టెలికాం రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుడుతూ కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగేసింది. కొత్త టెలికాం విధానానికి కేంద్ర కేబినెట్ బుధవారం (సెప్టెంబర్ 26) ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చెరకు రైతుల కోసం గత జూన్‌లో రూ.8500 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం తాజాగా మరో రూ.4500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. చక్కెర ఎగుమతి కోసం మిల్లులకు రవాణా రాయితీ కింద ఈ ప్యాకేజీని పంపిణీ చేయాలని నిర్ణయించింది.

'జాతీయ టెలి కమ్యూనికేషన్ పాలసీ 2018'కు ఆమోదం తెలపడం కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయం. దీంతో అతి త్వరలో నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ (ఎన్‌డీసీపీ) 2018 అమల్లోకి రానుంది. దీని ద్వారా కొత్తగా 40 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నారు. ఈ లక్ష్యంతోనే కొత్త విధానాన్ని రూపొందించామని కేంద్ర సమాచార మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు.
కొత్త టెలికాం పాలసీ ప్రధాన లక్ష్యాలు
- అందరికీ బ్రాడ్ బాండ్ సేవలను అందించడం.
- 5జీ టెక్నాలజీతో సెకనుకు 50 మెగా బిట్స్ (ఎంబీపీఎస్) వేగంతో బ్రాడ్‌బాండ్ సేవలు.
- తక్కువ ధరలకే డిజిటల్ కమ్యూనికేషన్ సేవలు.
- సమాచార గోప్యతకు ప్రాధాన్యం. సురక్షితమైన బ్రాడ్‌బాండ్ సేవలు.
- టెలికాం రంగంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం.
- 2020 నాటికి కొత్తగా 40 లక్షల ఉద్యోగాల కల్పన.
- టెలికం రంగాన్ని అప్పుల ఊబి నుంచి బయటపడేయడం.
- ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ఇండెక్స్‌లో భారత్‌ను టాప్ 50 దేశాల్లో ఒకటిగా నిలపడం.
సురక్షితమైన, సరసమైన డిజిటల్ కమ్యూనికేషన్ సేవలను అందించాలనేది తమ లక్ష్యమని మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. 5జీ టెక్నాలజీ సాయంతో హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను మెరుగుపర్చడం, అందుబాటు ధరల్లో సేవలను తీసుకురావడమే లక్ష్యమని ఆయన తెలిపారు. టెలికాం రంగంలో పెట్టుబడులను మరింతగా ఆకర్షించే ఉద్దేశంతో ఈ కొత్త పాలసీ తీసుకొస్తు్న్నట్లు చెప్పారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించింది..
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications