For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వినియోగదారుపై మరో పెద్ద బండరాయి వేయనున్న SBI డిసెంబర్ లోగా

By girish
|

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా రోజురోజుకు తమ వినియోగదారులతో ఆడుకుంటోంది ఈ మధ్య ఈ బ్యాంకు చేసే నిబంధనలకు ప్రజలలో చాలా వ్యతిరేకత వస్తోంది. నిన్న విత్ డ్రా లిమిట్ నిబంధన ఈరోజు ఇంటర్ నెట్ బ్యాంకింగ్ నిబంధన.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగదారులు అయితే, మీరు డిసెంబర్ 1, 2018 నాటికి బ్యాంకుతో మీ మొబైల్ నంబర్ ను రిజిస్ట్రేషన్ చేయాలి.గడువు లోగా మీరు దాన్ని నమోదు చేయకపోతే మీకు నెట్ బ్యాంకింగ్ సదుపాయం డిసెంబర్ 1 నుండి బ్లాక్ చేయబడుతుంది.

ఇంటర్నెట్ బ్యాంకింగ్

ఇంటర్నెట్ బ్యాంకింగ్

బ్యాంక్ వినియోగదారుల యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్ సైట్ 'onlinesbi' లో తమ మొబైల్ నంబర్ను బ్రాంచ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలి లేదంటే వారి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం పనిచేయదు.

డిసెంబర్

డిసెంబర్

ఇంటర్ నెట్ బ్యాంకింగ్ వినియోగదారులకు బ్యాంక్ వారిచే విజ్ఞప్తి,మీరు మీ మొబైల్ నంబర్ ను నమోదు చేయలేదంటే వెంటనే మీకు సంబందించిన బ్రాంచ్ కు వెళ్లి నమోదు చేసుకోండి గడువు ఐపోయిన వెంటనే అంటే 01.12.2018 తేదీ నుండి మీ నెట్ బ్యాంకింగ్ సదుపాయం పూర్తిగా రద్దు చేయబడుతుంది అని ఎస్బిఐ తన అధికార వెబ్ సైట్ లో తెలిపింది.

మొబైల్ నంబరు

మొబైల్ నంబరు

అందుచేత, మీ మొబైల్ నంబరు ఇప్పటిదాకా మీ ఖాతా కోసం ఎస్బిఐ లో నమోదు చేయకపోతే, మీరు వీలైనంత త్వరగా దాన్ని చేయడమే మంచిది.మొబైల్ నంబరు బ్యాంక్ బ్రాంచ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలి అని వెబ్సైట్ లో తెలిపింది. అందువల్ల, మీరు మీ మొబైల్ నంబర్ను నమోదు చేయడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ కు మిరే స్వయంగా వెళ్లి నమోదు చేయాలనీ వెల్లడించింది.

ఆర్బిఐ

ఆర్బిఐ

జూలై 6, 2017 నాటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) గణాంకాల ప్రకారం, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలకు కస్టమర్ కు అందుబాటులో ఉన్న ఇమెయిల్ ఐడి కి ఎప్పటికప్పుడు SMS హెచ్చరికలు మరియు ఇమెయిల్ హెచ్చరికల పంపడానికి తప్పనిసరిగా నమోదు చేయాలి.ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, మొదలైనవి ఉంటాయి. బ్యాంకు యొక్క ప్రయత్నాలు ఆర్బిఐ వృత్తాకారంలో అనుసరించే ప్రయత్నంగా కనిపిస్తాయి.

 SBI కొత్తగా పెట్టిన కొన్ని నిబంధనలు ఇవే.

SBI కొత్తగా పెట్టిన కొన్ని నిబంధనలు ఇవే.

ఇక కొత్త రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి మరో ఒక అకౌంట్లో డబ్బులు వేయడం కుదరదు.సొంత కుటుంబ సభ్యులు అయినా సరే వారికీ కూడా డబ్బులు పంపలేము అని ఈ కొత్త రూల్ అమలులోకి వస్తే కొన్ని కోట్ల SBI అకౌంట్ వినియోగదారులు త్రీవ్ర నష్టాలని మరియు ఇబ్బందులని ఎదురుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ బ్యాంకు లేకపోయినా ప్రతి ఒక ఊరిలో SBI బ్యాంకు ఉంటుంది

ఇక అసలు మ్యాటర్ ఏమి అంటే ఒకరి అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి డబ్బులు బదిలీ చేస్తున్న విషయంలో మోసాలు అరికట్టడానికి స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఈ చర్యలు తీసుకొంది.

