For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్ ధరలు:పలు రాష్ట్రాల్లో ధరలు ఈవిదంగా ఉన్నాయి.

రెండు రోజులు ధరలు స్థిరంగా కొనసాగిన తరువాత , దేశవ్యాప్తంగా పెట్రోలు మరియు డీజిల్ ధరలు గురువారం తగ్గి వినియోగదారులకు ఉపశమనం కలిగించాయి.

By bharath
|

రెండు రోజులు ధరలు స్థిరంగా కొనసాగిన తరువాత , దేశవ్యాప్తంగా పెట్రోలు మరియు డీజిల్ ధరలు గురువారం తగ్గి వినియోగదారులకు ఉపశమనం కలిగించాయి. దేశ రాజధానిలో పెట్రోలు ధర 21 పైసలు క్షీణించి లీటరుకు రూ.82.62 రూపాయలు గా ఉంది అలాగే ముంబయిలో కూడా 21 రూపాయల చొప్పున తగ్గించింది.లీటర్ ధర రూ. 88.08 రూపాయలు ఉంది.

డీజిల్ ధర లీటరుకు రూ.75.58 రూపాయలు, ముంబయి లో రూ .79.24 రెండు రాష్ట్రాల్లో డీజిల్ పై లీటరు రూ.11 పైసలు తగ్గింది.

ఇదే తరహాలో ధరలు

ఇదే తరహాలో ధరలు

అదేవిదంగా మరో రెండు మెట్రో నగరాల్లో ఇదే తరహాలో ధరలు తగ్గాయి. కోల్కతా మరియు చెన్నై లో పెట్రోలు ధర లీటరుకు రూ.84.44 రూపాయల వద్ద ఉంది. కోల్కతాలో డీజిల్ ధర లీటరుకు 77.43 రూపాయలు, చెన్నైలో రూ .79.93 రూపాయలు.

అక్టోబరు 16 మరియు అక్టోబర్ 17 న ఇంధనాల ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోలు ధర లీటర్కు రూ.82.83 రూపాయలు, ముంబయిలో లీటర్కు రూ.88.29 రూపాయలు ఉంది.

పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్

పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్

ఢిల్లీ లో పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ బుధవారం ఇంధన ధరలపై వ్యాట్ లో తగ్గుదలకు డిమాండ్ చేస్తూ ఒక రోజు సమ్మె ప్రకటించింది. సమ్మె అక్టోబరు 22 న ఉదయం 6 నుంచి అక్టోబరు 23 వరకు ఉదయం 5 గంటల వరకు సమ్మె చేస్తామని అసోసియేషన్ తెలిపింది. సమ్మె సమయంలో దేశ రాజధానిలో అన్ని పెట్రోల్, సిఎన్జి (కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్) పంపులు మూసివేయబడతాయి.

ఢిల్లీ ప్రభుత్వం

ఢిల్లీ ప్రభుత్వం

పెట్రోల్ మరియు డీజిల్ పై విలువ ఆధారిత పన్ను (వాట్) తగ్గించడాన్ని ఢిల్లీ ప్రభుత్వం నిరాకరించిన తర్వాత డీలర్లు నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో వేట్ పొరుగు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ మరియు హర్యానా కంటే ఎక్కువగా ఉంది.

కేంద్రం

కేంద్రం

కేంద్రం ఇటీవలే లీటరుకు రూ.1.50 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. మరో రూ.1 రూపాయి ఇంధనం సబ్సిడీ ఇవ్వమని పిఎస్యు చమురు సంస్థలను కోరింది. ఆ తరువాత ఇతర రాష్ట్రాల్లో ఇంధనం ధరలు తగ్గాయి. మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు మొదట రూ .2.50 తగ్గింపు ప్రకటించాయి.

పలు రాష్ట్రాల్లో:

పలు రాష్ట్రాల్లో:

తరువాత చత్తీస్గఢ్, జార్ఖండ్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, అస్సాం, ఉత్తరాఖండ్, గోవా, అరుణాచల్ ప్రదేశ్ మరియు బీహార్ లో అదే విధమైన దరల తగ్గింపు కొనసాగింది. గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూ మరియు కాశ్మీర్ కూడా రెండు ఇంధనాలపై పన్ను తగ్గించారు. మహారాష్ట్ర, అయితే,డీజిల్ పై ఎటువంటి తగ్గింపు చేయకుండా పెట్రోల్ పై మాత్రమే వాట్ను తగ్గించింది.

Read more about: petrol diesel
English summary

దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్ ధరలు:పలు రాష్ట్రాల్లో ధరలు ఈవిదంగా ఉన్నాయి. | Fuel Price Dipped In Metro Cities Like Delhi And Mumbai

After remaining constant for two days, the prices of both petrol and diesel across the country witnessed a dip on Thursday, bringing respite to consumers.
Story first published: Thursday, October 18, 2018, 11:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X