ఎట్టకేలకు చందా కొచ్చర్ రాజీనామాను ఆమోదించారు.
చాందా కొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ పదవికి రాజీనామా చేసారని ధ్రువీకరించారు, ఆమె స్థానంలో సందీప్ బక్షిని భర్తీ చేయనున్నారు.
చాందా కొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ పదవికి రాజీనామా చేసారని ధ్రువీకరించారు, ఆమె స్థానంలో సందీప్ బక్షిని భర్తీ చేయనున్నారు.వాస్తవానికి కొచ్చర్ పదవి కాలం మార్చి 2019 వరకు ఉంది, 56 సంవత్సరాల కోచార్, ముందుగానే విరమణ కోరినట్లు బ్యాంకు తెలిపింది. ఆమె వెంటనే డైరెక్టర్ల బోర్డు నుంచి పదవీ విరమణ చేసిందని, ప్రైవేటు సెక్టార్ బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంక్లో ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గ పనిచేస్తున్న మిస్టర్ బక్షిని భర్తీ చేయనున్నారు.

ఐసీఐసీఐ-వీడియోకాన్ ఉదంతంపై సమగ్ర విచారణ చేసేందుకు ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటి ఇంకా ఎలాంటి నివేదికను ఇవ్వలేదు. ఈ సమయంలో కొచ్చర్ రాజీనామాను బోర్డు ఆమోదం తెలపడం పలు అనుమానాలను తావునిస్తుంది
బక్షి యొక్క నియామకం రేగులటరీ మరియు ఇతర ఆమోదాలు లోబడి ఉందని , ICICI బ్యాంక్ చెప్పారు. అతను అక్టోబరు 3, 2023 ఐదు సంవత్సరాల వ్యవధిలో పనిచేయనుంన్నాడు.
చందా కొచ్చర్ రాజీనామాకు బోర్డు తెలపడంతో ఐసీఐసీఐ బ్యాంకు షేరు 5.50శాతం లాభపడింది. నేడు 303.6 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో రాజీనామా ఆమోదం అంశం అమల్లోకి రావడంతో ఇన్వెస్టర్లు షేరు కొనుగోళ్లకు మొగ్గు చూపారు..మధ్యాహ్నం గం.2:45ని.లకు షేరు గతముగింపు ధర(రూ.303.6)తో పోలిస్తే 4శాతం లాభంతో రూ.315.85వద్ద ట్రేడ్ అవుతోంది.
అలాగే బ్యాంక్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఐన MD మాల్య రాజీనామాను అంగీకరించినట్లు ICICI బ్యాంక్ పేర్కొంది. ఆరోగ్య కారణాల వల్ల మాల్య మానివేశారు అని తెలిపింది.


Click it and Unblock the Notifications