ఇటీవల వాట్సాప్‌లో బాగా ఫేమస్ అయిన పే స్లిప్ ఇది! ఒక స్వీపర్‌కు లక్షన్నరజీతమా! ఇదేదో ఫేక్ అయి ఉంటుంది!' అని అనుకున్నారు. కానీ. ఇది అక్షరాలా నిజం! ఆమె మొత్తం జీతం 1,47,722 రూపాయలు!

విద్యుత్తు శాఖలో
ఆమె మాత్రమే కాదు ఇలా లక్షకు పైబడి జీతం తీసుకునే నాలుగో తరగతి ఉద్యోగులు డిస్కమ్‌లలో చాలామందే ఉన్నారు. విద్యుత్తు శాఖలో ఉద్యోగం అంటే వేతనాల వరం పొందినట్లే. ఇదంతా సంస్కరణల ఫలం! మొదట్లో విద్యుత్తు శాఖను ఆంధ్రప్రదేశ్ ఎలక్ర్టిసిటీ బోర్డు అని పిలిచేవారు.

ఉమ్మడి రాష్ట్ర
ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు విద్యుత్తుశాఖలో సంస్కరణలకు తెరలేపారు. బోర్డు పోయింది. ‘కంపెనీ'లు వచ్చాయి. విద్యుత్తు ఉత్పత్తికి.. జెన్‌కో! సరఫరాకు.ట్రాన్స్‌కో ఏర్పడ్డాయి. ట్రాన్స్‌కోలో మళ్లీ ప్రాంతాల వారీగా డిస్కమ్‌లను ఏర్పాటు చేశారు.

ఇంక్రిమెంట్లు
ఈ సంస్కరణలు సం చలనం సృష్టించాయి. ఉద్యోగుల్లో ఆందోళన తలెత్తింది. పదవీ విరమణ తర్వాత పెన్షన్ రాకపోవడం దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో భరోసా నింపేందుకు అప్పటి ప్రభుత్వం భారీ ఎత్తున వేతనాలు పెంచింది. ఇంక్రిమెంట్లు కూడా అదే స్థాయిలో నిర్ణయించింది.

ఆరు అంకెల్లోకి
అన్ని హోదాల ఉద్యోగులూ మంచి వేతనాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే సర్వీసు బాగా ఉన్న స్వీపర్, అంటెండర్ల జీతం ఐదంకెలను దాటి ఆరు అంకెల్లోకి చేరింది. ట్రాన్స్‌కో సీఎండీకంటే 30 ఏళ్ల సర్వీసు ఉన్న చీఫ్ ఇంజనీర్ జీత భత్యమే ఎక్కువకావడం విశేషం!

వెంకట రమణమ్మ
రాజమండ్రి తాడితోట ప్రాంతానికి చెందిన కోల వెంకటరమణమ్మ 1978లో 16వ ఏటనే విద్యుత్తు శాఖలో రోజువారీ ఉద్యోగిగా చేరారు. ఆమె తల్లి కూడా అక్కడే స్వీపర్‌గా పని చేసేవారు. 1981 ఏప్రిల్ 1న రమణమ్మ పర్మినెంట్ ఎంప్లాయ్ అయ్యారు. అప్పటి నుంచి రాజమహేంద్రవరం సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయంలోని విద్యుత్ చౌర్య నిరోధక విభాగంలోనే పని చేస్తున్నారు. ఇప్పటికే ఆమె సర్వీసు 40 ఏళ్లు దాటింది. రిటైర్‌మెంట్‌కు మరో నాలుగేళ్లు ఉంది. సుదీర్ఘ సర్వీసు కావడంతో జీతం కూడా భారీగా పెరుగుతూ వచ్చింది. రమణమ్మ ఉదయం 8 గంటలకు భోజనం డబ్బాతో వచ్చి రాత్రి 8 గంటలకు ఇంటికి వెళతారు.

రమణమ్మకు
రమణమ్మ అంటే అందరికీ గౌరవం. తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చేయడం ఆమె నైజం. రమణమ్మకు ఇద్దరు కుమారులు. రైల్వేలో చేసే భర్త వీరభద్రరావు చనిపోవడంతో ఆయన ఉద్యోగం ఒక కుమారుడికి వచ్చింది. మరో కొడుకు గుండె జబ్బు, ఫిట్స్‌తో బాధపడుతున్నాడు.

ముఖ్యమంత్రి పిలుపుతో
ఇటీవల ఇల్లు కట్టుకోవడం కోసం లోన్ తీసుకున్నట్లు రమణమ్మ తెలిపారు. ఆమె ఏమీ చదువుకోలేదు. కనీసం సంతకం పెట్టడం నేర్చుకోవాలన్న ముఖ్యమంత్రి పిలుపుతో పట్టుదలతో సంతకం పెట్టడం మాత్రం నేర్చుకున్నారు.


Click it and Unblock the Notifications