ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. మూడు రోజుల క్రితమే అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ముగియగా మరోసారి ఈ సేల్ కి తెరలేపింది. రెండో రౌండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అక్టోబర్ 24 నుంచి మొదలవుతుందని అమెజాన్ ప్రకటించింది. ఈ సేల్ 24 అర్థరాత్రి నుంచి ప్రారంభమై, అక్టోబర్ 28 అర్థరాత్రి వరకు కొనసాగనుంది.
రెండో రౌండ్ ఫెస్టివల్ సీజన్ సేల్‌లో ఎక్స్‌క్లూజివ్ లాంచ్‌లు, ఆఫర్లు ఉండనున్నాయి. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎల్‌ఈడీ టీవీలు, హోమ్ అప్లియెన్సెస్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ వంటి వాటిపై పలు డీల్స్‌ను ప్రకటించింది. బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ కార్డు యూజర్లకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను తీసుకొస్తోంది. ఈ ఆన్‌లైన్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్, సిటీ బ్యాంక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఈ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. అమెజాన్ పే యూజర్లకు రూ.250 విలువైన క్యాష్‌బ్యాక్ ఇవ్వనుంది. ఈ సేల్‌లో కొత్త అమెజాన్ కస్టమర్లందరికీ ఫ్రీ షిప్పింగ్ ఉండనుంది. ఈ సారి గ్రేట్ ఇండియన్ సేల్‌లో ప్రతి రోజూ రెడ్‌మి 6ఏ ఫ్లాష్ సేల్ నిర్వహించనుంది.
అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్, మూడో జనరేషన్ ఎకో స్మార్ట్ స్పీకర్స్ ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లో అందుబాటులోకి రానున్నాయి. అలెక్స్ ఆధారిత డివైజ్‌లకు 70 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. బెస్ట్ సెల్లింగ్ బుక్స్‌ను కేవలం రూ.19కే అమెజాన్ విక్రయిస్తోంది. ఈ సేల్‌ను కరెక్ట్‌గా దివాళిగా ముందు తీసుకొస్తోంది. గత కొన్ని రోజుల క్రితమే తొలి రౌండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ముగిసింది. ఇప్పుడు నిర్వహించబోయేది రెండో రౌండ్ ఫెస్టివల్ సేల్.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications