2019 ఎన్నికలకు ఇప్పటినుండే సందడి మొదలైంది ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే ఎన్నికల వాతావరణం నెలకొంది,అధికార విపక్ష పార్టీలు వరుస సభలతో హోరెత్తిస్తున్నాయి.
2019 ఎన్నికలకు ఇప్పటినుండే సందడి మొదలైంది ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే ఎన్నికల వాతావరణం నెలకొంది,అధికార విపక్ష పార్టీలు వరుస సభలతో హోరెత్తిస్తున్నాయి. అధికార పార్టీ పలు పథకాలు ప్రవేశపెడుతూ ప్రజలను ఆకట్టుకునే పనిలో పడింది.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్న మొదటి కోరిక ప్రత్యేకహోదా.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే ప్రత్యేకహోదా పై తొలి సంతకం అని రాహుల్ ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్ర రాజకీయాల్లో వేడి మొదలైంది.2019 సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రీ మేనిఫెస్టో ను విడుదల చేసింది.

ఎఐసిసి అధ్యక్ష్య బాధ్యతలు:
రాహుల్ గాంధీ ఎఐసిసి అధ్యక్ష్య బాధ్యతలు చేపట్టినప్పట్నుండి దేశవ్యాప్తంగా విస్తృతంగా తిరుగుతూ మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ విపక్షాలన్నిటిని ఏకం చేస్తున్నాడు.అంతే కాకుండా పార్టీ తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక ద్రుష్టి పెట్టింది.ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కి పలు వరాల జల్లు కురిపించింది.
ఆంధ్రప్రదేశ్ కి ఇస్తున్న వరాలు ఇవే:

ప్రత్యేక హోదా:
యుపిఎ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద తొలి సంతకం చేస్తానంటూ రాహుల్ గాంధీ బహిరంగంగానే ప్రకటించాడు.సిడబ్ల్యుసి సమావేశం లో కూడా దీనిపై పార్టీ శ్రేణులందరితో ఏకపక్ష తీర్మానం చేయించిన విషయం విదితమే. రాష్ట్రము విడిపోయాక చట్టం లో పొందుపరిచిన విభజన హామీలన్నీ నెరవేస్తా అని ప్రకటించాడు.

వెనుకబడిన జిల్లలకు:
ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత వెనకబడిన జిల్లాలు ఉత్తరాంధ్ర మరియు రాయలసీమకు బున్దేల్ ఖండ్ తరహాలో ప్రయేక ప్యాకేజి అమలు చేస్తామని ప్రకటించారు .అలాగే రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సరిపడా నిధులు కేటాయిస్తామని అలాగే బడ్జెట్ లోటు భర్తీ చేస్తామని కూడా ప్రకటించారు.మెట్రో రైళ్లు,రహదారులు,గన్నవరం పోర్ట్,విశాఖ ఉక్కు కర్మాగారం,రైల్వే జోన్ వంటి అంశాలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

నాలుగు వంట సీలిండర్లు ఉచితం:
ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా సంఘాలకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు అలాగే ప్రతి పేదకుటుంబానికి సంవత్సరానికి నాలుగు వంట సీలిండర్లను ప్రబుత్వం సబ్సిడీ కింద పూర్తిగా ఉచితంగా ఇస్తామని ప్రకటించింది.

పింఛన్ పథకం:
వృద్దులు,వితంతువులు ,ఒంటరి మహిళలకు పింఛన్లు,50 సంవత్సరాల నుండి 60 లోపు వారికి రూ.2000 రూపాయలు,60 నుండి 70 సంవత్సరాలలోపు ఉన్నవారికి రూ.25000 రూపాయలు అలాగే 70 ఏళ్ళు పైబడిన వారికి రూ.3000 మరియు వికలాంగులకు కూడా రూ.3000 రూపాయలు పింఛను ఇస్తామని ప్రకటించింది.

తెల్ల కార్డు అర్హులకు:
రాష్ట్రము లో తెల్ల కార్డు అర్హులందరికీ సన్న బియ్యం అలాగే అమ్మహస్తం పేరు మీద ప్రతి నెల 9 రకాలైన నిత్యవసర సరుకులను అందించనుంది.ఈ పథకం పండుగలతో సంబంధం లేకుండా ప్రతి నెల మీకు సంబందించిన ప్రభుత్వ స్టోర్ లో వీటిని పొందవచ్చు.

ప్రతి ఇంటికి:
రాష్ట్రవ్యాప్తంగా చాల ప్రాంతాల్లో మంచి నీరు కొరతతో ప్రజలు చాల అవస్థలు పడుతున్నారు,తాము అధికారం లోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి మంచి నీటి కుళాయి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

ఆరోగ్య శ్రీ పథకం:
గతం లో కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్నపుడు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం అమల్లోకి వచ్చింది దీనితో చాలా మంది పేద ప్రజలు ఉచిత వైద్యం అందుకున్నారు.ఇదే తరహాలో రానున్న 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ పథకం కింద రూ.2 నుండి రూ.5 లక్షల వరకు పెంచనున్నారు.

బీజేపీ ప్రభుత్వం:
గత 2014 ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం తాము అధికారం లోకి వచ్చిన వెంటనే ఆంధ్ర కి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చారు.కానీ ఎన్నికల్లో గెలిచిన తరువాత హామీని గంగలో కలిపేశారు.14 వ ఆర్థిక సంగం ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదని చెప్పిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్ల్య్ వెల్లడించారు.దింతో ప్రజలు బీజేపీ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications