అధిక పన్ను కారణంగా సుమారు 400 పెట్రోల్ పంపులు మూతపడ్డాయి.

పెట్రోల్ మరియు డీజిల్ పై పన్ను చెల్లింపు తగ్గించాలనే ప్రతిపాదనని ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో ఢిల్లీలో 400 పెట్రోల్ పంపులు మరియు సంపీడిత సహజ వాయువు పంపులు మూసివేశారు.

పెట్రోల్ మరియు డీజిల్ పై పన్ను చెల్లింపు తగ్గించాలనే ప్రతిపాదనని ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో ఢిల్లీలో 400 పెట్రోల్ పంపులు మరియు సంపీడిత సహజ వాయువు పంపులు 23 గంటల పాటు మూతవేస్తునట్టు డీలర్ల అసోసియేషన్ తెలిపింది. అక్టోబర్ 10 న ఢిల్లీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ఈ బంద్ పిలుపునిచ్చింది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అభ్యర్థనను అనుసరించి 13 రాష్ట్రాలు వేట్ను తగ్గించాయి.

డీలర్స్ అసోసియేషన్ మాట్లాడుతూ

డీలర్స్ అసోసియేషన్ మాట్లాడుతూ

ఢిల్లీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ మాట్లాడుతూ ప్రజలు పొరుగు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, హర్యానా నుంచి పెట్రోలు, డీజెల్లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారని తెలిపింది.

అరవింద్ కేజ్రివాల్

అరవింద్ కేజ్రివాల్

అయితే, సమ్మె రాజకీయంగా ప్రేరేపించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆరోపించారు.చమురు దుకాణాల యజమానులు ఇది బిజెపి ప్రేరేపణతో డీలర్లు చేస్తున్న ప్రైవేటు సమ్మె అని తమతో చెప్పారని ఆయన అన్నారు.ప్రైవేట్ గా పెట్రోల్ పంప్ యజమానులు మాకు చెప్పారని వాస్తవానికి, బిజెపి పెట్రోల్ పంపు యజమానులపై పడ్డారని,నిరంకుశ పాలనతో తరచూ ప్రజలను ఇబ్బదులకు గురి చేస్తున్న బిజెపి పార్టీ కి వచ్చే ఎన్నికలలో తగిన బుద్ధి చెబుతయారని అతను ఆదివారం రాత్రి ట్వీట్ చేశాడు.

ఢిల్లీలో పెట్రోలు ధర

ఢిల్లీలో పెట్రోలు ధర

ఆదివారం ఢిల్లీలో పెట్రోలు ధర 25 పైసలు తగ్గి లీటరు రూ.81.74 రూపాయలుగా ఉంది అలాగే డీజిల్ పై 17 పైసలు తగ్గి లీటరు రూ.75.19 రూపాయల వద్ద విక్రయించబడుతోంది. ఇతర ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర ముంబైలో లీటరుకు రూ. 87.21 రూపాయలు, కోల్కతాలో రూ.83.58 రూపాయలు మరియు చెన్నైలో రూ.84.96 రూపాయల ధరలు నమోదయ్యాయి.

అక్టోబర్ 4 న

అక్టోబర్ 4 న

కేంద్రం అక్టోబర్ 4 న ఇంధన ధరలను తగ్గించింది. వినియోగదారులకు ఉపశమనం కల్పించే ప్రయత్నంలో రూ.2.50 తగ్గించే ప్రతిపాదన రాష్ట్రాలు కూడా కొనసాగించాలని కోరింది. ఈ తగ్గింపు లీటరుకు రు. 1.50 రూపాయలు ఎకై్సజ్ డ్యూటీ,మిగతా ఒక్క రూ.1 రూపాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి.వేట్ కట్ ప్రకారం రాష్ట్రాలు ప్రతి లీటరు పెట్రోల్ అమ్మకం పై రూ.2.50 రూపాయలు ఉపశమనం కలిగించాయి.

బిజెపి పాలిత రాష్ట్రాలు

బిజెపి పాలిత రాష్ట్రాలు

కేంద్ర అభ్యర్థన అనంతరం బిజెపి పాలిత రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అస్సాం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర తదితరులు ధర తగ్గింపులను ప్రకటించాయి.

మోడీ ప్రభుత్వం

మోడీ ప్రభుత్వం

దీనిపై కేజ్రీవాల్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఇంధనం పై ఎక్సయిజ్ పన్ను రూ.10 రూపాయలు పెంచి కేవలం రూ.2 .50 రూపాయలు మాత్రమే తగ్గించేందుకు సిగ్గు పడాలని వ్యాఖ్యానించారు.పన్ను తగ్గింపు కనీసం రూ.10 రూపాయలు ఉంటే ప్రజలు సంతోషపడేవాళ్లు అని ఆయన తన ట్విట్టర్ లో తెలిపారు.

కేరళ రాష్ట్రం

కేరళ రాష్ట్రం

కేరళ - మరో ప్రతిపక్ష పాలిత రాష్ట్రం - 2014 మేలో ప్రధాని మోడీ పదవీకాలం చేపట్టినప్పుడు ఇంధన ధరలు స్థాయికి వచ్చినపుడు మాత్రమే పన్ను తగ్గింపు ఉంటుంది అని తెలిపింది.

యూరో VI గ్రేడ్ ఇంధనం

యూరో VI గ్రేడ్ ఇంధనం

పరిశుభ్రమైన యూరో VI గ్రేడ్ ఇంధనం ప్రస్తుతం జాతీయ రాజధాని భూభాగంలో మాత్రమే లభిస్తుండటంతో, పెట్రోల్ డీలర్స్ సంస్థ పర్యావరణం గురించి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. పొరుగు రాష్ట్రాల నుండి తక్కువ గ్రేడ్ ఇంధన కొనుగోలు జాతీయ రాజధానిలో కాలుష్య స్థాయిని పెంచుతుందని తెలిపింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+