కేంద్రం ప్రజలకు మరో షాక్ ఈ అర్ధరాత్రి నుంచి వీటి రేట్లు డబుల్!
కేంద్ర ప్రభుత్వం విలాస వస్తువులపై బేసిక్ కస్టమ్ సుంకాన్ని పెంచాలని నిర్ణయించింది. కేంద్రం 19 విలాస వస్తువులపై దిగుమతి పన్ను పెంచింది. 19 వస్తువులపై కస్టమ్ డ్యూటీ పెంచుతున్నట్టు ఆర్థిక శాఖ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

అర్థరాత్రి
వాషింగ్ మెషీన్, రిఫ్రిజిరేటర్, ఏసీతో సహా 19 వస్తువుల బేసిక్ కస్టమ్ డ్యూటీని 2.5 నుంచి 10 శాతానికి పెంచేసింది. ఏటా దేశంలోకి రూ.86,000 కోట్ల విలువైన విలాస వస్తువుల దిగుమతి జరుగుతోంది. పెరుగుతున్న కరెంట్ అకౌంట్ లోటు సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకొంది. దీంతో దేశంలో అమ్ముడయ్యే విలాస వస్తువుల ధరలు పెరుగుతాయి. ఈ అర్థరాత్రి నుంచే ఈ కొత్త పన్నులు అమల్లోకి రానున్నాయి.

వాషింగ్ మెషీన్లు
వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్ల దిగుమతిపై బేసిక్ కస్టమ్ డ్యూటీ 10 నుంచి 20 శాతానికి పెరిగింది. ఇవి కాకుండా ఏసీ/ఫ్రిజ్ ల కంప్రెసర్ల దిగుమతిపై ఇంపోర్ట్ డ్యూటీని 10 శాతం వరకు పెంచడం జరిగింది.

బంగారం
బంగారం, వెండితో తయారైన ఇంపోర్టెడ్ జువెలరీపై కస్టమ్ డ్యూటీని 15 నుంచి 20 శాతానికి పెంచారు. కట్, పాలిష్డ్ డైమండ్స్, ప్రాసెస్డ్ డైమండ్స్, ఆర్టిఫిషియల్ డైమండ్స్, కట్, పాలిష్డ్ కలర్డ్ జెమ్ స్టోన్స్ పై కస్టమ్స్ డ్యూటీని 5 శాతం నుంచి 7.5 శాతానికి పెంచడం జరిగింది.

ఫుట్ వేర్
ప్లాస్టిక్ టేబుల్ వేర్, కిచెన్ వేర్ లపై కస్టమ్ డ్యూటీని 15 శాతానికి పెంచారు. ట్రావెల్ బ్యాగ్, సూట్ కేసులు, స్పీకర్లపై కస్టమ్ డ్యూటీ 15 శాతానికి పెరిగింది. ఫుట్ వేర్ పై డ్యూటీ 20 శాతం పెరిగి 25 శాతానికి చేరింది. రేడియల్ కార్ టైర్లపై కస్టమ్ డ్యూటీ 10 శాతం నుంచి 15 శాతానికి పెరిగింది. ఇవి కాకుండా ప్రభుత్వం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పై 5 శాతం కస్టమ్ డ్యూటీ విధించింది.


Click it and Unblock the Notifications