గత కొన్ని వారాలుగా రూపాయి రికార్డు స్థాయిలో పతనం కావడం అలాగే ముడి చమురు ధరలు పెరగం వంటి కారణాల వల్ల నిత్యవసర వస్తువులపై పెను ప్రభావం చూపింది.
గత కొన్ని వారాలుగా రూపాయి రికార్డు స్థాయిలో పతనం కావడం అలాగే ముడి చమురు ధరలు పెరగం వంటి కారణాల వల్ల నిత్యవసర వస్తువులపై పెను ప్రభావం చూపింది.దీనికి గల ప్రధాన కారణాలు ఏంటో మరియు సామాన్యుడి కష్టాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

పెట్రోల్ ధరలు:
పెట్రోల్ ధరలు ప్రస్తుతం సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి.చరిత్రలో ఎన్నడూ లేని విదంగా ధరలు లీటరుకు రూ.90 రూపాయలు దాటి రూ.100 రూపాయల వైపు పురుగులు తీస్తోంది.ప్రజలు వాహనాలు బయటకు తియ్యాలంటే బెంబేలెత్తి పోతున్నారు.

పెరిగిన దరల కారణంగా:
పెరిగిన దరల కారణంగా సామాన్యుడు వాహనాల్లో తిరగడం ఆపేసి సైకిల్ పై ప్రయాణించడం మొదలు పెట్టారు.తాను సంపాదించే జీతంలో ఎక్కువ శాతం డబ్బు ఇంధన ధరలకు ఖర్చు అవుతోందని ఇంకొంత మంది తమ సొంత వాహనాలు సైతం పక్కన పెట్టేసి సిటీ సర్వీసుల్లో ప్రయాణం చేస్తున్నారు.

పెట్రోల్ పై సుంకం:
మనం రూ.90 రూపాయలు పెట్టి కొంటున్న లీటర్ పెట్రోల్ పై సుంకం సుమారు రూ.45 రూపాయలు చెల్లిస్తున్నాం.ఇందులో కేంద్రానికి అలాగే రాష్ట్రానికి సంబంధించి పన్ను వేరుగా ఉంటుంది.కేంద్రం దేశమంతటా పెట్రోల్ పై వీకే పన్ను విదిస్తుంది కానీ రాష్ట్రాలు తమ ఆర్ధిక పరిస్థిలు బట్టి పన్నులు విదిస్తుంది.

నిత్యవసర ధరలు:
రూపాయి పతనం కావడం ముడి చమురు ధరలు పెరగడం వంటి కారణాల వల్ల నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి.అధిక దరల గురించి ప్రశ్నిస్తే రూపాయి పతనం కావడం కారణమని వ్యాపారాలు బదులిస్తుండటం విశేషం.కూరగాయల ధరలు ఇంకా చెప్పనవసరం లేదు ఏది కొనాలన్నా ధరలు అధికంగానే ఉన్నాయి.వంట నూనెల ధరలు కూడా బాగా పెరిగాయి.

ప్రభుత్వాలు:
సామాన్యుడు ఇంతగా కష్టాలు పడుతుంటే ప్రభుత్వాలు తమకేం పట్టనట్టు నిమ్మకు నీరేకినట్టు కూర్చున్నాయి.పెరిగిన ధరలకు తమకు ఎటువంటి సంబంధం లేదని అంటున్నారు.కేంద్ర ప్రభుత్వం పై రాష్ట్రాలు అలాగే రాష్ట్రాలపై కేంద్రం పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి.

2014 ఎన్నికల ముందు:
గత 2014 ఎన్నికల ముందు మోడీ సర్కారు అధికారం కాయం అని తెలిసిన నేపదంలో
అనుకోకుండా రూపాయి పెరగడం అలాగే పెట్రోల్ ధరలు అమాంతరంగా తగ్గించడం జరిగింది.దీన్ని గమనించిన ప్రజలు తమకు మంచి రోజులు వచ్చాయని నమ్మి మోడీ కి ఓట్లు వేసి గెలిపించారు కానీ అసలు విషయం నెమ్మదిగా ప్రజలకు అర్థమైనది కేవలం ఎన్నికల సందర్బంగా ధరలు తగ్గించారని అధికారం లోకి రాగానే బాదుడు మొదలు పెట్టారని.

