For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైల్వే ప్రయాణికులకు మరిన్ని సదుపాయాలు ఇస్తున్న రైల్వే శాఖ

By girish
|

ప్రయాణీకుల సేవలను సులభతరం చేసేందుకుగాను ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ) ఒక ప్రత్యేక చాట్‌బాట్‌‌ను తీసుకొచ్చింది. ఐఆర్‌సీటీసీ శనివారం ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెంట్‌‌ బాట్‌ అయిన కోరోవర్ ప్రైవేట్ లిమిటెడ్‌తోతో జతకట్టి 'ఆస్క్‌దిశా' అనే చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టింది. ఈ చాట్‌బాట్ ద్వారా ప్రయాణీకులు వారి అవసరాలకు అనుగుణంగా సమాచారం అడిగి తెలుసుకోవచ్చని భారతీయ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ చాట్ బాక్స్‌లో ఏ సమాచారం కావాలన్నా అడిగి తెలుసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. ఐఆర్‌సీటీసీ అందించే ఏ సేవలైనా- రైలు, ప్రయాణ సమయాలు, పేమెంట్స్‌, రిజర్వేషన్ ఇలా ఎటువంటి సేవలైనా చాట్‌బాట్‌ ఫీచర్‌ ఆఫర్‌ చేస్తోందని చెప్పారు. ప్రయాణీకుడు తాను పొందదలుచుకున్న సేవలను టైప్‌ చేసి ఆస్క్ బటన్‌పై క్లిక్ చేయగానే.. ఇంటెలిజెంట్‌ చాట్‌బాట్‌ ఆటోమేటిక్‌గా ఆ వివరాలను తీసుకుని సత్వరమే మీకు సమాధానం ఇస్తుందని అన్నారు. ఇదొక సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాం అని, ప్రయాణీకుల ప్రశ్నలకు వెంటనే సమాధానం ఇస్తుందన్నారు.

రైల్వే ప్రయాణికులకు మరిన్ని సదుపాయాలు ఇస్తున్న రైల్వే శాఖ

అనేక ప్రాంతీయ భాషల్లో ఆస్క్‌దిశా చాట్‌బాట్ సేవలు అందుబాటులో ఉంటాయని, ఇది వాయిస్ ఎనేబుల్డ్ అని, త్వరలోనే ఐఆర్‌సీటీసీ యాప్‌తో ఇంటిగ్రేట్ చేస్తామని చెప్పారు. ఆస్క్‌దిశా 24*7 అందుబాటులో ఉంటుందన్నారు.

ఈ చాట్‌బాట్ ద్వారా ప్రయాణీకులకు సమయం ఆదా అవుతుందని చెప్పారు. చాట్ ఎనేబుల్డ్ హెల్ప్ డెస్క్ సర్వీస్ ప్రోగ్రాం- 'ఆస్క్‌దిశా'ను దేశంలో మొట్టమొదటిసారి ప్రారంభించిన ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్‌సీటీసీ అని అధికారులు చెప్పుకొచ్చారు.

త్వరలో ఐఆర్‌సీటీసీ పేరు మార్పు

భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ) త్వరలో కొత్త పేరుతో పిలువబడుతుందని తెలిసింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తుతం ఉన్న ఐఆర్‌సీటీసీ పేరు చాలా పొడవుగా ఉందని.. పేరును కుదించాలని అనుకుంటున్నారట. చిన్నగా, సులభంగా ఉండే కొత్త పేర్లను సూచించాలని రైల్వే అధికారులను సూచించారట. ఇదే జరిగితే రైల్వే చరిత్రలో వెబ్‌సైట్ పేరు మార్చడం ఇదే తొలిసారి అవుతుంది.

అటు ప్రయాణికులకు రైల్వేలు వర్తింపచేస్తున్న 'ఉచిత ప్రయాణ బీమా' సౌకర్యాన్ని సెప్టెంబరు 1 నుండి రైల్వే శాఖ నిలిపివేసింది. బీమా సౌక‌ర్యం ఆప్ష‌న‌ల్‌గా అందుబాటులో ఉంటుందని.. ప్రయాణీకులు కొంత మొత్తం చెల్లించి (పైసల్లో) ఇక‌పై రైల్వే ప్ర‌యాణానికి బీమా సౌక‌ర్యాన్ని వినియోగించుకోవ‌చ్చని తెలిపింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు బిడ్లలో ఐఆర్‌సీటీసీ ప్రయాణీకులకు ఉచిత ప్రయాణ బీమాసౌకర్యాన్ని ఇచ్చింది ఇప్పుడు, ప్రయాణీకులు బీమా సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే 68 పైసలు ప్రీమియంను బీమాగా చెల్లించవలసి ఉంటుంది.

ఆన్లైన్ టిక్కెట్లను బుక్ చేసుకునే వారు మాత్రమే బీమా సౌకర్యానికి అర్హులు. కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పిఆర్ఎస్) ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునేవారికి ఈ సౌకర్యం అందుబాటులో లేదు.అటు రోజూ సగటున 40 లక్షల మంది ఐఆర్‌సీటీసీ సైట్‌ను సందర్శిస్తున్నారు.

Read more about: irctc
English summary

రైల్వే ప్రయాణికులకు మరిన్ని సదుపాయాలు ఇస్తున్న రైల్వే శాఖ | Changes in IRCTC

To facilitate passenger services, Indian Railway Catering and Tourism Corporation Limited (IRCTC) has brought a special chatbate.
Story first published: Tuesday, October 16, 2018, 10:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X