మనలో చాల మందికి మన జీవితం లో ఒకసారైనా విదేశాలకు వెళ్లాలనే కోరిక ఉంటుంది,కానీ మొట్టమొదటి ప్రధాన సమస్య ఆర్థిక సమస్య.
మనలో చాల మందికి మన జీవితం లో ఒకసారైనా విదేశాలకు వెళ్లాలనే కోరిక ఉంటుంది,కానీ మొట్టమొదటి ప్రధాన సమస్య ఆర్థిక సమస్య.విదేశాలకు వెళ్లాలంటే లక్షలు ఖర్చు వస్తుందని చాలామంది తమ కోరికలను చంపుకుంటున్నారు.ఐతే సామాన్యుడు కూడా అత్యంత తక్కువ ఖర్చుతో పలు దేశాలను చుట్టిరావచ్చు.ఇది వాస్తవానికి మీరు ఎంచుకున్న దేశంపై ఆధారపడి ఉంటుంది.అవును మీరు వింటున్నది నిజమే ఈ దేశాలలో జీవన స్థితిగతులు మరియు ఆహార ఖర్చులు అన్ని పరిగణంలోకి తీసుకున్న తరువాతే చెప్పబడుతోంది.
ఇక్కడ భారతదేశం నుండి ప్రయాణించే కొన్ని చౌకైన దేశాలు ఉన్నాయి:

1. నేపాల్
శక్తివంతమైన హిమాలయాల మధ్య నేపాల్ దేశం నెలకొంది.నేపాల్ లో అద్భుత మంచు శిఖరాలు మరియు మంచు ప్రదేశాలు అలాగే మనసును ఆహ్లాద పరిచే చల్లటి ప్రదేశాలు ఉన్న దేశం.ప్రశాంతత ప్రదేశాలు చూడాలని కోరుకునే ప్రతి ఒక్కరికి నేపాల్ ఒక అందమైన అనుభూతిని కలిగిస్తుంది ,మరియు అడ్వెంచర్ లు చేయడానికి సరైన ప్రదేశం అలాగే మొత్తం ప్రదేశం మీ ఖర్చులకు లోబడే ఉంటుంది.భారతదేశం నుండి సందర్శించే చౌకైన దేశాల్లో ఇది ఒకటి!
అకరోజు ఉండడానికి అయ్యే ఖర్చు: ఒక మంచి హోటల్ గది మీకు ఎక్కడైనా INR 1000 నుండి 2000 మధ్య ఖర్చు అవుతుంది.
రోజుకు ఆహార ఖర్చు: భోజనం ఆధారంగా 500 రూపాయల నుంచి ఎక్కడైనా వంటకాల మీద ఆధారపడి మీరు ఎంపిక చేసుకోవచ్చు.

2. వియత్నాం
వియత్నాం, పుష్కలమైన సహజ సౌందర్యం, సంపన్న చరిత్ర మరియు ఏకైక వారసత్వం కలిగిన దేశం ఒక చిన్న స్వర్గాన్ని తలపిస్తుంది.అవకాశం వస్తే ఈ ప్రదేశాన్ని మాత్రం అసలు మిస్ అవకండి, భారతదేశం నుండి ప్రయాణం చేయడానికి ఇది కూడా చాలా చౌకైన దేశాలలో ఒకటి.
అకరోజు ఉండడానికి అయ్యే ఖర్చు: మీరు బ్యాక్ ప్యాకర్ల వసతిగృహాలలో ఉండాలని నిర్ణయించుకుంటే, మీరు ఒక రాత్రికి రూ .1000 కంటే తక్కువ ఖర్చు వ్యయం తో నిర్వహించవచ్చు.
రోజుకు ఆహార ఖర్చు: మిడ్-రేంజ్ రెస్టారెంట్లో భోజనం మీకు సుమారు రూ.800 ఖర్చు అవుతుంది.
రవాణా ఖర్చు: టాక్సీ ఛార్జీలు ఒక కిలోమీటర్ కు రూ.35 రూపాయల నుండి మొదలవుతుంది.

3. భూటాన్
ప్రపంచంలోని అత్యంత ఆహ్లాదమైన దేశం శాంతి ఉన్న ప్రదేశం ఇది, శాంతి కి అగ్రస్థానంలో ఉండే ఒకేఒక ప్రదేశం, ఇది భారతదేశం నుండి ప్రయాణించే అత్యంత చౌకైన దేశాలలో ఒకటి. దాని సహజ సౌందర్యం మరియు కనిపెట్టబడని భూభాగాల విస్తారమైన ప్రదేశాలు చాల ఉన్నాయి.అంతేకాకుండా భారతీయులు పాస్పోర్ట్ లేకుండా ఈ దేశానికి వెళ్ళవచ్చు!
ఒక రోజు ఖర్చు: మీరు హోటళ్ళలో ఉండాలంటే ఒక రాత్రికి రూ.1500 పైన ఎక్కడైనా మీకు ఖర్చు వస్తుంది. మంచి హోటళ్లు లో 2000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది.
రోజుకు ఆహార ఖర్చు: ఒక భోజన ఖర్చు మీకు రూ. 100 నుంచి రూ .400 వరకు ఖర్చు అవుతుంది. మీరు హై ఎండ్ హోటల్లోకి వెళ్ళినట్లయితే మరికొంత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

4. శ్రీలంక:
మన పొరుగు దేశాలలో ఒకటి శ్రీలంక,ఇది మీ బడ్జెట్ కు లోబడి చూసే మరో అందమైన ప్రదేశాల్లో ఒకటి.అద్భుత బీచ్లు,ఎన్నో రుచికరమైన వంటకాలు మరియు రామాయణానికి సంబందించిన ప్రదేశం.
ఒక రోజుకయ్యే ఖర్చు: హోటల్స్ లేదా కొన్ని ప్రత్యేకంగా సందర్శకులకు ఏర్పాటు చేసిన వాటిని ఎన్నుకోండి మరియు మీకు ఒక రాత్రికి సుమారు రూ.700-1000 రూపాయల ఖర్చు అవుతుంది.
రోజుకు ఆహార ఖర్చు: మీరు ఎంచుకునే ప్రదేశాన్ని బట్టి 300 - 1000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది.

5. లావోస్
భారతదేశం నుండి చవకైన ఖర్చుతో ప్రయాణం చేయాలనుకునేవారికి లావోస్ ఒక చక్కటి దేశం,ఇది ఒక పర్వత ప్రాంత, బౌద్ధ ఆలయాలు మరియు అందమైన ఫ్రెంచ్ నిర్మాణ శైలికి ప్రసిద్ది చెందిన ఆగ్నేయ ఆసియా దేశాలలో ఒకటి.
రోజుకు స్టే ఖర్చు: మీరు రాత్రికి రూ.400-800 రూపాయల వరకు వసతిగృహాలను పొందుతారు. మీరు ఒక హోటల్ లో ఉండాలని కోరుకుంటే, రాత్రి కి ఛార్జీలు రూ.1000 రూపాయల నుండి లేదా పైన మీరు పొందాలనుకునే సౌకర్యాలపై ఆధారపడి ఉంటుంది.
రోజుకు ఆహార ఖర్చు: లావోస్ లో ఆహారం కోసం రెస్టారెంట్ ధరలు సుమారు 200 రూపాయలు.పాశ్చాత్య ఆహారం ధర 300 రూపాయలకు పైబడి ఉంటుంది
వీధి ఆహారం రూ.120 నుండి 200 మధ్య ఎక్కడైనా ఉంటుంది.

6.థాయిలాండ్
థాయిలాండ్, అల్ట్రా ఆధునిక నగర దృశ్యం మరియు సంపన్న సాంస్కృతిక వారసత్వం, సంపన్న రాజప్రయాసాల సంపూర్ణ సమ్మేళనం, పురాతన శిధిలాలు కలిగిన ప్రదేశం. మీరు భారతదేశం నుండి ప్రయాణించే చవకైన దేశం కోసం చూస్తున్నట్లయితే,మీరు ఈ చోటును ఎంచుకోండి!
ఒక రోజు ఖర్చు: రూ.1200 మరియు అంత కంటే ఎక్కువ మీరు కోరుకునే సౌకర్యాలు మరియు ఎంచుకున్న ప్రాంతం ఆధారంగా ఉంటుంది.
రోజుకు ఆహార ఖర్చు: మీరు రూ.150 రూపాయల కన్నా తక్కువ చౌకైన బీరుని పొందుతారు, వీధి ఆహారం మీకు ఒక డిష్ కు రూ. 200 రూపాయలకన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది.

7. సింగపూర్
ప్రపంచంలో మరో చవకైన దేశాల్లో సింగపూర్ కూడా ఒకరి- దీనికి ప్రయాణం మన బడ్జెట్ కి లోబడే ఉంటుంది. ఇది ఒక వైవిధ్యభరితమైన దేశంగా ఉంది, ఇక్కడ మీరు తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణం చేయవచ్చు మరియు మీరు అధిక బడ్జెట్ చేస్తే కూడా సంతోషంగా గడపచ్చు.
రోజుకు ఖర్చు: మీరు రూ.1700 రూపాయల నుండి మరియు ఆ పైన మీరు కోరుకునే వసతులను బట్టి వసతిగృహాలను పొందవచ్చు.
రోజుకు ఆహార ఖర్చు: భోజనం మీ చోటును ఎంచుకున్న ప్రదేశం ఆధారంగా ఎక్కడైనా 500 నుండి 5000 మధ్య ఉంటుంది.

8. మలేషియా
అత్యంత అందమైన మరియు ముక్యంగా భారతీయులకు అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రాలలో ఒకటి, మలేషియాకు చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం మరియు అద్భుతమైన బీచ్లు ,సహజమైన దృశ్యాల నుండి ఏ ఒక్క ప్రదేశంలో కూడా మీకు అలసట ఉండదు.
ఒక రోజు ఖర్చు: మీరు ముందుగానే బుక్ చేసుకుంటే, రూ.600 రూపాయల నుండి లేదా పైన ఉన్న హోటళ్ళను పొందవచ్చు.
రోజుకు ఆహార ఖర్చు: మీరు ఎంచుకన్న ప్రదేశాల్లో రూ.300 రూపాయల నుండి ఖర్చు అవుతుంది.

9. ఇండోనేషియా
ఇండోనేషియా - ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపసమూహ రాష్ట్రాలలో ఒకటిగా ఉంది - భారతీయులకు సులువుగా ప్రయాణించే ప్రదేశం ఇది భారతదేశం నుండి సందర్శించే చౌకైన దేశాల్లో ఒకటి.
ఒక రోజు ఖర్చు:ఒక రాత్రికి రూ.2000 రూపాయల వరకు హోటళ్ళను పొందవచ్చు. తక్కువ ధరలు ఉన్న వాటిలో కావాలంటే రూ.1000 రూపాయలు ఖర్చు అవుతుంది.
రోజుకు ఆహార ఖర్చు: ఎక్కడైనా మీకు సుమారు రూ.700 రూపాల నుండి ఖర్చు మొదలవుతుంది.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications