For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండుగల సందర్భంలో ప్రజలకు ఊరట.పెట్రోల్ ధరలు తగ్గాయి.

మెట్రో నగరాల్లో ప్రతి ఒక్కరూ ఈ దసరా పండుగకు కాస్త ఉపశమనం పొందారు, పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పండుగ సందర్భంగా తగ్గాయి.

By bharath
|

మెట్రో నగరాల్లో ప్రతి ఒక్కరూ ఈ దసరా పండుగకు కాస్త ఉపశమనం పొందారు, పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పండుగ సందర్భంగా తగ్గాయి.

న్యూఢిల్లీ: పెట్రోలు ధర లీటరుకు 24 పైసలు, డీజిల్లో 10 పైసలు తగ్గించాయి. ఇంధన ధరలు గత రెండు నెలలుగా పెరుగుతుండడంతో ఈ వార్త కాస్త ఉపశమనం కలిగించింది.

ఢిల్లీలో పెట్రోలు ధర

ఢిల్లీలో పెట్రోలు ధర

ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ.82.38 రూపాయలు ఉండగా, గురువారం ధర రూ.82.62 రూపాయల నుంచి తగ్గింది. డీజిల్ లీటరు రూ .75.48 రూపాయలుగా ఉంది ఈనాటి ధర రూ.75.58 రూపాయలతో పోల్చి చూస్తే.

ముంబయిలో పెట్రోలు లీటరుకు రూ .87.84 రూపాయలు అలాగే డీజిల్ రూ .79.13 రూపాయలుగా నమోదైంది.

కోల్కతా, చెన్నైలలో

కోల్కతా, చెన్నైలలో

కోల్కతా, చెన్నైలలో లీటరుకు పెట్రోలు రూ.84.21 రూపాయలు మరియు రూ.85.63 రూపాయలు అలాగే డీజిల్ ధర రూ. 77.33 మరియు రూ .79.82 రూపాయలు.

అక్టోబరు 5 వ తేదీన దేశంలో లీటరు పెట్రోల్, డీజిల్పై రూ.1.50 రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకం కేంద్రం తగ్గించింది,మరియు లీటరు పై మరో రూ.1 రూపాయి ఇంధన సబ్సిడీపై చమురు కంపెనీలు తగ్గించాలని కోరింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) పాలిత రాష్ట్రాల్లో తగ్గింపు, స్థానిక అమ్మకపు పన్ను లేదా వేట్ లలో సమానమైన తగ్గింపు ద్వారా వారు ఈ కతగ్గింపుకు సరిపోయేటట్టు చేశాయి.

 అక్టోబరు 5 నుండి

అక్టోబరు 5 నుండి

శుక్రవారం ధరల తగ్గింపుకు ముందు అక్టోబరు 5 నుండి డీజిల్ ధర లీటరుకు రూ.2.74 రూపాయల మేర పెరిగింది. ముంబైలో అక్టోబర్ 4 న పెట్రోలు రూ.91.34 కి చేరుకుంది. డీజిల్ రికార్డు స్థాయిలో రూ.80.10 రూపాయల వద్ద విక్రయించింది.

కేంద్రం లీటరుకు రూ.1.50 రూపాయల మేర ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత, PSUs చమురు సంస్థలకు రూ.1 రూపాయి రాయితీ ఇవ్వాలని కోరింది. మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు మొదటగా దీనికి స్పందించి రూ. 2.50 రూపాయల తగ్గింపును ప్రకటించాయి.

పలు రాష్ట్రాలు

పలు రాష్ట్రాలు

వారు తరువాత చత్తీస్గఢ్, జార్ఖండ్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, అస్సాం, ఉత్తరాఖండ్, గోవా, అరుణాచల్ ప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాలు అదే విధమైన కదలికలతో చేరారు. గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూ మరియు కాశ్మీర్ కూడా రెండు ఇంధనాలపై పన్ను తగ్గించారు.

మహారాష్ట్ర మాత్రం డీజిల్ పై ఎటువంటి తగ్గింపు చేయలేదు కానీ పెట్రోల్ పై మాత్రమే వాట్ను తగ్గించింది.

గత నెలలో

గత నెలలో

కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించే ముందు, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ లో గత నెలలో ధరల పెంపు నేపథ్యంలో వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు వ్యాట్ ను తగ్గించారు.

Read more about: petrol diesel
English summary

పండుగల సందర్భంలో ప్రజలకు ఊరట.పెట్రోల్ ధరలు తగ్గాయి. | Petrol, Diesel Prices Fall After Global Price Cut

People across metro cities woke up this Dussehra slightly relieved as petrol and diesel prices were reduced marginally on the festive occasion.
Story first published: Friday, October 19, 2018, 14:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X