చెట్టు కోసం 15 లక్షలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం 24గంటలు సెక్యూరిటీ! ఏంటో మీరే చూడండి.
వీవీఐపీ సెక్యూరిటీ అందుకుంటున్న ఈ చెట్టు పేరు బోధి వృక్షం ఈ ఒక్క చెట్టుకే 24 గంటలు గన్ మ్యాన్లతో రక్షణ కలిపించడం జరుగుతోంది. దేశంలోనే విఐపి సెక్యూరిటీ అందుకుంటున్న చెట్టు ఇదే.

15 ఎకరాల విస్తీర్ణంలో
ఇక ఇది 15 ఎకరాల విస్తీర్ణంలో 15 అడుగల ఎత్తులో ఫెన్సింగ్ మధ్యలో ఉంది ఈ చెట్టును ప్రజలు అత్యంత పవిత్రంగా భావించడంతోనే స్థానిక ప్రభుత్వం ఇంత సెక్యూరిటీ ఇస్తోంది. ఎందుకు ఈ చెట్టుకి అంత ప్రత్యేకత అంటే ఒకసారి మనం పూర్వము తెల్సుకోవలసిందే.

గౌతమ బుద్ధుడు
గౌతమ బుద్ధుడుకి ఈ చెట్టు కిందనే జ్ఞానోదయం అయింది అందువల్ల బౌద్దులకి ఈ చెట్టు అంత పవిత్రమైంది. దీని కేవలం బౌధమతస్థులే కాకుండా ఇతర మతస్థులు కూడా ఈ చెట్టును పవిత్రంగా చూసుకుంటారు.

భోపాల్
ఇక మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ దగ్గరలోని సాంచి మరియు సలామత్ పూర్ మధ్యలో ఒక చిన్న గుట్టపై ఈ చెట్టు ఉంది.దీని అత్యంత జాగత్తగా చూసుకుంటూ వస్తున్నారు. ఈ చెట్టు దగ్గరికి ఎవరిని అనుమతించారు ఎంతటి విఐపి ఐన సరే అనుమతి తీసుకోవలసిందే.

శ్రీలంక అధ్యక్షడు
2012 డిసెంబర్ అప్పటి శ్రీలంక అధ్యక్షడు రాజపక్ష ఇండియా వచ్చి బోధి మొక్క నాట్టాడు అది ఆలా పెరిగి పెద్ద అవుతూ వచ్చింది ఆలా దాని రక్షణ కోసం నలుగురు హోమ్ గార్డ్స్ ని నియమించారు . పగలు రాత్రి తేడా లేకుండా ఆ చెట్టుని చేసుకోవాలి.షిఫ్టుల వారీగా వస్తూ ఆ చెట్టుకి నీరు పోయాలి.ఆ చెట్టు దగ్గరికి ఎవరిని రానీయకుండా చూడాలి అదే వారి డ్యూటీ.

వాటర్ ట్యాంకు
ఈ చెట్టుకి నిత్యం నీరు అందేలాగా ఒక వాటర్ ట్యాంకుని కూడా వాడుతున్నారు అలాగే వారానికి ఒకసారి చెట్టు ఆరోగ్యగంగా ఉందొ లేదో చూసిపోవడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక డాక్టర్ వచ్చి చెక్ చేసి వెళ్తుంటాడు. ఇలా ఈ చెట్టుని బ్రతికించడం కోసం ఏటా రూ.15 లక్షలు ఖర్చుపెడుతోంది ప్రభుత్వం.

లక్షలు ఖర్చు
నిజానికి ఇది నిజమైన బోధి వృక్షం కాదు అని నిజమైన బోధి వృక్షం మూడవ శతాబ్దంలోనే దాని శ్రీలంక తీసుకోని అనురాధపుర లో నాటుకున్నారు అని మహా బోధి సొసైటీ వారు అంటున్నారు. మరి అలాంటప్పుడు ఒక చెట్టు కోసం ఇన్ని లక్షలు ఖర్చుపెట్టడం అవసరమా?

రైతులు ఆత్మహత్య
నీరు సరిగా అందక పంటలు సరిగా లేక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే గత ఏడాది మధ్యప్రదేశ్లో 51 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ వీవీఐపీ ట్రీట్మెంట్ ఏంటో చనిపోయినవారి కుటుంబాలకు ఇవ్వచ్చు కదా అని సామజిక నిపుణులు అంటున్నారు.

చెట్లు, మొక్కలు
నిజమే మనుషులకంటే చెట్లు, మొక్కలు మరియు వస్తువులు ఎక్కువఅయిపోయాయి ఈరోజుల్లో ఇక వీవీఐపీ ట్రీట్మెంట్ పొందుతున్న ఈ చెట్టు మరియు ఒక చెట్టు కోసం లక్షలక్షలు ఖర్చుపెడుతున్న ప్రభుత్వాని ఏమంటారో మీరే చెప్పండి.


Click it and Unblock the Notifications