విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే కేవలం గంట విమాన ప్రయాణం. విమాన సంస్థలు రూ.3,500 మొదలుకొని రూ.18వేల వరకు సమయాన్ని బట్టి చార్జీలు డిమాండ్ చేస్తున్నాయి. రోజుకు ఐదు విమానాలున్నా కూడా ఇదే డిమాండ్. విశాఖపట్నం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బ్యాంకాక్ విమానం అందుబాటులోకి వచ్చింది. అతి తక్కువ ధరకు విమానాలకు నడిపే ఎయిర్ ఏసియా డిసెంబరు 7న బ్యాంకాక్ నుంచి విమానం నడుపుతోంది. 8న విశాఖ నుంచి బయల్దేరుతుంది.
వారానికి నాలుగు రోజులు ప్రతి సోమవారం,మంగళవారం, గురువారం, శనివారాల్లో నడుస్తుంది. ప్రారంభ ఆఫర్ కింద ఒకవైపు టిక్కెట్ ధర రూ.2,999గా నిర్ణయించారు. అంటే హైదరాబాద్ టిక్కెట్ కంటే తక్కువ. విశాఖ నుంచి నడిచే విమానాలన్నింటిలో(జగదల్‌పూర్ తప్ప) ఇదే తక్కువ ధరగా చెప్పుకోవచ్చు. అంటే దేశీయ ధర కంటే తక్కువకే విదేశీ యానం చేసే అవకాశం. దీనికి వీసా కూడా అవసరం లేదు. ఆరు నెలల గడువు కలిగిన పాస్‌పోర్టు, అందులో రెండు పేజీలు ఖాళీ వుంటే చాలు. ఎంచక్కా బ్యాంకాక్ ఎగిరిపోవచ్చు. మూడు గంటల ప్రయాణం. టిక్కెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

థాయిలాండ్ కు భారతదేశం చాలా ముఖ్యం అని థాయిలాండ్ పర్యాటక శాఖ డైరెక్టర్ చోలాడ సిద్ధార్థన్ అన్నారు. గత సంవత్సరం, భారతదేశం నుండి 1.2 మంది పర్యాటకులు థాయిలాండ్ సందర్శించారు మరియు ఈ సంఖ్య ఈ సంవత్సరం 1.4 మిలియన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఆమె అన్నారు.థాయిలాండ్ పర్యాటకులకు, ప్రత్యేకించి భారతీయులకు స్నేహపూర్వక దేశంగా ఉంది అని ఆమె తెలిపింది
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications