For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తితలీ తుఫాను బాధితులకు వీర రాఘవ రెడ్డి మరియు అర్జున్ రెడ్డి విరాళాలు

By girish
|

'తితలీ' తుఫానుతో శ్రీకాకుళం జిల్లాలోని 169 గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఈ తుఫాను పెను బీభత్సానికి చెట్లు, పూరిగుడిసెలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల కుటుంబాలు నివాసముండేందుకు ఇళ్లు లేక నిరాశ్రయులైనట్లుగా తెలుస్తోంది.

సిక్కోలుకు

సిక్కోలుకు

ఇలాంటి తరుణంలో కేరళకు స్పందించిన మాదిరిగానే తమకు తోచినంతగా సిక్కోలు ప్రజలకు సాయం చేసి ఆదుకోవాలని సినీ హీరోలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు నడుంబిగించారు. ఇదివరకే టాలీవుడ్ హీరో బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు రూ.50 వేలు ఆర్థిక సాయం ప్రకటించడం జరిగింది. ఇక్కడ్నుంచే సిక్కోలుకు సినీ ఇండస్ట్రీ సాయం మొదలైంది.

అర్జున్ రెడ్డి హీరో

తాజాగా అర్జున్ రెడ్డి హీరో విజయ్‌దేవరకొండ స్పందించి తన వంతుగా సిక్కోలుకు రూ. 5లక్షలు ఆర్థిక సాయం చేశాడు. తాను సీఎం రిలీప్ ఫండ్‌కు డబ్బులు పంపినట్లు స్క్రీన్ షాట్‌ను కూడా ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసిన విజయ్ అందరూ ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలువాలని ట్విట్టర్ వేదికగా ఆయన పిలుపునిచ్చాడు. పలువురు విజయ్ అభిమానులు ఆయనిచ్చిన పిలుపుమేరకు ఆర్థిక సాయం ప్రకటించారు అనంతరం తాము ట్రాన్స్‌ఫర్ చేసిన వివరాలను స్క్రీన్‌షాట్ రూపంలో విజయ్‌‌కు ట్వీట్ చేశారు

సంపూర్ణేశ్‌ బాబు

సంపూర్ణేశ్‌ బాబు

సాయం చేసే విషయంలో ముందు వరుసలో ఉండే విజయ్‌దేవరకొండను నెటిజన్లు మెచ్చుకుని ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సంపూర్ణేశ్‌ బాబు, విజయ్ దేవరకొండ లాగే మిగిలిన సెలబ్రిటీలు కూడా స్పందించి తోచినంత సాయం అందించి సిక్కోలు వాసులను ఆదుకోవాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కోరుతున్నారు.

అరవింద సమేత వీర రాఘవ

అరవింద సమేత వీర రాఘవ

ఇక నందమూరి తారక రామారావు తాజాగా అరవింద సమేత వీర రాఘవ దసరా రేసులో సూపర్ డూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇది ఇలాగే ఉంటే ప్రకృతి కోపంతో శ్రీకాకుళం జిల్లాలో 169 గ్రామాలు అతలాకుతలమయ్యాయి.

ఎన్టీఆర్ - కల్యాణ్‌రామ్

ఎన్టీఆర్ - కల్యాణ్‌రామ్

తితలీ బాధితులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ విరాళం ప్రకటించి ఇండస్ట్రీలోని వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ తుఫాను పెను బీభత్సానికి చెట్లు, పూరిగుడిసెలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల కుటుంబాలు నివాసముండేందుకు ఇళ్లు లేక నిరాశ్రయులైనట్లుగా తెలుస్తోంది.

 తాజాగా

తాజాగా

ఇలాంటి తరుణంలో కేరళకు స్పందించిన మాదిరిగానే తమకు తోచినంతగా సిక్కోలు ప్రజలకు సాయం చేసి ఆదుకోవాలని సినీ హీరోలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు నడుంబిగించారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రూ.15 లక్షల విరాళాన్ని, కల్యాణ్‌రామ్ రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా రూ.లక్ష విరాళాన్ని ప్రకటించారు.

Read more about: funds
English summary

తితలీ తుఫాను బాధితులకు వీర రాఘవ రెడ్డి మరియు అర్జున్ రెడ్డి విరాళాలు | Tollywood Celebraties Started Giving Funds to Titli Cyclone

169 villages in Srikakulam district with the 'Thoothili' storm. The storm was destroyed by trees and shrines and houses.
Story first published: Monday, October 15, 2018, 13:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X