ట్రంప్ కి ఇండియన్స్ మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది?

అమెరికాలో గడువుమీరి నివసిస్తున్నమన ఇండియన్స్ విడిచి వెళ్లాల్సిన పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగింది. హెచ్‌-1బీ వీసాదారులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు.

వీసా హోల్డర్లకు

వీసా హోల్డర్లకు

ఉపాధి, శరణార్థులకు సంబంధించిన పిటిషన్‌లకు ఇప్పట్లో ఈ విధానాన్ని అమలు చేయబోవట్లేదని అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) స్పష్టతనివ్వడంతో వారికి ఉపశమనం కలిగించినట్లయింది. ఇది ఎల్-1 వీసా హోల్డర్లకు కూడా వర్తిస్తుంది.

 అక్టోబర్‌ 1 న

అక్టోబర్‌ 1 న

వీసా పొడిగింపు, మార్పుల కోసం పెట్టుకున్న దరఖాస్తులు తిరస్కరించినవారిని స్వదేశాలకు పంపించే ప్రక్రియ అక్టోబర్‌ 1 న ప్రారంభం అవుతుంది. ఇటీవల కాలంలో హెచ్‌-1బీ వీసా పొడిగింపు కోసం వచ్చిన దరఖాస్తులు భారీ సంఖ్యలో తిరస్కరణకు గురయ్యాయి. వీటిలో అధికశాతం భారతీయులవే ఉన్నాయి.

కొత్త నిబంధన

కొత్త నిబంధన

అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వచ్చాక హెచ్‌-1బీ వీసాదారులకు నోటీసులు జారీ చేయమని అమెరికా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో ఆ వీసా కలిగి ఉన్న భారతీయులకు తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది.

అమెరికాలో

అమెరికాలో

తాజా నిర్ణయంతో అమెరికాలో ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్న భారతీయులపైనే అధిక ప్రభావం పడే అవకాశాలున్నాయి. కొత్తగా అమల్లోకి వస్తున్న నిబంధన ప్రకారం వీసా గడువు పొడిగింపునకు నోచుకోని, వీసా స్టేటస్‌లో కోరుకున్న మార్పులు పొందనివారికి ‘నోటీస్‌ టు అప్పియర్‌' (ఎన్‌టీఏ) జారీచేస్తారు. ఈ పత్రాలు అందినవారు ఇమిగ్రేషన్‌ జడ్జి ముందు హాజరుకావాల్సి ఉంటుంది.

గ్రీన్‌కార్డు కోసం

గ్రీన్‌కార్డు కోసం

గ్రీన్‌కార్డు, వీసా దరఖాస్తులో తప్పులు దొర్లినా, జత చేయాల్సిన డాక్యుమెంట్లలో ఏవైనా లోపించినా అమెరికా వీసా కోసం పెట్టుకున్న దరఖాస్తు, పిటిషన్‌ లేదా విజ్ఞప్తిని (హెచ్‌1బీ సహా) ఆ దేశ అధికారులు ఇప్పుడు తిరస్కరించవచ్చు. వీసా లేదా గ్రీన్‌కార్డు కోసం చేసుకున్న దరఖాస్తులు అసంపూర్తిగా ఉంటే వాటిని సరిచేసుకునేందుకు దరఖాస్తుదారులకు గతంలో ఉన్న అవకాశం ఇప్పుడుండదు.

 ఈ నెల

ఈ నెల

అమెరికాలో చట్టపరంగా శాశ్వత నివాసులుగా (గ్రీన్‌కార్డ్‌పై) ఉం డేందుకు, తాత్కాలికంగా అక్కడ నివసిస్తూ ఉద్యోగం (నాన్‌ ఇమిగ్రెంట్‌) చేసే వారు లేదా అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారిపైనా ఈ నిబంధన ప్రభావం పడుతుంది. ఈ నెల 11 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధన విధానపరంగా పెద్దమార్పుగానే భావిస్తున్నారు. 2013లో ఒబామా హయాంలో ప్రవేశపెట్టిన నిబంధన స్థానంలో ట్రంప్‌ ప్రభుత్వం ఈ కొత్త మార్పు తీసుకొచ్చింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+