SBI అకౌంట్ వినియోగదారులకి శుభవార్త! ఏంటో మీరే చూడండి.
స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా తమ అకౌంట్ ఉన్నవారికి గత కొంత కాలంగా నడ్డివిరుస్తునే ఉంది! మొన్న మినిమం బ్యాలన్స్, పెనాల్టీతో మరియు నిన్న ఇప్పటి వరకు రోజుకు ఏటియం కార్డు నుంచి గరిష్ట విత్ డ్రా పరిమితి రూ.40000 వరకు ఉంది. SBI అకౌంట్ ఉన్నవారు రోజుకు రూ.20 000 మాత్రమే విత్ డ్రా చేసుకోగలరు.

శుభవార్త
ఇవ్వని చేసిన స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా నేడు తమ అకౌంట్ ఉన్నవారి ఒక మంచి శుభవార్త చెప్పింది అది ఏంటో తెలుసా? మాతృశాఖ మినహా ఇతర శాఖలో చేసే నగదు డిపాజిట్ పై ఉన్న పరిమితిని ఎత్తివేస్తున్నట్లు బ్యాంకు అధికారులు ప్రకటించారు.

ఎక్కువ మొత్తంలో
ఇంతకముందు ఇతర బ్రాంచులలో రూ.25000 మించి నగదు డిపాజిట్లను అనుమతించేవారు కాదు. దింతో ఎక్కువ మొత్తంలో నగదు డిపాజిట్ చేసేవారు తమ అకౌంట్ ఉన్న బ్యాంకుకు మాత్రమే వెళ్ళవలసివచ్చేది.కనుక అకౌంట్ ఉన్నవారు పడుతున్న కష్టాలు చూసి స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకొంది అని సమాచారం.

బ్యాంక్ మిత్రగా
మీరు కూడా బ్యాంక్ మిత్రగా మారి నెలకు 30-40 వేలు సంపాదించొచ్చు. అసలు బ్యాంక్ మిత్ర ఏంటీ? ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఏమేం సర్వీసులు అందించాల్సి ఉంటుంది? తెలుసుకోండి.

జీతంతో
మీరు ఏ బ్యాంకుకైనా బ్యాంక్ మిత్ర కావొచ్చు. దీన్నే కస్టమర్ సర్వీస్ పాయింట్ అని కూడా అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే బ్యాంక్ మిత్ర మినీ బ్యాంకుగా పనిచేస్తారు. అంటే బ్యాంకులో లభించే సర్వీసుల్లో చాలావరకు బ్యాంక్ మిత్ర అందిస్తారు. బ్యాంకు నుంచి నెలనెలా జీతంతో పాటు ఖాతాదారులకు అందించే సర్వీసుల ఆధారంగా కమిషన్ లభిస్తుంది.

ప్రభుత్వ స్కీమ్
బ్యాంకు మిత్ర చాలా సేవలు అందిస్తారు. ఖాతా తెరవడం, నగదు జమ చేయడం, విత్‌డ్రా చేసుకోవడంతో పాటు వేర్వేరు ప్రభుత్వ స్కీమ్‌లను ప్రజలకు చేరువ చేసే బాధ్యత బ్యాంక్ మిత్రది

18 ఏళ్ల
ఎవరైనా బ్యాంక్ మిత్ర కావొచ్చు. వయస్సు 18 ఏళ్ల పైన ఉండాలి. కనీసం 10వ తరగతి పాస్ కావాలి. కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ తప్పనిసరి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. అయితే అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. కంప్యూటర్, ప్రింటర్, ఇంటర్నెట్ కనెక్షన్, 100 స్క్వేర్ ఫీట్ ఆఫీస్ ఉండాలి. సీఎస్పీ ఏర్పాటుకు లోన్ కూడా ఇస్తుంది బ్యాంకు.

కావాలసిన పత్రాలు
ఐడీ ప్రూఫ్ (ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కంటే ఇతర ప్రభుత్వ గుర్తింపు). నివాస ధృవపత్రం, వ్యాపారం నిర్వహించే చిరునామా, 10వ తరగతి మెమో, పోలీసుల నుంచి క్యారెక్టర్ సర్టిఫికెట్, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌బుక్, క్యాన్సల్డ్ చెక్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి

సేవలు
సేవింగ్స్ ఖాతా తెరవడం, లావాదేవీలు, ఆర్‌డీ, ఎఫ్‌డీ, ఓవర్‌డ్రాఫ్ట్ సేవ, కిసాన్ క్రెడిట్ సేవలు, ఇన్సూరెన్స్ సర్వీసులు, మ్యూచువల్ ఫండ్ అమ్మకాలు, పెన్షన్ అకౌంట్, అన్ని రకాల బిల్ చెల్లింపులు, టికెట్ బుకింగ్, పాన్ కార్డ్ సేవలు అందించొచ్చు


Click it and Unblock the Notifications