విత్ డ్రా

విత్ డ్రా

ఇప్పటికే మినిమం బ్యాలన్స్, పెనాల్టీతో వినియోగదారుల నడ్డి విరుస్తున్న స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా తాజాగా మరో నిర్ణయం తీసుకొంది అది ఏంటో తెలుసా? ఇప్పటి వరకు రోజుకు ఏటియం కార్డు నుంచి గరిష్ట విత్ డ్రా పరిమితి రూ.40000 వరకు ఉంది. ఇప్పుడు SBI అకౌంట్ ఉన్నవారు రోజుకు రూ.20 000 మాత్రమే విత్ డ్రా చేసుకోగలరు.

ఇక మీకు SBI అకౌంట్ మీకుంటే మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు:

ఇక మీకు SBI అకౌంట్ మీకుంటే మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు:

నగదు ఉపసంహరణ పరిమితి విషయంలో కూడా ఎస్‌బీఐ ఎన్నోరకాల కార్డులను వినియోగదారులకు అందిస్తోంది. ఒక్కో కార్డుకు ఒక్కో పరిమితితో ఆపర్లను అందిస్తోంది. కానీ SBI ఎటిఎం ఉన్న ప్రతి ఒకరు తెలుసుకోవలసిన విషయాలు

వెనుక వైపు

వెనుక వైపు

  • మీరు ఎటిఎం తీసుకోగానే ముందుగా దాని వెనుక వైపు భాగంలో సంతంకం చేయాలి
  • మీ ఎటిఎం పిన్ నెంబర్ అప్పుడప్పుడు మారుస్తుండాలి
  • కార్డు పిన్ నంబర్లు

    కార్డు పిన్ నంబర్లు

    • ఎటిఎం మీద ఎప్పుడు మీ పిన్ నెంబర్ రాయదు
    • ఎవరన్నా మీకు కాల్ చేసి మీ కార్డు పిన్ నంబర్లు అడిగితే చెప్పదు.
    • పిఓఎస్ మిషిన్

      పిఓఎస్ మిషిన్

      • మీరు ఎటిఎంలో డబ్బులు తీసుకునేటప్పుడు లోపకి ఎవరిని రానీయద్దు.
      • పిఓఎస్ మిషిన్ మీరు వాడేటప్పుడు మీ పిన్ నెంబర్ ఎవరికీ కనపడకుండా చూసుకోవాలి.

       గ్రీన్ కలర్ లైట్

      గ్రీన్ కలర్ లైట్

      • మీరు ఎటిఎంలో డబ్బు విత్ డ్రా చేసుకున్నాక స్లిప్ వస్తుంది అది అక్కడే పడేయకూడదు ఎందుకంటే దాంట్లో మీ అకౌంట్ కి సంబందించిన వివరాలు ఉంటాయి, కానీ ఈరోజుల్లో చాలామంది అక్కడే పడేస్తుంటారు జాగ్రత్తగా ఉండాలి
      • ఎటిఎంలో గ్రీన్ కలర్ లైట్ వచ్చేవరకు మీరు మిషన్ లో కార్డు పెట్టకూడదు
      • కార్డు స్వైప్

        కార్డు స్వైప్

        • ఈరోజుల్లో చాలామంది ఎక్కడికి వెళ్లిన కార్డు స్వైప్ చేస్తున్నారు మీరు హోటళ్లకు మరియు షాపింగ్ కు ఎక్కడికి వెళ్లిన మీ ముందరే కార్డు స్వైప్ చేయమని చెప్పండి.
        • తాత్కాలిక స్టాల్ల్స్ లో అనవసరంగా కార్డు స్వైప్ చేయకండి.
        •  ఫోన్ చేసి

          ఫోన్ చేసి

          మీరు చేసే ప్రతి లావాదేవీ మీ మొబైల్ నెంబర్కు ఎస్ఎంఎస్ వచ్చేలాగా చూసుకోండి అందుకోసం మీ బ్యాంకులో మొబైల్ నెంబర్ ఇవ్వండి.

          ఒకవేళ మీ ఎటిఎం కార్డు పోతే వెంటనే 1800 425 3800 లేదా 1800 11 22 11 ఫోన్ చేసి మీ కార్డును బ్లాక్ చేయించండి.

Read more about: sbi
English summary

వినియోగదారుపై మరో పెద్ద బండరాయి వేయనున్న SBI డిసెంబర్ లోగా | SBI Latest News on Internet Banking

Internet banking facilities for State Bank of India (SBI) account holders may be blocked if they do not link registered mobile number with the bank by the December 1
Story first published: Saturday, October 13, 2018, 15:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X