దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా .ఈ దసరా పండుగ సంధర్బంగా తన ఖాతా వినియోగదారులకి మరింత దగ్గరయ్యిందుకు డిజిటల్ వేదికను మార్గంగా చేసుకున్నది. ఈ పండుగల సీజన్‌లో డిజిటల్ వేదిక 'యోనో (వైవోఎన్‌వో)' యాప్ ద్వారా కొనుగోళ్లు జరిపే వినియోగదారులకు ఎస్బీఐ అదనపు రాయితీలు, క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఇక యోనో అంటే 'యూ ఓన్లీ నీడ్ వన్' అని అర్థం.

85 ఈ- కామర్స్ బంధం
ఈ యాప్‌తో 85 ఈ -కామర్స్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాగిత రహిత బ్యాంకింగ్ సేవలతో పాటు పెట్టుబడులు, ఫైనాన్షియల్ ఉత్పత్తుల కొనుగోళ్లపై వినియోగదారులకు యోనో యాప్ సేవలందిస్తుంది.డిజిటల్ షాపింగ్ వేడుకను అందిస్తున్న తొలి బ్యాంకు తమదేనని ఎస్బీఐ తెలిపింది. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా అక్టోబర్ 16-21 వరకు కొనుగోళ్లు జరిగే వినియోగదారులకు సంస్థ 10 శాతం వరకు రాయితీ, క్యాష్‌బ్యాక్ అందిస్తామని తెలిపింది.

14 ఈ-కామర్స్ సంస్థలతో
యోనో ద్వారా 14 ఈ-కామర్స్ సంస్థల్లో కొనుగోళ్లు జరుప వచ్చునని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ పీకే గుప్తా తెలిపారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ పవర్డ్ మొబైల్ ఫోన్లలో యోనో యాప్ అందుబాటులోకి వస్తుంది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బహుమతులు, నగలు, ఫర్నీచర్, ట్రావెల్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో ఆఫర్లు లభిస్తాయి.

ఈ- కామర్స్ బిజినెస్
అమెజాన్, జబాంగ్, మింత్రా, కల్యాన్, క్యారట్‌లేన్, పీసీజే, పెప్పర్‌ఫ్లై, ఓయో, టాటాక్లిక్, యాత్ర, ఈజ్‌మైట్రిప్, ఫస్ట్‌క్రై, ఐజీపీ, ఫెర్న్స్ అండ్ పెటల్స్ వంటి టాప్ డిజిటల్ మార్కెట్ వేదికల్లో వినియోగదారులు యోనో షాపింగ్ ఫెస్టివల్ ఆఫర్లు పొందొచ్చు.

యోనో యాప్
గతేడాది నవంబర్ నెలలో బ్యాంక్ ‘యోనో' యాప్ సేవలను ప్రారంభించింది. యువతరానికి ఈ యాప్ ఎంతో ఆకర్షణీయంగా మారింది. ప్రస్తుతం 30 లక్షల మంది కస్టమర్లు గల యోనో యాప్ లో ప్రతి రోజూ 25 వేల మంది వినియోగదారులు చేరుతున్నారని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ పీకే గుప్తా వివరించారు.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications