For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్రోల్ ధరల పై కేంద్రం శుభవార్త రూ.2.50 రూపాయిలు కట్!

By girish
|

రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలకు సామాన్యుడి నడ్డి విరుగుతోంది. ఒక మధ్యతరగతి వ్యక్తి మారుతున్న కాలానికి మరియు తన అవసరాలకి అంటే తన ఇంటికి, సరుకులకు మరియు సామాన్లకు అప్పు చేస్తున్నాడు కానీ ఇప్పుడు పెట్రోల్ మరియు డీజల్ కొనడానికి కూడా అప్పు చేస్తున్నాడు ఊహించుకోండి ఇలా ఉందొ పరిస్థితి. సామాన్యుడిని పెట్రోల్ ధరల నుంచి రక్షించడానికి కేంద్రం ఈరోజు ఒక కీలక ప్రకటన చేసింది అదిఎంటొ చూద్దామా!

 జైట్లీ

జైట్లీ

ఊహించినట్లే కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌పై సుంకం తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. లీటరుకు పెట్రోల్‌పై రూ. 1.50 డీజిల్‌పై రూ 1.50 ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడించారు. ఆయిల్‌ కంపెనీలు రూ. 1 చొప్పన రాయితీ ఇస్తాయి. మొత్తంగా రూ. 2.50 తగ్గింపు ప్రకటించారు. ఆయన కొద్ది సేపటి క్రితం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బాగా పెరిగాయి. బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 86 డాలర్లను దాటింది. దీంతో కరెన్సీ మార్కెట్‌తో పాటు స్టాక్‌ మార్కెట్‌పై పడిందని జైట్లీ అన్నారు. విదేశాల నుంచి ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు రుణ రూపంలో నిధులు తీసుకు వచ్చేందుకు ఆర్బీఐ అనుమతించిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. రెవిన్యూ, పెట్రోలియం శాఖతో తాను చర్చలు జరిపినట్లు తెలిపారు.

భేటీలు

భేటీలు

పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని నరేంద్ర మోడీ సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయమై పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధాని మోడీ మధ్య చర్చలు కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. రబీ సీజన్ ప్రారంభంలోనే చమురు ధరలు భారీగా పెరగటంపై ప్రధాని అంసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉపశమన చర్యలు తీసుకోవాలని పీఎంఓ కార్యాలయానికి ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ప్రధాని కార్యాలయ అధికారులు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. దీంతో పెట్రోలియం శాఖ మంత్రి ధర్మాన ప్రధాన్‌తో జైట్లీ చర్చించారు. ఇరువురి మధ్య ఈ విషయమై చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చినప్పటి నుంచి ఇవాళ కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకోవచ్చని అధికార వర్గాలు సూచన ప్రాయంగా తెలిపారు.

ఎన్నికలు కీలకం

ఎన్నికలు కీలకం

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ఒక్క రూపాయి తగ్గించినా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కల్గుతుందని అధికారులు వాదిస్తూ వచ్చారు. అయితే అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏదో ఒక ఉపశమనం కల్గించి తీరాలని ప్రధాని ఆదేశాలు జారీ చేశారు.

Read more about: petrol
English summary

పెట్రోల్ ధరల పై కేంద్రం శుభవార్త రూ.2.50 రూపాయిలు కట్! | Petrol, Diesel Prices to Reduce by Rs 2.5 per Litre as Centre Cuts Excise Duty

As expected, the Center has decided to reduce the duties on petrol and diesel. Petrol to Rs. Finance Minister Arun Jaitley said 1.50 per unit hike in excise duty on diesel
Story first published: Thursday, October 4, 2018, 15:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X