For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చివరి క్షణంలో బతికిపోయిన ఈరోజు దేశీయ మార్కెట్

By girish
|

దేశీయ స్టాక్‌మార్కెట్ల వరుస నష్టాలకు సోమవారం (అక్టోబరు 8) బ్రేక్ పడింది. గత సెషన్‌లో భారీ నష్టాలను మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. ఉదయం ట్రేడింగ్ నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఓ దశలో సెన్సెక్స్‌ 338 పాయింట్లు నష్టపోయి 34,038కి చేరుకోగా.. నిఫ్టీ సైతం 109 పాయింట్లు కోల్పోయి 10,206 స్థాయికి పడిపోయింది. తర్వాత కోలుకున్న మార్కెట్లు లాభాల్లో కొనసాగడంతో.. సెనెక్స్ 34636.43 స్థాయికి వెళ్లింది. నిఫ్టీ కూడా 10400 స్థాయికి చేరువగా వెళ్లింది. తర్వాత మళ్లీ నష్టాల్లోకి మళ్లినప్పటికీ.. చివరి గంటలో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో మార్కెట్లు ఎట్టకేలకు లాభాలతో ముగిశాయి.

చివరి క్షణంలో బతికిపోయిన ఈరోజు దేశీయ మార్కెట్

చివరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 97.39 పాయింట్ల లాభంతో 34474.38 వద్ద, నిఫ్టీ 31.6 పాయింట్ల లాభంతో 10348.05 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 28 పైసలు క్షీణించి మరోసారి 74.04 కనిష్ఠ స్థాయికి పతనమైంది.

ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌పీసీఎల్, రిలయన్స్, యస్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, కొటక్ మహింద్రా షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. మరోవైపు.. వేదాంత, హిండాల్కో, టెక్ మహింద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో తదితర షేర్లు టాప్ లూజర్లుగా మిగిలాయి.

లాభాల్లో ముగిసిన నిఫ్టి షేర్లలో హెచ్‌పీసీఎల్‌ అగ్రస్థానంలో ఉంది. ఈ షేర్‌ 8.5 శాతం లాభపడింది. తరవాత ఎస్‌ బ్యాంక్‌, ఐఓసీ,రిలయన్స్‌, హీరో మోటో కార్ప్‌ అయిదు శాతం వరకు లాభపడ్డాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో వేదాంత షేర్‌ పది శాతం క్షీణించగా, హిందాల్కో 7 శాతం తగ్గింది. టెక్‌ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్‌, విప్రో షేర్లు మూడు శాతం వరకు నష్టంతో క్లోజయ్యాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి కొత్త నిబంధనలను ఆర్బీఐ ప్రవేశపెట్టవచ్చన్న వార్తలతో దీవాన్‌ హౌసింగ్‌ 20 శాతం క్షీణించింది.

Read more about: stock market
English summary

చివరి క్షణంలో బతికిపోయిన ఈరోజు దేశీయ మార్కెట్ | Stock Market Today

Sensex slips on Monday on heavy selling by a steep fall in domestic stock markets. In the last session, the stock markets closed with heavy losses. Morning trading started in losses.
Story first published: Monday, October 8, 2018, 16:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X