పెట్రోల్ మరియు గ్యాస్ ధరలు తగ్గిస్తాము అంతే కాకుండా మహిళలకు రూ.10 లక్షలు రుణం.
పెట్రో ధరలు రోజు రోజుకు పెరుగుతూ క్రమంగా ఆకాశానంటుకోవడంతో జనాల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో వ్యక్తమౌతోంది. ఎన్నికల తరుణంలో ఈ అంశం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. ప్రచారంలో దీన్ని ప్రధానంశంగా చేర్చి విమర్శలు సంధిస్తున్నాయి.

ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఈ క్రమంలో పెట్రో ధరలపై ప్రభుత్వాల తీరుపై దుమ్మతిపోసిన టి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాము అధికారంలోకి రాగానే పెట్రో ధరలు తగ్గిస్తామని ప్రకటించారు. పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగిస్తామన్నారు.

కాంగ్రెస్ ప్రభంజనం
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అటు దేశంలో బీజేపీ సర్కార్ పై..ఇటు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని దయ్యబట్టారు. తెలంగాణలో పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందని.. సర్వేల రిపోర్టే ఇందుకు నిదర్శనమన్నారు.పలువురు తెలంగాణ ఉద్యమకారులు పీసీసీ చీఫ్ సమక్షంలో కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మేరకు హామీ ఇచ్చారు.

మహిళా సంఘాలకు
మహిళా సంఘాలకు రూ.10 లక్షల రుణం..వడ్డీ భారం ప్రభుత్వానిదే ఇది ప్రభుత్వ ప్రకటన అనుకోకండి..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ మేరకు ఆర్ధిక సాయం అందిస్తామని తెలంగాణ పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

రుణం
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా ప్రతి మహిళా సంఘానికి ఈ మేరకు రుణం అందిస్తామని చెప్పిన ఉత్తమ్ వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. ఇంతటితో ఆగక వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, బీడీ కార్మికులకు నెలకు రూ.2వేలు దివ్యాంగులకు రూ.3 వేల చొప్పున పింఛన్ ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి

షాపూర్‌నగర్‌లో
షాపూర్‌నగర్‌లో నిర్వహించిన ‘కాంగ్రెస్ మహిళా గర్జన' సభలో టి.పీసీసీ చీఫ్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల బతుకులు బాగుపడితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని ..దీన్ని కాంగ్రెస్ పార్టీ గట్టిగా నమ్ముతోందన్నారు

మోడీ
అచ్ఛే దిన్ పేరుతో అధికారంలోకి వచ్చిన మోడీ పేదలు, మహిళల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. మోడీ పాలనలో వంటగ్యాస్ రూ.970కి చేరింది అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలనంటుతున్నాయని విమర్శించారు.

సంక్షేమ పథకాలు
డిసెంబర్ 12న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఉత్తమ్ అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి అనేక వరాలు కురిపించారు.

కాంగ్రెస్ పార్టీ వరాలు ఇవే:
తెల్ల రేషన్‌కార్డు ఉన్న కుటుంబంలో ప్రతి మనిషికి నెలకు 7 కిలోల సన్నబియ్యం సన్న బియ్యంతో పాటు ఉప్పు, పప్పు, చక్కెర సహా 9 రకాల వస్తువులు మహిళా సంఘాలకు రూ.10 లక్షల రుణం..వడ్డీ భారం ప్రభుత్వానిదే వృద్ధులు, వితంతువులు, చేనేత, బీడీ కార్మికులకు నెలకు రూ.2వేలు దివ్యాంగులకు రూ.3 వేల చొప్పున పింఛన్ ఏడాదికి 6 వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని ప్రకటన


Click it and Unblock the Notifications