For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆటో డ్రైవర్ అకౌంట్ లో రూ.300 కోట్లు ఎలా వచ్చాయో!

|

కొందరికి డబ్బు లాటరీ లో వస్తుంది మరికొందరికి వ్యాపారంలో వస్తుంది ఇంకా కొంతమందికి కష్టపడితే వస్తుంది కానీ ఒక అతనికి మాత్రం ఏమి చేయకుండా కోట్లుకోట్లు వచ్చాయి అలాగా మీకు వస్తే మీరు ఏమి చేస్తారో ఎమ్మో కానీ ఇతను మాత్రం.....

ఆటో డ్రైవర్

ఆటో డ్రైవర్

పాకిస్తాన్‌కి చెందిన ఓ సగటు ఆటో డ్రైవర్ ఖాతాలో రూ.300 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం అందుకున్న ఆ దేశ ఇంటెలిజెన్స్ అధికారులు ఆయనను పిలిపించి విచారించారు. అప్పుడు వారికి ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. తన బ్యాంకు ఖాతాలోకి అంత సొమ్ము ఎలా వచ్చి చేరిందో తనకు తెలియదని ఆ ఆటో డ్రైవర్ ఆశ్చర్యపోతూనే.. మరోవైపు తనకూ ఏ పాపమూ తెలియదని వాపోయాడు. 2005లో ఓ సంస్థలో ఉద్యోగానికి చేరినప్పుడు.. వారు తనతో బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయించారని.. ఆ ఉద్యోగం మానేశాక తాను ఆ బ్యాంకు ఖాతాను వాడడం మానేశానని సదరు ఆటో డ్రైవర్ తెలిపాడు.

ఖాతాలో

ఖాతాలో

తను జీవితంలో కనీసం రూ.లక్ష రూపాయలు కూడా కళ్లారా చూడలేదని అలాంటిది తన ఖాతాలో రూ.300 కోట్లు వచ్చి పడడం ఆనందంగా ఉన్నా అది తనది కానీ డబ్బు కాబట్టి.. తనకు ఆ డబ్బుకి సంబంధం లేదని ఆయన పోలీసులకు చెప్పాడు. తన ఖాతాను ఉపయోగించుకొని ఎవరో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారేమో అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశాడు.

ఇంటెలిజెన్స్ అధికారులు

ఇంటెలిజెన్స్ అధికారులు

కొన్ని రోజుల క్రితం ఓ చిరు వ్యాపారి అకౌంట్లో కూడా రూ.200 కోట్లు జమయ్యాయి. అధికారులు ప్రశ్నించే వరకు అతడికి ఆ విషయం తెలియదు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుతుండడంత.అధికారులు దృష్టిపెట్టారు. పేదల బ్యాంకు ఖాతాలను వాడుకొని కొందరు బడాబాబులు పెద్ద మొత్తంలో లావాదేవీలు జరుపుతున్నారని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసును ఛేదించడానికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులు సకల యత్నాలూ చేస్తున్నారు

 మనీ ల్యాండరింగ్

మనీ ల్యాండరింగ్

ఒక సామాన్య వ్యక్తి ఖాతాలోకి కుప్పలు తెప్పలుగా డబ్బులు వచ్చి పడుతుండడంతో బ్యాంకు అధికారులు ఇంటెలిజెన్స్ వారికి సమాచారం అందించగా వారు రంగంలోకి దిగారు. ఆ ఖాతా ఓ ఆటో తోలుకొనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లు తెలుసుకొన్నారు. ఈ మధ్యకాలంలో ఆసియా దేశాల్లో మనీ ల్యాండరింగ్ కార్యకలాపాలు విపరీతంగా జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని ఆగంతక ఖాతాల నుండి కోట్లాది డబ్బు ట్రాన్స్ ఫర్ కావడంతో బ్యాంకు అధికారులే ముక్కున వేలేసుకొనే పరిస్థితి ఉత్పన్నమవుతోంది.

Read more about: money
English summary

ఆటో డ్రైవర్ అకౌంట్ లో రూ.300 కోట్లు ఎలా వచ్చాయో! | Auto Driver Got Rs.300 Crores in His Bank Account

auto rickshaw driver got the scare of his life when he received a call from Pakistan’s top investigation agency which sought an explanation from him about a whopping Rs 300 crore worth of transactions made to his account
Story first published: Monday, October 15, 2018, 9:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X