For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్ లో నెంబర్ వన్ ధనవంతుడు పిచ్చి రెడ్డి !

By girish
|

హురున్‌ సంపన్నుల జాబితా 2018 విడుద‌లైంది. దీని ప్రకారం.. తెలంగాణలో ఏడాది కాలంలో సంపన్నుల సంఖ్య 38 నుంచి 49కి పెరిగింది. వీరిలో 46 మంది హైదరాబాద్‌లోనే ఉన్నారు. వీరందరిలో పి పిచ్చి రెడ్డి (మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌) సంపద (రూ.13,000 కోట్లు)నే అధికంగా ఉంది. (వాస్త‌వానికి అర‌బిందో ఫార్మా కంపెనీ యజ‌మాని పీవీ ఆర‌మ‌ సుబ్బారెడ్డి సంప‌ద రూ. 15,200 కోట్ల‌తో హైద‌రాబాద్‌లో ఆయ‌న అగ్ర‌స్థానంలో ఉన్నా.. ఆయ‌న త‌న నివాస స్థ‌లం న్యూ జెర్సీగా పేర్కొన‌డంతో నంబ‌ర్ వ‌న్ స్థానం పిచ్చి రెడ్డికి ద‌క్కింది). ఈయన 61వ స్థానంలో నిలిచారు. 62వ స్థానంలో ఉన్న హెటెరో డ్రగ్స్‌ సారథి బి పార్థసారథి రెడ్డి, ఆయన కుటుంబ సంపద రూ.12,800 కోట్లుగా ఉంది. త‌ర‌వాతి స్థానం మ‌ళ్ళీ మేఘాకే ద‌క్కింది. మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కే చెందిన పివి కృష్ణా రెడ్డి 66వ స్థానంలో నిలిచారు. ఈయన సంపద రూ.12,400 కోట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు సంపన్నులు పెరగడంతో మొత్తం సంపన్నుల సంఖ్య ఆరుకు చేరింది. వీరిలో రామచంద్ర ఎన్‌ గల్లా ఆయన కుటుంబం సంపద అధికంగా ఉంది. జాబితాలో మైహోమ్‌ ఇండస్ర్టీస్‌ అధినేత జూపల్లి రామేశ్వర రావు, ఆయన కుటుంబం సంపద రూ.8,100 కోట్లు (113వ స్థానం)గా ఉంది.

హైదరాబాద్ లో నెంబర్ వన్ ధనవంతుడు పిచ్చి రెడ్డి !

నాట్కో ఫార్మా చైర్మన్‌ విసి నన్నపనేని (రూ.7,000 కోట్లు-131), ఎంఎస్‌న్‌ లాబొరెటరీస్‌ అధినేత ఎం సత్యనారాయణ రెడ్డి, ఆయన కుటుంబం (రూ.5,000 కోట్లు -187), అపోలో హాస్పిటల్స్‌ చైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి (రూ.4,900 కోట్లు-190), నూజివీడు సీడ్స్‌ చైర్మన్‌ ఎం ప్రభాకర్‌ (రూ.4,100 కోట్లు -221), అమర రాజా బ్యాటరీస్‌ చైర్మన్‌ రామచంద్ర ఎన్‌ గల్లా, ఆయన కుటుంబం (రూ.4,100 కోట్లు-221), డాక్టర్‌ రెడ్డీస్‌ చైర్మన్‌ కె సతీష్‌ రెడ్డి (రూ.3,100 కోట్లు -283), దివీస్‌ లాబొరెటరీస్‌ చైర్మన్‌ మురళీ దివీ (రూ.3,100 కోట్లు-283), జిఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ జిఎం రావు (రూ.2,800 కోట్లు-322), జివికె బయోసైన్సెస్‌ చైర్మన్‌ జివి సంజయ్‌ రెడ్డి (రూ.2,800 కోట్లు-322), నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ చైర్మన్‌ సి విశ్వేశ్వర రావు (రూ.2,200 కోట్లు-332), నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీకి చెందిన చింతా శశిధర్‌ (రూ.2,000 కోట్లు-434), సైయెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ బివిఆర్‌ మోహన్‌ రెడ్డి (రూ.1,800 కోట్లు-473), నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ ఎండి చింతా శ్రీధర్‌ (రూ.1,700 కోట్లు-496) జాబితాలో ఉన్నారు ఫ్రొం ఎన్ టీవీ రిపోర్ట్ .

Read more about: hyderabad
English summary

హైదరాబాద్ లో నెంబర్ వన్ ధనవంతుడు పిచ్చి రెడ్డి ! | Richest Man in Hyderabad picchi Reddy

The list of Hurun was released in 2018. The number of rich people in Telangana has increased from 38 to 49 a year.
Story first published: Wednesday, September 26, 2018, 11:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X