ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు వరాల జల్లు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పధకాలను ఎప్పుడు ఎలా అమలు చేయాలో బాగా తెలిసిన రాజకీయ నాయకుడు ఇదే ఇప్పుడు విమర్శకుల నుండి బాగా వినిపిస్తున్న మాట.

తెలుగు దేశం ప్రభుత్వం

తెలుగు దేశం ప్రభుత్వం

తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా శక్తి సంఘాల సభ్యులకి పసుపు-కుంకుమ పేరుతో విడతలుగా వారి అకౌంట్ లో నగదు జమ చేసింది. డేటా నమోదులో దొర్లిన తప్పులు సాఫ్ట్ వేర్ సమస్యలు వల్ల చాలామందికి ఈ నిధులు అందలేదు. తమ గ్రూప్లలో కొందరికి నగదు అంది తమకి అందలేదు అని లోలోపల మదన పడుతున్నారు.

 పరిటాల సునీత

పరిటాల సునీత

అయితే ఈ విషయాలను గుర్తించిన ప్రభుత్వం మిగిలిన వారికీ కూడా నగదు అందేలాగా చర్యలు ప్రారంభించింది. ఇటీవల సామర్లకోటలో పర్యటించిన పరిటాల సునీత ఈ మేరకు DRDA పి.డీ కి ఆదేశాలు జారీ చేసింది. నగదు అందని మహిళల కోసం ఒక యాప్ కూడా తయారు చేశారు. సదరు మహిళా ఏ గ్రూప్ లో నమోదు చేసుకొంది అని సిబ్బంది నమోదు చేసి ప్రభుత్వానికి పంపనున్నారు.ఈ ప్రక్రియను DRDA సిబ్బంది ప్రారంభించారు.

పసుపు - కుంకుమ

పసుపు - కుంకుమ

డబ్బులు పొందలేని మహిళలను మండల కేంద్రాలలో ఉన్న స్త్రీ శక్తి కార్యాలయాలకు రప్పిచ్చి వారి వివరాలను కొత్తగా తయారు చేసిన యాప్ లో పొందుపరుస్తున్నారు. త్వరలోనే వారి బ్యాంకు అకౌంట్లో నగదు జమ అయ్యేలాగా చేస్తున్నారు. ఇది డ్వాక్రా మహిళలు ఎంతో ఆనందపడే విషయం. ఎవరికైతే పసుపు - కుంకుమ పధకంలో డబ్బులు అందలేదో వారికీ ఈ సౌకర్యాన్ని కలిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు.

నిరుద్యోగ భృతి

నిరుద్యోగ భృతి

ఇక ఇది ఇలాగ ఉంటే తమ్ముళ్ల కోసం అండగా ఉంటా అంటూ నిరుద్యోగ భృతి పధకాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు చంద్రబాబు నాయుడు. ఈ పథకాని తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చాలా ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. నిజమైన నిరుద్యోగికి ఒక రూపాయి అందిన దాఖలాలు లేవు.ఇంకేముంది ఇది కూడా ఒక ఓటు పధకం అని అందరికి అర్థమైంది. ఎప్పుడో జరిగే పండగకోసం ఇప్పుడే ఇల్లు చక్కపెడుతన్నారు అని అందరికి అనిపిస్తోంది.

 నిజానికి ప్రతి నిరుద్యోగికి

నిజానికి ప్రతి నిరుద్యోగికి

ఏదిఏమైనా ఎన్నికలు దగ్గరకి వస్తున్నాయి అని ఏదో హడావిడి చేస్తున్నారు తప్ప ఇందులో ఏమి విశేషం లేదు అని అంటున్నారు చాలామంది. నిజానికి ప్రతి నిరుద్యోగికి రావలసింది రూ.2000 అది అప్పుడు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. బాబు వస్తే జాబ్ రాణి పక్షాన ఈ పధకాన్ని తెస్తాము అని చెప్పారు కానీ ఏది అప్పటినుంచి నోచుకోలేదు. అయితే ఇప్పుడు యువ నేస్తం అని పేరిట ఈ పధకాన్ని అమలు చేసారు చంద్రబాబు నాయుడు మరియు అయన కొడుకు లోకేష్ బాబు.

 ఒక ఉద్యోగం

ఒక ఉద్యోగం

ఏదిఏమైనా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వరాల మీద వరాలు ఇచ్చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తుండడంతో ఇలా చేస్తున్నారు అని కొందరి మాట. ఎలాగైనా యువతకి కావలసింది నెలకి రూ.1000 కాదు వారికీ ఒక దారి చూపే ఒక ఉద్యోగం అది మనం అంత తెలుసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+