అతని చిన్న ఆలోచనతో ఏడాదికి అక్షరాలా రూ.22 లక్షల సంపాదన తెచ్చిపెడుతోంది?
వ్యవసాయం లాభదాయకమైన ఆలోచన కాదని ఒక బలమైన అవగాహన ఉన్న ఈ రోజుల్లో, దొడ్డబల్లాపూర్ తాలూకాలోని తితహిళికి చెందిన ఈ రైతు కేవలం 2.1 ఎకరాల భూమి నుండి సంవత్సరానికి రూ.22 లక్షలు సంపాదిస్తున్నాడు.
బెంగళూరు: వ్యవసాయం లాభదాయకమైన ఆలోచన కాదని ఒక బలమైన అవగాహన ఉన్న ఈ రోజుల్లో, దొడ్డబల్లాపూర్ తాలూకాలోని తితహిళికి చెందిన ఈ రైతు కేవలం 2.1 ఎకరాల భూమి నుండి సంవత్సరానికి రూ.22 లక్షలు సంపాదిస్తున్నాడు.

ప్రయోగాత్మకంగా
ఇది తన నూతన డ్రైవ్ మరియు నిరంతరం ప్రయోగాత్మకంగా బహుళ పంట పద్ధతులు పాటించడం వలన తనకు అధిక సంపద రావడానికి సహాయపడింది అని 51 ఏళ్ల వయసు ఉన్న H.సదానంద తెలిపారు.

దాదాపు 30 రకాల పంటలు
తన భూమి లో దాదాపు 30 రకాలైన పంటలను అతను సాగు చేస్తాడు, ఇందులో టమోటా మరియు పోక చెట్లు సగం ఎకరాలలో పండిస్తున్నాడు దీనిపై తనకు సుమారు రూ. 2 లక్షలా 50,000 వేల వరకు ఆదాయం గడిస్తున్నాడు.

అల్లం చెట్లు
పోక చెట్లతో పాటు అల్లం కూడా సాగు చేస్తారు, ఇది అతనికి సంవత్సరానికి రూ. 70,000 దాక ఆదాయం వస్తోంది. సదానంద 250 గిరిరాజా కోళ్ళు పెంచుకోవడానికి తన వద్ద ఉన్న స్థలంలో వాటికి కొంత కేటాయించాడు, ప్రతి మూడు నెలల కొకసారి కోళ్లను విక్రయిస్తూ సంవత్సరానికి రూ.1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు. పౌల్ట్రీ రెట్టలు పోక చెట్లకు విలువైన ఎరువు, వ్యవసాయ వ్యర్థాలు పక్షులకు ఆహారం గా ఉపయోగిస్తారు.

గులాబీ మొక్కలు
అతను ఒక ఎకరాలో సుమారు మూడవ వంతు భోమిలో 2,000 గులాబీ మొక్కలను నాటారు.దీని ద్వారా అతను సంవత్సరానికి రూ.4 లక్షల రూపాయలు సంపద వస్తోంది, మరియు ఒక ఎకరాలో నాలుగింట కాప్సికం పంటను వేసాడు మరియు అది అధిక నాణ్యత ప్రత్యామ్నాయంగా పెరిగింది. సుమారు ఆరు నెలలు సాగు చేసిన కాప్సికమ్, రూ. 5.4 లక్షలు ఉండగా,రాబోయే ఆరు నెలల్లో క్యాప్సికమ్ స్థానంలో గులాబీ రకాలు రూ. సంవత్సరానికి 2.5 లక్షలు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి.

కూరగాయల పెంపకం
కాఫీ మొక్కలు, బొప్పాయి, సపోటా మరియు నిమ్మ చెట్లు పెంచడం అలాగే అదనంగా ఒక చిన్న కూరగాయల పెంపకం, చేపల పెంపకం కొలను, కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి.అంతేకాక అతను పెంచుతున్న ఆవులు రోజుకు 80 నుండి 100 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి.

ఎరువులు
ఎరువులు ఆవు వ్యర్థాల నుండి లభిస్తోంది అలాగే వీటితో గోబర్ గ్యాస్ కూడా లభిస్తోంది. ఒక చిన్న చెరువు అజోలా మొక్కలతో నిండి ఉంటుంది, ఇది ఒక మంచి ఆవు ఆహారం.

బిందు సేద్యం
నీటిపారుదల కోసం బోర్ పై ఆధారపడిన సదానంద మొత్తం భూమికి బిందు సేద్యం వ్యవస్థను రూ. 50,000 (రాయితీని మినహాయించి)పెట్టి ఏర్పాటుచేశాడు. "డ్రిప్ ఇరిగేషన్ నా మొత్తం భూమిని నాలుగు గంటల పటు త్రి ఫసె కరెంటు తో అనుమతిస్తుంది అన్నారు. అంతేకాదు, ఇది కలుపును నిరోధిస్తుంది మరియు వొకరోజుకు రూ. 400 రూపాయలు కార్మిక ఖర్చులు కూడా ఆదా చేస్తుందన్నారు.

పలు జాతుల శునకాలు:
ఆసక్తికరంగా, అతడు రొత్ వీలర్ మరియు గ్రేట్ డేన్ కుక్కల జాతులు పెంచుతున్నాడు వీటి ద్వారా సంవత్సరానికి రూ.1.2 లక్షలు ఆదాయం వస్తోంది.

వ్యవసాయ శాస్త్రవేత్తలు
ఆయన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ప్రతిష్టాత్మకమైన అవార్డులతో గౌరవం పొందాడు. అనేక వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు, దేశ విదేశాల నుంచి వచ్చి ఇతడి పంటలను చూసి వినూత్న ఆలోచనలు తెలుసుకోడానికి వస్తున్నారు.

వ్యవసాయ ఆదాయం
తన గ్రామంలో బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ బయో రిసోర్స్ కాంప్లెక్స్ ప్రాజెక్టు అందించిన వినూత్న ఆలోచనలను స్వీకరించిన తర్వాత తన వ్యవసాయ ఆదాయం పెరిగిందని సదానంద చెప్పారు.


Click it and Unblock the Notifications