ముంబయి: ముంబయి-కోల్కతా ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన ప్రయాణికుడు క్యాబిన్ లోకి ప్రవేశించి ఫోన్ ఛార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించగా సిబ్బంది అతడిని విమానం లోనుండి గెంటేసారు అని ఎయిర్లైన్ తెలిపింది.
ముంబయి: ముంబయి-కోల్కతా ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన ప్రయాణికుడు క్యాబిన్ లోకి ప్రవేశించి ఫోన్ ఛార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించగా సిబ్బంది అతడిని విమానం లోనుండి గెంటేసారు అని ఎయిర్లైన్ తెలిపింది.
సోమవారం ముంబై నుంచి బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ప్రయాణికుడిని విమానం నుండి దింపేసారు మరియు ఎయిర్లైన్స్ యొక్క భద్రతా సిబ్బంది ముంబై విమానాశ్రయ పోలీసు స్టేషన్కు తరలించారు. అతడిని సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాత విడిచిపెట్టారని, నివేదికలు చెబుతున్నాయి.
ఒక ఇండిగో విమానం నేలపై ఉండగా, ఒక అపరిచిత ప్రయాణీకుడు కాక్పిట్లోకి ప్రవేశించి , అతను తన మొబైల్ను ఛార్జ్ చేయాల్సిన ఉందని చెప్పాడని ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
ముంబయి నుంచి కోల్కతాకు 6E-395 విమానాన్ని నడుపుతున్న కెప్టెన్ భద్రతా ఉల్లంఘన కారణంగా ప్రయాణికుల ఆఫ్లోడింగ్ను ప్రారంభించారు అని ఎయిర్లైన్స్ పేర్కొంది, కాక్పిట్లో కి ఎవ్వరిని అనుమతించలేదని పేర్కొన్నారు.
అధికారి ఒకరు ప్రెస్ ట్రస్ట్ అఫ్ ఇండియా తో మాట్లాడుతూ కాక్పిట్ లోకి ప్రవేశించిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని పేర్కొన్నాడు.
ఇలాంటి సంఘటనే ఒకటి, ఢిల్లీ నుంచి పాట్నాకు వెళ్లే గోఏయిర్ విమానంలో ప్రయాణీకుడు విమానం గాల్లో ఉండగా వెనుక తలుపును తెరిచేందుకు ప్రయత్నించారు, అతడిని విచారించగా టాయిలెట్ తలుపు అనుకోని తెరవబోయానని వివరణ ఇచ్చాడు. అతను విమాన ప్రయాణం చేయడం ఇదే మొదటిసారి అని తెలిపారు.
అతడు తలుపు తెరిచేందుకు ప్రయత్నిస్తుండగా మరో ప్రయాణికుడు అలారం మోగించగా వెంటనే సిబ్బంది అప్రమత్తమై అతడిని ఆపివేశారు.
అతడిని విమాన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) కు అప్పగించారు.విచారణ తరువాత విడిచిపెట్టారు.


Click it and Unblock the Notifications