యజమాని అంటే ఇలా ఉండాలి ఉద్యోగులకి కార్లు గిఫ్ట్!
సూరత్‌కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి సావ్జి డోలకియా ఈయన అందరికీ బాగా ప్రతి ఏటా తమ ఉద్యోగులకు ఖరీదైన బహుమతులు ఇస్తూ వార్తల్లో ఉంటారు. ఇళ్లు, కార్లు, వజ్రాలు, ఆభరణాలు ఇలా ఎంతో విలువైన గిఫ్ట్స్ ఇస్తూ ఆశ్చర్యంలో ముంచెత్తుతారు.

బెంజ్ కార్లను
ఐతే ఈసారి కూడా తమ సిబ్బందికి అద్దిరిపోయే కానుకలు ఇచ్చారు ఈ మనసున్న వ్యాపారి. హరికృష్ణ డైమండ్స్ ఎక్స్‌పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్న వారిలో ముగ్గురిని ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేసి బెంజ్ కార్లను బహుమతి ఇచ్చారు.

కోటి రూపాయల
సూరత్‌లో బహుమతుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గుజరాత్ మాజీ సీఎం ఆనందీ బెన్ పటేల్ చేతుల మీదుగా ఉద్యోగులకు గిఫ్ట్స్ అందుకున్నారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ గవర్నర్ సైతం హాజరయ్యారు. ఇక HR ఎక్స్‌పోర్ట్స్ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఇటీవల కారు ప్రమాదంలో చనిపోయారు. వారి కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయం కూడా అందించారు డోలకియా.

తొలిసారి కాదు
డోలకియా ఉద్యోగులకు కానుకలు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. 2016లో దీపావళి కానుకగా మొత్తం 1716 మంది ఉద్యోగులకు ఎంపిక చేసి బహుమతులు ఇచ్చారు. అందుకోసం ఏకంగా రూ.51 కోట్లు ఖర్చు చేశారు. కొందరికి పాట్లు ఇస్తే, మరికొందరికి కార్లు ఇఛ్చారు. ఇంకొంత మందికి బంగారు ఆభరణాలు, వజ్రాలు గిఫ్ట్‌గా ఇచ్చారు.

తన కుమారుడు
అంతేకాదు వేల కోట్లకు అధిపతి అయిన డోలకియా 2016లో తన కుమారుడు ద్రావ్యకు విచిత్ర పరీక్ష పెట్టారు. నెల రోజుల పాటు నిరుపేదగా బతకాలని కండిషన్ పెట్టారు. రూ.7వేలు, 3 జతల బట్టలు ఇచ్చి కొచ్చికి పంపారు. తండ్రి పేరు ఎక్కడా చెప్పకుండా, మొబైల్ వాడకుండా ఉండాలని ప్రతి పైసా కష్టపడి సంపాదించాలని చెప్పారు. వారానికి మించి ఒకే చోట పనిచేయకుండా నెల రోజుల బతకాలని సూచించారు. అలా తండ్రి పెట్టిన పరీక్షలో పాసైన ద్రావ్య అనంతరం తమ కంపెనీలోనే ఉద్యోగంలో చేరారు


Click it and Unblock the Notifications