For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గూగుల్ లో నెలకి లక్ష జీతం కానీ లవర్ కోసం ఏమి చేసాడో తెలుసా?

By girish
|

టైం బాగలేకపోతే అరటిపండు తిన్న పండు ఇరుగుతుంది అని అదిఏదో సినిమాలో అల్లుఅర్జున్ చెప్పిన్నట్లు మంచి జీతం అలాగే పెద్ద కంపెనీలో ఉద్యోగం ఇంకేముంది లైఫ్ లో సెటిల్ అనుకుంటారు అంతా కానీ ఇప్పుడు మీరు చదవబోయే వ్యక్తి గురించి తెలుసుకుంటే వీడి టైం ఎంత బ్యాడ్ అని అనుకుంటారు.

హర్యానాలోని

హర్యానాలోని

హర్యానాలోని అంబాలా ప్రాంతానికి చెందిన ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌కి గూగుల్ సంస్థలో జాబ్ చేయాలని కోరిక. ఎన్నో ఇంటర్వ్యూల తర్వాత ఆఖరికి ఆ సంస్థలో ఉద్యోగం దొరకడంతో ఆయన ఆనందానికే హద్దులు లేకుండా పోయింది. లక్షల జీతం వచ్చే ఉద్యోగంలో చేరాక.. ఓ గర్ల్ ఫ్రెండ్ కూడా పరిచయమైంది. గర్ల్ ఫ్రెండ్‌ను ఆనందింపజేయడం కోసం ఆయన చేసే ఖర్చులు కూడా పెరిగాయి వస్తున్న జీతం అంతా హారతి కర్పూరంలా కరిగిపోవడం ప్రారంభమైంది

 సాఫ్ట్ వేర్ ఇంజనీర్

సాఫ్ట్ వేర్ ఇంజనీర్

ఆ డబ్బంతా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడానికే సరిపోయేది. ఇక చేసేదేముంది అదనపు సంపాదన కోసం ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దొంగతనాలు కూడా చేయడం ప్రారంభించాడు.

మహిళ బ్యాగ్

మహిళ బ్యాగ్

అయితే ఇటీవలే ఆయన అనుకోకుండా సీసీటీవీ కెమెరాలకు చిక్కడంతో అసలు గుట్టు రట్టయింది. సెప్టెంబరు 11వ తేదిన ఐబీఎం కంపెనీ ఓ హోటల్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల కోసం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాల్గొనడానికి వెళ్లిన గూగుల్ ఉద్యోగి అక్కడ కూడా తన చేతివాటం చూపించాడు. అదే సెమినార్‌కు వచ్చిన ఓ మహిళ బ్యాగ్ నుండి ఆమెకు తెలియకుండా రూ.10,000 కాజేశాడు.

 సీసీటీవీ కెమెరాలు

సీసీటీవీ కెమెరాలు

అయితే తన బ్యాగ్ నుండి డబ్బు అపహరణకు గురైందని తెలుసుకున్న ఆ మహిళ వెంటనే హోటల్ వారికి సమాచారం అందించింది. హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించి సీసీటీవీ కెమెరాలు కూడా పరీక్షించడంతో దొంగతనం ఎవరో చేశారో తెలిసిపోయింది. వెంటనే పోలీసులు ఆ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి హోటల్‌కి ఎలా వచ్చాడన్న విషయాన్ని కూడా పరిశీలించారు.

క్యాబ్ నెంబర్

క్యాబ్ నెంబర్

ఉబర్ క్యాబ్ ద్వారా హోటల్‌కు ఆ వ్యక్తి వచ్చినట్లు నిర్థారించుకున్నారు. సీసీటీవీ కెమెరాలను జూమ్ చేసి.. ఉబర్ క్యాబ్ నెంబర్ ప్లేట్ వివరాలు కూడా తీసుకున్నారు. తర్వాత డ్రైవర్ ద్వారా ఉద్యోగి మొబైల్ నెంబరు పొందారు. ఇంకా ఏముంది మిగతా కథ మొత్తం మీకు అర్థమైంటుంది. పోలీసులు ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి అర్థమైయే కోడింగ్ లాంగ్వేజ్లో క్లాస్ పీకారు అంటా.

Read more about: google
English summary

గూగుల్ లో నెలకి లక్ష జీతం కానీ లవర్ కోసం ఏమి చేసాడో తెలుసా? | Google Software Engineer Theft Money From Colleague

The software engineer from Ambala in Haryana wanted to get a job in Google. After a lot of interviews, he had a job in the company and he was not happy with the pleasure.
Story first published: Friday, October 12, 2018, 12:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X