మరోసారి రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన పెట్రోల్ ధరలు.
ముంబైలో 91 రూపాయల చొప్పున లీటర్ పెట్రోలు ధరలు పెరిగాయి.ముంబైలో ఆదివారం రూ.90.84 రూపాయల నుండి పెరిగి ప్రస్తుతం లీటరుకు రూ.91.08 ధరకు విక్రయిస్తోంది
ముంబైలో 91 రూపాయల చొప్పున లీటర్ పెట్రోలు ధరలు పెరిగాయి.ముంబైలో ఆదివారం రూ.90.84 రూపాయల నుండి పెరిగి ప్రస్తుతం లీటరుకు రూ.91.08 ధరకు విక్రయిస్తోంది అలాగే ముంబయిలో డీజిల్ ధర రూ.0.32 రూపాయలు పెరిగి, లీటరుకు 79.72 రూపాయలు ధర నమోదయినది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.83.73 రూపాయలు, డీజిల్ ధర రూ.75.09 రూపాయల వద్ద రిటైలింగ్ అవుతోంది.

ఇతర నగరాల్లో దరలు
ఇతర నగరాల్లో పెట్రోలు దరల విషయానికొస్తే, బెంగళూరులో రూ.84.40 రూపాయలు, కోల్కతాలో రూ.85.53 రూపాయలు, చెన్నైలో రూ.87.05 రూపాయలు, లక్నోలో రూ.83.03 రూపాయలు ఉన్నాయి అలాగే డీజిల్ ధర బెంగళూరు లో రూ.75.48 కోల్కతాలో రూ .76.94, చెన్నైలో రూ .79.40 , లక్నోలో రూ. 75.22 రూపాయలుగా ఉన్నాయని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఒసి) పేర్కొంది.

స్థానిక వ్యాట్
ధరలు స్థానిక వ్యాట్ రేట్లు ప్రకారం మారుతూ ఉంటాయి. తక్కువ పన్నులు కారణంగా ఢిల్లీలో చౌకగా ఇంధన ధరలు ఉన్నాయి. మరోవైపు ముంబైలో అత్యధిక పన్ను కారణంగా ధర ఎక్కువ ఉంది. మహారాష్ట్రలో పెట్రోల్ పై 25 శాతం విలువ-ఆధారిత పన్ను (వ్యాట్), రాష్ట్ర వ్యాప్తంగా లీటర్కు 9 రూపాయలకు అదనంగా ఉంది. డీజిల్ పై, వ్యాట్ 21 శాతం ముంబయిలో ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా లీటర్కు 1 రూపాయి సర్ఛార్జ్ ఉంది. గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో లీటరు పెట్రోలు రూ.90 రూపాయలకు పైగా విక్రయం జరుగుతోంది.

ముడి చమురు ధరలు
ఇంధన ధరలు పెరగడంతో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ చమురు ధర గత వారం బ్యారెల్ కు $ 80 దాటింది, ఇది బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం, నేడు బ్యారెల్కు 83.21 డాలర్లు విక్రయిస్తోంది. బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్ మార్క్ 100 డాలర్లు తాకే అవకాశం ఉందని ఎనర్జీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పలు రాష్ట్రాలు:
సామాన్యుడిపై భారాన్ని తగ్గించే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్, కర్నాటక, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాలు ఇంధన ధరలను తగ్గించాయి. విదేశీ మారకపు ఒడిదుడుకుల వల్ల, ఢిల్లీలో నాన్-సబ్సిడైజ్డ్ LPG సిలిండర్ ధర రూ. 59 చొప్పున పెరిగింది.. కొత్త ధరలు నేడు నుండి అమలులోకి వచ్చాయి. సబ్సిడైజ్డ్ వంట గ్యాస్ ధర కూడా సిలిండర్కు రూ.2.89 రూపాయల చొప్పున పెరిగి రూ .502.4 కు చేరింది.


Click it and Unblock the Notifications