పెద్ద నోట్ల రద్దు:
2016 నవంబరు 8 అర్ధరాత్రి దేశ ప్రజలు నివ్వెరపోయే వార్త వెలువడింది అదే పెద్ద నోట్ల రద్దు దాదాపు 80 శతం చమనిలో ఉన్న 500 మరియు 1000 రూపాయల నోట్లను కేంద్రం రద్దు చేసింది.కానీ ప్రజలు మౌనం వహించారు ఇదంతా తమ బాగుకోసమే అని ఈ నోట్ల రద్దు ద్వారా విదేశాల్లో ఉన్న నాలా ధనం తిరిగి దేశానికి రాపిస్తామని నమ్మబలికారు ఇది విన్న ప్రజలు పాపం అమాయకులు అష్ట కష్టాలు పడి భరించారు.తమ డబ్బు తాము తీసుకోవాలన్న గంటల తరబడి బ్యాంక్ వద్ద పైగాపులు కాసారు.కానీ చివరకు ప్రజలకు మేలు జరగడం అటుంచితే అదనపు భారం వచ్చి పడింది.ఎపుడు కూడా కొన్ని ప్రాంతాల్లో నోట్ల కొరత కొనసాగుతోంది.

జిఎస్టి:
ప్రజలు నోట్ల రద్దు నుండి తేరుకోక ముందే కేంద్రం మరో బాంబు పేల్చింది అదే జిఎస్టి (వస్తువులు మరియు సేవ పన్ను).దీని ప్రభావం వల్ల దేశం లో ప్రతి వస్తువు పై పన్ను శాతం అమాంతరంగా పెరిగింది.కేంద్రం ఈ జిఎస్టి వలన దేశం అంతటా ఓకే పన్ను అమలు చేస్తుందని ఊదరకొట్టారు కానీ రాష్ట్ర పన్ను కేంద్ర పన్ను రెండు వేరు వేరుగా వసూలు చేస్తున్నారు.

ఇదే అదునుగా:
ఇదే అదునుగా కొంతమంది వ్యాపారస్తులు ధరలు అమాంతరంగా పెంచేశారు,ఇదేంటి అని అడిగితే జిఎస్టి అని చెప్పి ప్రజలను నిలువునా దోచేస్తున్నారు మనం కొనే ప్రతి వస్తువులో సుమారు 10 నుండి 20 శతం దాక పన్ను రూపం లో వసూలు చేస్తున్నారు.చాల మంది ప్రజలకు ఎప్పటి కి తెలీదు జిఎస్టి అంటే ఏంటో అసలు ఎందుకు కడుతున్నామో కూడా తెలియకుండా డబ్బు చెల్లిస్తూనే ఉన్నారు.

దళారులు:
రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేక గగ్గోలు పెడుతున్నారు.ఉదాహరణకి విక kg టమోటా రైతుల నుండి రూ.5 రూపాయలకు కొనుగోలు చేస్తారు అవి మార్కెట్ కి వచ్చి ప్రజలకు చేరే సమయానికి రూ.40 రూపాయలు చేరుతోంది అంటే మధ్యలో రూ.35 రూపాయలు ఎవరి ఖాతాల్లోకి వెళుతున్నట్టు ప్రభుత్వాలకు ఈ విషం తెలీదా అంటే వారికి తెలిసి కూడా చోద్యం చూస్తున్నారు.కేవలం ఎన్నికల సమయం లో కనిపించే నాయకులు తమ సమస్యలు పట్టించుకోడం లేదని ప్రజలు వాపోతున్నారు.

నెలసరి జీతం:
ఒక సామాన్య ఉద్యోగి నెలకు రూ.20 ,000 జీతం సంపాదిస్తే కూరగాయలకు అలాగే పెట్రోల్ ఖర్చులకే అధిక డబ్బు పోతుంటే ఇంక ఇంటి అద్దె,కరెంటు బిల్లు,పిల్లల ఫీజులు,సరుకులు వంటి వాటికి డబ్బు ఎక్కడినుండి తేవాలి అని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

వైద్య ఖర్చులు:
ప్రస్తత కాలంలో వైద్య ఖర్చులు భారీగా పెరిగాయి.ఏ చిన్న వైద్యానికి వెళ్లాలన్న వేళల్లో ఖర్చు కావాల్సిందే.సామాన్య ప్రజలు రోగాలు వస్తే వైద్య చికిత్సలకు పోయే బదులు భాదను బరించడమే మేలు అని అలానే భరిస్తున్నారు ఇంక ఏదైనా పెద్ద ఆరోగ్య సామ్య వస్తే వైద్యానికి డబ్బు లేక ప్రాణాలు సైతం వదిలేస్తున్నారు.ప్రభుత్వాలు ఎప్పటికైనా కళ్ళు తెరచి ప్రజలు పడుతున్న బాధలకు పరిష్కారం చూపకుంటే రానున్న రోజుల్లో బతుకులు మరింత దుర్భరంగా తయారవుతాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications