కార్లు, స్మార్ట్ టీవీలు , కూలర్లు, ఫ్రీజ్ లు మోటార్ సైకిళ్లు ఇలా అన్ని సగం ధరకే ఇస్తాము అంటే ఎవరన్నా ఏమి చేస్తారు వాటిని కొనేందుకు ఎగబడతారు. ఇదే బలహీనతను ఆసరాగా తీసుకోని వరంగల్ కాసి బుగ్గకు చెందిన ఒక వ్యక్తి సుమారు రూ.2 కోట్లు అందరిని మోసం చేసాడు.

హైదరాబాద్ లో
మోసం చేసిన వ్యక్తి హైదరాబాద్ లో డయాగ్నసిస్ సెంటర్ నడుపుతూ ఈ దందా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఏదన్నా సగం ధరకే అని నమ్మించడంతో ఒక్కొక్కరు రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు మోసపోయారు. గత నాలుగు రోజులుగా అతని ఫోన్ స్విచ్ అఫ్ వస్తుండడంతో బాధితులు లబోదిబో అని అంటున్నారు.

మోసగాడు
ఇక గత రెండుళ్లుగా అతడు కాశీబుగ్గ లోనే కాకుండా హైదరాబాద్ లో కూడా ఇదే తరహాలో మోసాలకు పాల్పడుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఆ మోసగాడు లగ్జరీ మైంటైన్ చేస్తూ అందరిని మోసం చేస్తున్నాడు అని అంటున్నారు. అతడు విలాసవంతమైన హోటళ్లలో మాత్రమే ఉంటాడు అని బాధితులు చెబుతున్నారు.

యువకులను
ఇద్దరి ముగ్గురి వద్ద డబ్బులు సేకరిస్తే 4 లేదా 5 నెలల తర్వాత వారికీ వస్తువు ఇచ్చే వాడు అని బాధితులు చెబుతున్నారు. ఇటీవల ఒక కారు సగం ధరకే ఇవ్వడంతో అతని పై మరింత నమ్మకం కుదిరింది అని బాధితులు చెబుతున్నారు.అదేకగా కొందరి యువకులను బ్యాంగ్ కంగ్ వరకు తీసుకెళ్లాడు అని సమాచారం.

కాశీబుగ్గకి
బాధితులలో కాశీబుగ్గకి సంబందించిన ఒక పరపతి సంఘానికి సంబంధిచిన కొంతమంది వ్యక్తులు ఎక్కువ ఉన్నారు అని పలువురు అంటున్నారు. మోసపోయినవారు అంత వ్యాపారులు కావడంతో బయటకు చెబితే ఆదాయ పన్ను వారు వస్తారు ఎమ్మో అని మదనపడుతున్నారు. డబ్బులు ఇచ్చిన్నట్లు అధరాలు లేకపోవడం విశేషం కానీ కొందరు బాధితులు పోలీస్ స్టేషన్ కి రావడానికి సిద్ధం అయ్యారు అని సమాచారం.


Click it and Unblock the Notifications