ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి యువనేస్తం పథకంతో నిరుద్యోగ బ్రూతిని AP లో నిరుద్యోగులకు అందించనుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుద్యోగ భృతి వెబ్సైట.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి యువనేస్తం పథకంతో నిరుద్యోగ బ్రూతిని AP లో నిరుద్యోగులకు అందించనుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుద్యోగ భృతి వెబ్సైటు yuvanestham.ap.gov.in ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ లో 12 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుంది. అంతేకాక, ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ఈ నిరుద్యోగ భృతి ద్వారా యువత వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు దోహద పడుతుందన్నారు. ఇదికాకుండా, కొత్త రిజిస్ట్రార్ సమాచారాన్ని రియల్ టైం లోకి తీసుకురావడానికి ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించబడింది.

ముఖ్యమంత్రి యువనేస్తం
అంతేకాదు AP ముఖ్యమంత్రి యువనేస్తం పోర్టల్ లో నిరుద్యోగ అభ్యర్థుల పేర్లను మాత్రమే నమోదు చేయడమే కాకుండా నిరుద్యోగులకు మరియు నైపుణ్యం కలిగిన వారికీ అలాగే పరిశ్రమలకు / సంస్థలకు ఉపాధి వేదికగా పనిచేస్తుంది. ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్సైట్ బహుళ ప్రయోజన ఉపయోగం కోసం రూపొందించబడింది మరియు IT మరియు ఉన్నత విద్య అవకాశాల గురించి సమాచారాన్ని అందిస్తోంది.

మొబైల్ యాప్ కూడా
AP ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్సైటు కు అనుబంధంగా, యువనేస్తం మొబైల్ యాప్ కూడా త్వరలో గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో రానుంది. మీరు మీ మొబైల్ ఫోన్ నుండి యువనేస్తం యాప్ డౌన్ లోడ్ చేసుకొని మీ వివరాలు నమోదు చేసి కావాల్సిన సమాచారం పొందవచ్చు అంటున్నారు.

2014 ఎన్నికల్లో
గత 2014 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ భృతి కూడా ఒకటి.ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఇటీవలే ఈ పథకం అమలుకు పచ్చ జెండా ఊపారు.ఈ పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనుంది.

అక్టోబర్ 2
అక్టోబర్ 2 ,అనగా గాంధీ జయంతి నాడు ఈ పథకం IT శాఖా మంత్రి నారా లోకేష్ ద్వారా ప్రారంభించనున్నట్టు స్వయానా ముఖ్యమంత్రి నిన్న జరిగిన సమావేశం లో ప్రకటించారు.ప్రతి యువ నిరుద్యోగికి నెల నెల రూ.1000 రూపాయల భృతి అందనుంది. ఈ పథకం ద్వారా నిరుద్యోగ సమస్యను తగ్గించాలని ప్రభుత్వ లక్ష్యం అని చంద్రబాబు పేర్కొన్నారు.

మంత్రి నారా లోకేష్
ఈ పథకం మొత్తం మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో ఉంటుందని చెప్పారు.దీనికోసం ఇప్పటికే పెద్దఎత్తున కసరత్తు మొదలైందని పేర్కొన్నారు,మంత్రి రాష్ట్రము లో ఉన్న నిరుద్యోగ యువత సంఖ్య మరియు కావాల్సిన సమాచారం మొత్తం అధికారురుల ద్వారా సేకరిస్తున్నారని అన్నారు.

పంట సంజీవని
అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ పంట సంజీవని అమలులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని చెప్పారు. శాసనసభలో నదుల అనుసంధానంపై నిర్వహించిన చర్చ సందర్భంగా వ్యవసాయంలో సుస్థిరత సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సిఎం చంద్రబాబు వెల్లడించారు.


Click it and Unblock the Notifications