హైదరాబాద్‌లో మరో కంపెనీ.. భారీ పెట్టుబడులు ఏంటో మీరే చూడండి.
హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు కోసం దాదాపు రూ. 3 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ హార్డ్ వేర్, టెక్నాలజీ దిగ్గజం క్వాల్‌కామ్ ముందుకొచ్చింది.

తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత రాష్ట్రానికి భారీ పెట్టుబడుల్లో ఇది కూడా ఒకటి. క్వాల్‌కామ్ ప్రాజెక్టు ఏర్పాటులో భాగంగా మొదటి దశలో పది వేల మంది ఉద్యోగులు పని చేసేందుకు వీలుగా 17 లక్షల చదరపు అడుగుల కార్యాలయాన్ని నిర్మించబోతున్నట్టు కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ను కలిసి వివరించారు.

తరువాత ఇదే
అమెరికాలోని శాన్ డిగో ప్రధాన కార్యాలయం తరువాత ఇదే అతి పెద్ద క్యాంపస్ కానుంది. మొబైల్ ఫోన్ టెక్నాలజీలో 5జీ సర్వీసులతో పాటు రిమోట్ సర్వీసులకు సంబంధించిన పరికరాల తయారీలో క్వాల్‌కామ్ ముందు వరుసలో నిలుస్తోంది

క్వాల్‌కామ్‌కు
ఈ క్యాంపస్ నిర్మాణం పనులను వచ్చే ఏడాది నుంచి ప్రారంభించనున్నట్టు కంపెనీ ప్రతిపాదించింది. 2004 నుంచి హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్న క్వాల్‌కామ్‌కు ప్రస్తుతం నగరంలో 4 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.

మంత్రి కేటీఆర్
హైదరాబాద్‌లో యాపిల్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ వంటి దిగ్గజ సంస్థలు తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేశాయని ఇప్పుడు వారి సరసన క్వాల్‌కామ్ కూడా నిలవనుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇలాంటి కంపెనీలు మరిన్ని హైదరాబాద్ రాబోతున్నాయని అందుకోసం తాము కృషి చేస్తున్నామని తెలిపారు.
ట్విట్టర్ ద్వారా
2019 లో క్వాల్‌కామ్ తన పని మొదలుపెట్టాలని భావిస్తోంది ఇప్పటికే ఇండియాలో మెట్రో నగరాలలో బెంగుళూరు, చెన్నై, మరియు హైదరాబాద్ లో తన ఉనికి చాటుకుంటోంది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం తన ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.


Click it and Unblock the Notifications