హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులకు ఒక శుభవార్త అదిఎంటి అంటే త్వరలోనే మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులకు పాస్ లు ఇవ్వనుంది. ఇది డిసెంబర్ లో ఇవ్వనున్నారు.

మొబిలిటీ కార్డుతో
నెల పాసుల జారీ విషయం పై మంతనాలు జరపాలి అని హైదరాబాద్ మెట్రోల్ రైల్ లిమిటడ్ L & T యజమాన్యాని కోరింది. ఇక ఈ మెట్రో పాస్ కామన్ మొబిలిటీ కార్డుతో లింక్ అవుతుంది అంటే ఈ కార్డు ఆర్టీసీ బస్సులకి మరియు ఇతర వాహనాలకు వాడచ్చు

యం.వీ.ఎస్.రెడ్డి
ఇక మెట్రో ప్రయాణికులకు నెల పాసుల విషయం పై పరిశీలిస్తున్నాము అని తెలిపారు మెట్రో ఎండీ యం.వీ. ఎస్. రెడ్డి. ఇక ఈ పాసులను అందరికి అందుబాటు ధరలలో ఉండేలాగా చూస్తాము అని అయన చెప్పారు. ఇక దీనికోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము అని అయన తెలిపారు.

ఆర్టీసీ బస్సు
మెట్రో మరియు ఆర్టీసీతో అనుసంధానం అయ్యేలాగా ఒక పాస్ తయారు చేస్తున్నాము అని అయన అన్నారు. ప్రస్తుతం స్మార్ట్ కార్డు పాస్ లాగా పని చేస్తుంది అని అయన చెప్పారు. ఇక మెట్రో రైలు దిగగానే ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు ఒక కామన్ టికెట్ తయారు చేస్తున్నాము అని అయన చెప్పారు.

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా
కామన్ మొబిలిటీ కార్డు జారీ చేసేందుకు ఇప్పటికే L & T మెట్రో రైలు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా తో అగ్రిమెంట్ కూడా కుదుర్చికొంది రవాణా వ్యవస్థలో సదుపాయాల ఏర్పాటు విషయంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో స్మార్ట్ టికెట్ వ్యవస్థ పై ఆర్టీసీ మరియు మెట్రో రైలు చేర్చించడం కాదు డెమో కూడా ఇవ్వడం జరిగింది.

ప్రైవేట్ రవాణా
ఇక ఇది ఒక ప్రభుత్వ రవాణా సంస్థకే కాదు ప్రైవేట్ రవాణా సంస్థలకు కూడా అదే ఓలా. ఉబెర్ ఇవి కూడా ఇందులో భాగస్వామి అవుతాయి అని చెప్పారు.


Click it and Unblock the Notifications