రాయే కదా అనుకున్నాడు 30 ఏళ్ల తర్వాత అసలు సంగతి తెలుసుకోని షాక్ అయ్యాడు!
మీరు రోడ్ పై నడుస్తూ వెళ్ళుతుంటే ఏదో ఒక వింత వస్తువు దొరికింది అనుకోండి అది కొత్తగా ఉంది కదా అని ఇంట్లో ఉంచుకుంటారు. అయితే అది ఏంటో ఆ వస్తువు విలువ ఏంటో మీకు తెలీదు అనుకుందాం.మీ కళ్ళ ముందే ఉండే వస్తువు దాని విలువ తేలిక దాని ఎలా పడితే ఆలా వాడేశారు అనుకుందాం.

ఒక రైతుకి
హఠాత్తుగా ఒకరు వచ్చి మీ దగ్గర ఉన్న వస్తువు కొన్ని కోట్లకు విలువ చేస్తుంది అని చెబితే మీరు షాక్ అవుతారా లేదా? అదే సంఘటన ఒక రైతుకి జరిగింది అది ఏంటో మీరే చూడండి. ఓ రైతు గత 30 ఏళ్లుగా తన ఇంటిలో తలుపు అడ్డురాయిని వాడుతున్నాడు. 1988లో ఓ రైతు నుంచి ఆ వ్యక్తి సదరు రాయిని బహుమతిగా పొందాడు. అయితే దాని విలువను తెలుసుకోలేకపోయిన సదరు రైతు ఆ రాయిని తన ఇంటి తలుపు వద్ద అడ్డురాయిగా వాడుకుంటున్నాడు.

అరుదైన రాయి
అది అరుదైన రాయి అని 1930లలో ఆకాశం నుంచి తేలుతూ భూమి మీదకు వచ్చినట్లు దాని పూర్వ యజమాని చెప్పినా ఆ రైతు నమ్మలేదు ఇటీవల తాను 30 ఏళ్లుగా వాడుతున్న ఆ రాయి విలువ ఎంతో తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగింది ఆయనకు. ఈ రాయిని పరీక్ష చేయించగా షాకింగ్‌కు గురిచేసే అంశాలు వెలుగులోకి వచ్చాయి

లక్ష డాలర్లు
దీని విలువ సుమారు లక్ష డాలర్లు(రూ.72 లక్షలు) గా నిర్ధారణ కావడంతో ఆ రైతు ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఈ అరుదైన రాయి 88 శాతం ఇనుము, 12 శాతం నికెల్‌తో తయారు చేసి అరుదైన మెటియోరైట్ ఖనిజంగా గుర్తించారు.

సోనా సర్‌బెస్కూ
ఎక్స్‌రే సాయంతో దీనిపై పరీక్షలు చేసిన జియోలజిస్ట్ సోనా సర్‌బెస్కూ తాను పరీక్షలు చేసిన వాటిలో అత్యంత ఖరీదైన రాయి ఇదేనని చెప్పారు. ఈ రాయికి ఎడ్మోర్ మెటియోరైట్‌గా నామకరణం చేశారు. మరిన్ని పరీక్షలు పూర్తయితే దీని విలువ మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.

అదృష్ట దేవత
అదృష్ట దేవత తనతోటే గత ముడు దశాబ్ధాలుగా ఉన్నా గుర్తించలేకపోయినందుకు ఇప్పుడు చింతించాలో? ఆలస్యంగానైనా నిజం తెలుసుకున్నందుకు సంతోషించాలో? దాని ప్రస్తుత యజమానికి అర్థంకావడం లేదు అంతే మరి అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది అప్పుడే మనం తలుపు తెరవాలి.


Click it and Unblock the Notifications