిటల్ ఎక్స్‌ప్రెస్ మినీ స్టోర్లలో రీడీమ్ చేసుకోవచ్చంది. ఈ కూపన్లు రీడీమ్ చేసుకునేందుకు చివరి తేదీ డిసెంబరు 31, 2018 కాగా.. నవంబర్ 30, 2018లోగా రీచార్జీ చేయించుకుంటే 100 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందవచ్చని పేర్కొంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications