For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జెట్ ఎయిర్వేస్ నుండి పెద్ద మొత్తం లో షేర్లు టాటా గ్రూప్ కొనుగోలు.

టాటా గ్రూప్, భారతదేశం లో అతిపెద్ద వ్యాపార సమ్మేళన సంస్థ, జెట్ ఎయిర్వేస్ లో పెద్ద వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు ప్రారంభించింది అని పత్రికా ప్రకటన వెలువడింది.

By bharath
|

టాటా గ్రూప్, భారతదేశం లో అతిపెద్ద వ్యాపార సమ్మేళన సంస్థ, జెట్ ఎయిర్వేస్ లో పెద్ద వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు ప్రారంభించింది అని పత్రికా ప్రకటన వెలువడింది.

నరేష్ గోయల్ యొక్క జెట్ ఎయిర్వేస్, దాని పైలట్ల జీతాలు ఇవ్వడంలో ఆలస్యం మరియు చెల్లింపుల పై స్పష్టత ఇవ్వడంలేదు, ఇందులో భాగంగా టాటా గ్రూప్‌.. జెట్‌ ఎయిర్‌వేస్‌లో మేనేజ్‌మెంట్‌ నియంత్రణ అధికారాన్ని కోరుకుటోంది.

జెట్ ఎయిర్వేస్ నుండి పెద్ద మొత్తం లో షేర్లు టాటా గ్రూప్ కొనుగోలు.

అయితే, జెట్ ఎయిర్వేస్ అధికార ప్రతినిధి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ తో మాట్లాడుతూ, ఎయిర్లైన్స్ లో వాటాను కొనుగోలు చేయడానికి టాటా గ్రూప్ చర్చలు జరిపిందని పత్రికల్లో వస్తున్న కథనాలు అన్ని అవాస్తవమని కొట్టిపారేశారు.

$ 103 బిలియన్ల వ్యయంతో టాటా సన్స్ సింగపూర్ ఎయిర్లైన్స్ తో కలిసి జాయింట్ వెంచర్ల ద్వారా వైమానిక పరిశ్రమలో ఇప్పటికే విస్టారా మరియు బడ్జెట్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఆసియాలను నిర్వహిస్తోంది. జెట్ తో ఒప్పందం విజయవంతమైతే, టాటా నెట్వర్క్ మరియు మార్కెట్ వాటా పరంగా వారి విమానయాన వ్యాపారాన్ని పెంచవచ్చు.

చర్చల విజయవంతం కావడానికి రెండు కంపెనీలు ప్రయత్నిస్తున్నప్పటికీ, పూర్తిస్థాయి నిర్వహణ నియంత్రణ విషయంలో అలాగే జెట్ ఛైర్మన్ గోయల్ వ్యవహారం వివాదాస్పదమైనవి.

జెట్‌ ఎయిర్‌వేస్‌లో టాటా గ్రూప్‌ కనీసం 26 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. అలాగే ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా మరో 26 శాతం వాటాను దక్కించుకునే అవకాశముంది.

టాటా గ్రూప్‌ ముందుకు వస్తే జెట్‌ ఎయిర్‌వేస్‌లో తనకున్న 24 శాతం వాటాను (మొత్తంగా కానీ, కొంత భాగం కానీ) ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ విక్రయించొచ్చు. అయితే జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ వార్తలను కొట్టిపారేసింది. ఇరు కంపెనీల మధ్య చర్చలు అనే వార్త పూర్తిగా ఊహాజనితమని తెలిపారు.

ఎయిరిండియాను దక్కించుకుందామని టాటా గ్రూప్‌ భావించినప్పటికీ చివరకు అది కుదరలేదు.జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ తన ఉద్యోగులకు వేతనాలను కూడా చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

ఎయిర్ ఆసియా, విస్టారాల్లో నూతన నాయకత్వం, అదనపు నిధులను తీసుకురావడం ద్వారా టాటా గ్రూప్ తన విమానయాన వ్యాపారాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. మాజీ ఇండిగో అధ్యక్షుడు ఆదిత్య ఘోష్ను టాటా విమాన యాజమాన్యానికి నాయకత్వం వహించాలని ఊహాగానాలున్నాయి.

Read more about: jet airways tata group
English summary

జెట్ ఎయిర్వేస్ నుండి పెద్ద మొత్తం లో షేర్లు టాటా గ్రూప్ కొనుగోలు. | Tata Group Looks To Pick Up Stake In Troubled Jet Airways

Tata Group, India’s largest business conglomerate, has initiated discussions to buy a large stake in the loss-making Jet Airways, people in the know told The Times of India.
Story first published: Friday, October 19, 2018, 15:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X