For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల పంట పండిందా?ప్రభుత్వ ఉద్యోగం ఖాయమా?

రాష్ట్రము విడిపోయాక ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ తో విడిపోయింది.కనీసం రాజధాని కూడా లేదు ప్రభుత్వ కార్యాలయాలు అన్ని హైదరాబాద్ లో ఉండిపోయాయి.ప్రస్తుతం అమరావతిలో తాత్కాలిక ప్రభుత్వ భవనాలు నిర్మించి

|

రాష్ట్రము విడిపోయాక ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ తో విడిపోయింది.కనీసం రాజధాని కూడా లేదు ప్రభుత్వ కార్యాలయాలు అన్ని హైదరాబాద్ లో ఉండిపోయాయి.ప్రస్తుతం అమరావతిలో తాత్కాలిక ప్రభుత్వ భవనాలు నిర్మించి అక్కడి నుండే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువగా ఉంది ప్రతి ఏటా కొన్ని లక్షల మంది ప్రభుత్వ పోటీ పరీక్షలు రాస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం:

రాష్ట్ర ప్రభుత్వం:

యువత ఎంతో మంది ప్రతి సంవత్సరం పోటీ పరీక్షలు రాస్తూనే ఉన్నారు.అందులో కేవలం అతి తక్కువ మందికి మాత్రమే ఉద్యోగాలు లభిస్తున్నాయి.చాల మంది నిరాశకు గురవుతూనే ఉన్నారు.ప్రభుత్వ పరీక్షలు రాయడానికి వయసు పరిమితి ఉంది అందుచేత చాల మంది దీని కారణంగా వారి ప్రయత్నాలు వదిలేస్తున్నారు అటువంటి వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

వయో పరిమితి:

వయో పరిమితి:

ప్రభుత్వ రంగ పరీక్షలకు వయో పరిమితిని పెంచుతూ జీవో నంబర్ 132 ను విడుదల చేసింది.రానున్న DSC, ఏపీపీఎస్సీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ జీవో ద్వారా జెనరల్ క్యాటగిరి అభ్యర్థులు 42 ఏళ్ళు వచ్చేవరకు ప్రభుత్వ రంగ పరీక్షలు రాయడానికి అర్హత ఉంటుంది.

రిజర్వేషన్ క్యాటగిరి:

రిజర్వేషన్ క్యాటగిరి:

ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ లకు లోనే ఫిసికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఉన్న రిజర్వేషన్ యధాతదంగా అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేసారు.పెంచిన ఈ వయో పరిమితి 2029 సెప్టెంబర్ 30 వరకు వర్తించనుంది.

ఈ ఏడాది:

ఈ ఏడాది:

ఈ ఏడాది సెప్టెంబర్ 30 తో వయో పరిమితి ముగిసిపోవడంతో చాల మంది నిరుద్యోగులు నిరుత్సాహం చెందారు.తాజాగా ప్రభుత్వం వయో పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకున్నాక చాల మంది అభ్యర్థులు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ప్రతిభా పురస్కారాలు:

ప్రతిభా పురస్కారాలు:

AP సీఎం ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం లో AP విద్యార్థులను ప్రశంసించారు.రాష్ట్రంలో గత ఏడాది పది,ఇంటర్ మరియు డిగ్రీ లలో అత్యుత్తమ మార్కులు అలాగే గ్రేడ్లు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.

ప్రతిభా అవార్డు పొందిన వారు:

ప్రతిభా అవార్డు పొందిన వారు:

ప్రతిభా అవార్డు పొందినవారు ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే పదవి విరమణ వయస్సు ఏడాది పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.వాస్తవానికి ప్రభత్వ ఉద్యోగస్తుల విరమణ వయస్సు 60 సంవత్సరాలు కానీ ప్రతిభా అవార్డు పొందిన వారికి ఒక ఏడాది అదనంగా ఉద్యోగం చేసే అర్హత పొందుతారని ప్రకటించారు.

ప్రతిభకు గుర్తింపు:

ప్రతిభకు గుర్తింపు:

మీరు సాధించిన ప్రతిభకు గుర్తింపుగా ప్రభుత్వం మీకు ఇస్తున్న గౌరవం అని బాబు వెల్లడించారు.61 సంవత్సరాల వరకు ఉద్యోగ అవకాశం ఉంటుందని మెరిట్ సాధించినందుకు మీకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం అని ఆయన అన్నారు.

యువత:

యువత:

దేశంలో టెక్నాలజీ ని శాసించే శక్తి ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే ఉందని అన్నారు.AP ని ఇన్నోవేషన్ వ్యాలీ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.ఈజ్ అఫ్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం లో ఉందని చంద్రబాబు అన్నారు.

English summary

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల పంట పండిందా?ప్రభుత్వ ఉద్యోగం ఖాయమా? | Good News For Andhrapradesh Unemployees By Govt

After the state bifurcation, the Andhra Pradesh split with the deficit budget. Not the capital and government offices all stayed in Hyderabad. At present, temporary government buildings in Amravati are functioning from there.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X