For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫుల్ జోష్ మీద ఉన్న ముకేశ్ అంబానీ!మంచి లాభాలు...

By girish
|

ముకేశ్ అంబానీ పట్టింది అంత బంగారం అయన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అంటూ సాగుతోంది. మొన్న జియో నిన్న జియో బ్రాడ్ బ్యాండ్ ఇలా ముకేశ్ అంబానీ గారికి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి.మొన్న విడుదలైన త్రైమాసిక(క్యూ2) ఫలితాలలో మంచి లాభాలు వచ్చాయి.

చమురు నుంచి టెలికామ్ వరకు బహుళ వ్యాపారాలు కల్గిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక(క్యూ2) ఫలితాల్లో అదరగొట్టింది. కంపెనీ నికర లాభం రూ.9,516 కోట్లతో 17.35 శాతం వృద్ధిని సాధించింది. ప్రధానంగా జియో నుంచి వచ్చిన లాభాలు సంస్థకు బలాన్నిచ్చాయి. సంస్థ ఆదాయంలోనూ గణనీయమైన వృద్ధిని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లోకంపెనీ మొత్తం ఆదాయం రూ.1.43 లక్షల కోట్లకు చేరింది. గతేడాది ఇ దే సమయంలో మొత్తం ఆదాయం రూ.9,516 కోట్లుగా ఉంది. ఎబిటా మార్జిన్లు రూ.3,573 కోట్లుగా ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ చరిత్రలో భారీ లాభాలను సాధించిన త్రైమాసికం ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశంలోని అన్ని లిస్టెడ్ కంపెనీలలో అత్యంత విలువైన సంస్థల్లో ఒకటిగా ఉంది. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.7.28 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్ ముగిసే సమయానికి నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో రిలయన్స్ షేరు విలువ 1.19 శాతం డౌన్ అయి రూ. 1,149.80కు చేరింది. కరెన్సీ బలహీనపడడం వల్ల పెట్రోకెమికల్స్ మెరుగైన వృద్ధిని సాధించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఫుల్ జోష్ మీద ఉన్న ముకేశ్ అంబానీ!మంచి లాభాలు...

1. త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 5.5 శాతం పెరిగి రూ. 96,167 కోట్లకు చేరింది.
2. ఆపరేటింగ్ లాభం 1.7 శాతం తగ్గి రూ .14,892 కోట్లకు చేరింది.
3. ఆపరేటింగ్ మార్జిన్ 15.5 శాతం క్షీణించి 110 బేసిస్ పాయింట్లకు చేరింది.
4. స్థూల రిఫైనింగ్ మార్జిన్ బ్యారెల్‌కు 10 డాలర్ల నుంచి 9.5 డాలర్లకు తగ్గింది.
5. జియో లాభం రూ.681 కోట్లు

రిలయన్స్ జియో నుంచి సంస్థకు మంచి లాభాలు వచ్చా యి. బుధవారం వెల్లడించిన క్యూ2 ఫలితాల్లో జియో నికర లాభం రూ.681 కోట్లు నమోదు చేసింది. త్రైమాసికం ప్రతిపాదికన స్టాండలోన్ రెవెన్యూ రూ.9,240 కోట్లతో 13.9 శాతం పెరిగింది. జూలై సెప్టెంబర్ కాలంలో రిలయన్స్ జియోలో కొత్తగా 37 మిలియన్ల సబ్‌స్ర్కైబర్లు చేరారు. అంతకుముందు త్రైమాసికం(క్యూ1)లో 28.7 మంది సబ్‌స్ర్కైబర్లు చేరారని కంపెనీ వెల్లడించింది. నెలకు ఆర్పు(యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) రూ.131.7గా ఉందని సంస్థ తెలిపింది. రిలియన్ జియో ఇన్ఫోకామ్ సబ్‌స్ర్కైబర్లు సెప్టెంబర్ 30 నాటికి 25.2 కోట్లకు చేరారు.

జియో ముఖ్యాంశాలు

1. ఎబిటా రూ.3,573 కోట్లు (13.5 శాతం త్రైమాసిక వృద్ధి), ఎబిటా మార్జిన్ 38.7 శాతం
2. పరిశ్రమలో అత్యల్పంగా 0.66 శాతంగా(నెల వారీగా) ఉంది
3. క్యూ2లో మొత్తం వైర్లెస్ డేటా ట్రాఫిక్ 771 కోట్ల జిబి
4. క్యూ2లో మొత్తం వాయిస్ ట్రాఫిక్ 53,379 కోట్ల నిమిషాలు
5. సేవల ఏకీకృత విలువ రూ .10,942 కోట్లు (13.4 శాతం త్రైమాసిక వృద్ధి), ఏకీకృత ఎబిటా రూ.2,042 కోట్లు (19.1 శాతం త్రైమాసిక వృద్ధి).

Read more about: jio
English summary

ఫుల్ జోష్ మీద ఉన్న ముకేశ్ అంబానీ!మంచి లాభాలు... | Jio Got Highest Profits on Quarterly Results

Reliance Industries, which ranks from oil and telecom to the second quarter (cue 2) results in the end of September
Story first published: Thursday, October 18, 2018, 15:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X